ఉత్తరాయణం

అన్నీ ప్రత్యేకమే..

‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక చదివించే శీర్షికలతో అలరిస్తోంది. అయితే, మాదొక విన్నపం.. భక్తుల ఆధ్యాత్మిక యాత్రా విశేషాలకు తెలుగు పత్రికలో చోటివ్వండి. చాలామంది పుణ్య క్షేత్రాలకు వెళ్లాలని ఉన్నా వివిధ కారణాల వల్ల వెళ్లలేరు. అటువంటి వారికి ఇతరుల ఆధ్యాత్మిక యాత్రలు, విశేషాలు, వారికి ఎదురైన అనుభవాలు కొంత లోటును తీరుస్తాయి. కాబట్టి భక్తుల నుంచి ఆధ్యాత్మిక యాత్రా విశేషాలను సేకరించి ప్రచురించగలరు.
– కె.వెంకటేశ్వరరావు- హైదరాబాద్‍, పి.విశేష్‍- తిరుపతి, మదన్‍, కార్తిక్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

ఆధ్యాత్మిక విశేషాలు

‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక డిసెంబరు సంచికలో ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా అందించిన విశేషాలు బాగున్నాయి. ఆధ్యాత్మిక జీవనం గడపడం ఎలాగో, ఈ రోజుల్లో ఆధ్యాత్మిక జీవన ఆవశ్యకత ఏమిటో చాలా చక్కగా వివరించారు. ముఖచిత్ర కథనాలను చాలా వివరంగా అందిస్తున్నారు. అలాగే, ఇతర శీర్షికలు సైతం బాగుంటున్నాయి. ఆరోగ్య భాగ్యం, ఆధ్యాత్మిక వికాసం, పిల్లల పాటలు, సామెతలు, జాతీయాల గురించిన విశ్లేషణ బాగుంటోంది. అలాగే, తెలుగు భాషకు సంబంధించిన మరిన్ని విషయాలను పత్రికలో ప్రచురించండి.
– నవీన్‍కుమార్‍.కె. – అట్లాంటా, క్రిష్‍ – టెక్సాస్‍, రవీందర్‍రెడ్డి- విజయవాడ, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

మంత్రపుష్పం.. మరింతగా

‘తెలుగుపత్రిక’లో ‘మంత్రపుష్పం’ పేరుతో అందిస్తున్న మంత్రార్థ వివరణ బాగుంటుంది. అయితే, దీనిని ఒకే పేజీలో కుదించి ఇవ్వడం బాగాలేదు. మహా మృత్యుంజయ మంత్రం, దక్షిణామూర్తి స్తోత్రాలు, సౌందర్య•లహరి, భజ గోవిందం, కనకధార స్తోత్రం ఇత్యాది మంత్రాలకు అర్థాలను ఒకే సంచికలో పూర్తిగా ఇస్తే బాగుంటుం దనేది మా అభిప్రాయం. ఇలా ఇవ్వడం వల్ల ఆయా మంత్రాల్లోని అర్థం తెలిసి వచ్చి వాటిపై మరింత పవిత్ర భావం ఏర్పడుతుంది. కాబట్టి ఈ దిశగా ఇవ్వడానికి ప్రయత్నించగలరని వినతి.
– ఆర్‍.వెంకటేశ్వర్లు- వరంగల్‍, కిశోర్‍కుమార్‍- హైదరాబాద్‍, సంతోష్‍ – ఖమ్మం, బి.రజిత, సరస్వతి, టి.రవికాంత్‍ – విజయవాడ, మరికొంద

Review ఉత్తరాయణం

Your email address will not be published. Required fields are marked *

Top