అట్లాంటాలో ‘ఆపి’ 37వ కన్వెన్షన్

జూలై 3 నుంచి 7 వరకు

సెలబ్రిటీల తళుకుబెళుకులు.. కళ్లు మిరుమిట్లు గొలిపే స్టాల్స్.. వాహ్వా అనిపించే అద్భుత రుచులు.. ఆడిపాడి ఎంజాయ్‍ చేయించే బాలీవుడ్‍ సింగర్స్.. సంస్క•తికి అద్దం పట్టే.. స్ఫూర్తిని నింపే గీతాలు.. అతిరథ మహారథుల సమ్మేళనం.. చర్చోపచర్చలు.. మేధోమథనం నుంచి పురుడుపోసుకునే విధి విధాన నిర్ణయాలు.. వీటన్నింటికీ వేదిక కాబోతోంది..

అమెరికన్‍ అసోసియేషన్‍ ఆఫ్‍ ఫిజీషియన్స్ ఆఫ్‍ ఇండియన్‍ ఒరిజన్స్ (ఏఏపీఐఐ – ‘ఆపి’).. ఇది భారతీయ మూలాలున్న ఫిజీషియన్ల అమెరికన్‍ అసోసియేషన్‍. వచ్చే జూలై 3వ తేదీ నుంచి నిర్వహించే 37వ వైజ్ఞానిక సదస్సు ప్రధాన అజెండా, విధి విధానాలు నిర్ణ యించేందుకు కిక్‍ ఆస్‍ మీటింగ్‍ డిసెంబరు 2, ఆదివారం ‘ఆపి’ నాయకత్వం అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్‍ సెంటర్‍లో జరిగింది. సదస్సును ఘనంగా నిర్వహించే విషయమై ఇందులో చర్చించారు. నరేశ్‍ పారిఖ్‍ (ఏఏపీఐ ప్రెసిడెంట్‍), శ్రీని గంగసాని (వైస్‍ చైర్మన్‍, ఏఏపీఐ బీవోటీ, కన్వెన్షన్‍ చైర్మన్‍), సుధాకర్‍ జొన్నలగడ్డ (వైస్‍ ప్రెసిడెంట్‍, ఏఏపీఐ), శ్యామల ఎర్రమిల్లి (జీఏపీఐ ప్రెసిడెంట్‍), ఆశా పరిఖ్‍ (జీఏపీఐ బీవోటీ చైర్మన్‍), కన్వెన్షన్‍ కోచైర్మన్లు రఘు లోలభట్లు, పీయూష్‍ పటేల్‍, సుబోథ్‍ అగర్వాల్‍ తదితరుల ఆధ్వర్యంలో, ఇతర కన్వెన్షన్‍ సభ్యుల సహకారంతో ఈ సన్నాహక సమావేశం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిజీషియన్లు, స్పాన్సర్లు, ఎగ్జిక్యూటర్స్ అంతా సమావేశమై.. 37వ కన్వెన్షన్‍ను ఎలా నిర్వహించాలి? అనేది చర్చించడంతో పాటు ఈ ప్రపంచ స్థాయి వేదికపై వైద్య, విజ్ఞానాన్ని, వైద్య రంగంలో ఆధునిక పోకడలను గురించి ప్రపంచానికి చాట నున్నారు.

దాదాపు 20,000 మంది వైద్య విద్యార్థులు, స్థానికులు, విశిష్ట సభ్యులు సహా 80,000 మంది ఫిజీషియన్ల ఆకాంక్షలకు ఏఏపీఐ ప్రాతినిథ్యం వహిస్తోంది. అట్లాంటాలో 2019, జూలై 3వ తేదీ నుంచి జరిగే 37వ వార్షికోత్సవంలో అతిథులు, వారి సహాయకులు సహా 2,500 మంది వరకు హాజరవుతారని అంచనా. ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాలు, వాటి కార్యాచరణ గురించి డిసెంబరు 2న ఏఏపీఐ నాయకత్వ చర్చించింది. బృందంలోని సభ్యులు.. ఎవరెవరు ఏయే పాత్ర నిర్వహించాలో, బాధ్యతలు నిర్వర్తించాలో చర్చించారు.

2019, జూలై 3వ తేదీ నుంచి ప్రారంభ మయ్యే ఏఏపీఐ 37వ వార్షికోత్సవం, వైజ్ఞానిక సమావేశంలో భారతీయ సంతతికి చెందిన పలువురు విద్యావేత్తలు, ప్రముఖ ఫిజీషియన్లు, ఆరోగ్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఒక్కచోట చేరనున్నారు. వీరంతా వివిధ వైద్య సంబంధ అంశాలపై మాట్లాడటంతో పాటు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఫిజీషియన్లు, ఆరోగ్య రంగ నిపుణులు ఈ సమావేశాలకు హాజరై వచ్చే రోజుల్లో వైద్య రంగంలో సంభవించనున్న మార్పులు, ఆధునిక పోకడల గురించిన వైజ్ఞానిక, సైద్ధాంతిక సమాచారాన్ని పంచుకుంటారు.

ఇంకా ముఖ్యంగా హెల్త్ పాలసీ అజెండాల అభివృద్ధి, వైద్య సంబంధిత చట్టాల ప్రాధాన్యాల గురించి చర్చిస్తారు. ఇవే కాకుండా ఇన్‍ పేషంట్‍ కేర్‍, పలు రకాల వైద్య సంబంధ, వైద్య పరిజ్ఞాన విశేషాలు, ప్రాక్టీస్‍ మేనేజ్‍మెంట్‍కు సంబం ధించిన వైజ్ఞానిక ఆవిష్కరణలు, ప్రదర్శనలు, ప్రొడక్ట్ థియేటర్‍ ప్రజెంటేషన్స్ వంటివి కూడా ఉంటాయి.

ఇంకా బాలీవుడ్‍ ప్రముఖులు, వారి సాంస్క• తిక ప్రదర్శనలు, ప్రత్యేక స్టాల్స్, విందు వినో దాల వంటివి ఈ కన్వెన్షన్‍లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఒక చర్చా వేదిక లేదా వర్క్షాపు పద్ధతిలో నడిచే ఈ సదస్సు చికిత్స సంబంధ నిర్వహణలో దీర్ఘకాలిక రోగాలకు దారితీసే పరిస్థితులు, వర్తమాన అంశాలు, సాక్ష్యాధార సహిత సూచనలు, ఆధునిక చికిత్సలు, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన వైద్య విధానాలపై ప్రధానంగా దృష్టి సారించి విధి విధానాలను రూపొందిస్తుంది. ఈ కన్వెన్షన్‍లోని ఒకటి రెండు సెషన్లలో.. సీఎంఈ ఎథిక్స్కు సంబంధించి పలు రాష్ట్రాలలో తప్పనిసరిగా పునరుద్ధరించవలసిన మెడికల్‍ లైసెన్సుల గురించి కూడా సభ్యులు విస్త•తంగా చర్చిస్తారు.

ఇదీ ‘ఆపి’ నేపథ్యం..

విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చే వైద్య విద్యార్థులు ఇమ్మిగ్రేషన్‍, లైసెన్స్ విధానాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి చర్చించడంతో పాటు వివిధ సమస్యల పరిష్కా రానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ప్రధాన లక్ష్యంతో అమెరికన్‍ అసోసియేషన్‍ ఆఫ్‍ ఫిజీషియన్స్ ఆఫ్‍ ఇండియన్‍ ఒరిజన్స్ (ఏఏపీఐఐ – ‘ఆపి’) ఏర్పాటైంది. భారతీయ – అమెరికన్‍ డాక్టర్లు అందరూ ఒక బృందంగా ఏర్పడి 1982లో ‘ఆపి’ని స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో లాభాపేక్ష లేకుండా పని చేసే వైద్య సంబంధ సంస్థల్లో ‘ఆపి’ అతి పెద్దది. అమెరికాలో భారతీయ – అమెరికన్‍ ఫిజీషియన్లతో కూడిన ఏడు పేషంట్‍ విభాగాలు, పూర్వ విద్యార్థులు సహా ప్రాంతీయ, రాష్ట్రీయ ప్రత్యేక విభాగాల సంస్థలతో 160 అంశీభూత చాప్టర్లతో కూడిన వ్యవస్థలతో ఏఏపీఐ అమెరికాలోనే అతి పెద్ద ఆధిపత్య సంస్థగా సేవలను అందిస్తోంది.

అందరి అవసరాలకు అనుగుణంగా ఏఏపీఐ కొన్ని అద్భుతమైన సేవలను అందిస్తోంది. అవన్నీ ఈ 37వ కన్వెన్షన్‍ సందర్భంగా అందరికీ పరిచయం కానున్నాయి. వీటి•తో పాటు సీఎంఈ ఆధ్యర్యంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అధ్యాప కులతో విద్యా సంబంధ విషయాలపై ఏఏపీఐ త్వరలో జరగబోయే 37వ వార్షి కోత్సవంలో విస్త•తంగా చర్చించనుంది. ఇంకా ధార్మిక కార్యక్రమాలతో పాటు ప్రఖ్యాతిగాంచిన బాలీవుడ్‍ సెలబ్రిటీలతో పలు వినోద కార్య క్రమాలను ప్రత్యేక ఆకర్షణగా ఈ కన్వెన్షన్‍లో ప్రదర్శించనున్నారు. జూలై 3వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ కన్వెన్షన్‍ సందర్భంగా.. ఏఏపీఐతో కలిసి ప్రదర్శనలు నిర్వహించడం కోసం దాదాపు 2,000 మంది వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే ఫిజీషియన్లు అందరూ ప్రత్యేక వైద్యంలో, వాటి ఉప విభాగాల్లో నిపుణులైన వారు. అంతేకాక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైద్య కళాశాలల్లో అధ్యాపకులుగా, విభాగాధిపతులుగా, ఆయా ఆసుపత్రుల ముఖ్య అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారంతా ఏఏపీఐలో ఉన్నారు. దీంతో పాటుగా మెడికల్‍, ఫార్మాస్యూటికల్‍ ఉత్పత్తులు, ఉపకరణాలు, వస్తు సామగ్రి, ప్రాక్టీసు సంబంధిత సేవలు, ఆర్థికపరమైన సేవలు, ఆఫీసులకు కావాల్సిన వస్తువులు ఇతర విషయాలకు సంబంధించి అనుభవజ్ఞులైన నిపుణులను ఈ సదస్సు సందర్భంగా కలుసుకునే అవకాశం కలగనుంది. ఈ 37వ ఏఏపీఐ అట్లాంటా సదస్సులో వేలాది మంది ఒకేచోట కలుసుకునే అవకాశం ఉండటం వల్ల పరస్పర సమాచార మార్పిడికి అవకాశం లభిస్తుంది. అందరి ఆశలు, ఆకాంక్షల గురించి చర్చించుకునేందుకు ఇదో అద్భుత వేదిక కానుంది. కాబట్టి సదస్సులో పాల్గొనడానికి ఇప్పటి నుంచే పేర్లను నమోదు చేసుకోవడం ఉత్తమం.

-డాక్టర్‍ కుమార్‍ అన్నవరపు

Review అట్లాంటాలో ‘ఆపి’ 37వ కన్వెన్షన్

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top