ఉత్తరాయణం

వంటల రుచులు బాగున్నాయ్‍..

‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో ‘సూపర్‍డిష్‍’ శీర్షిక కింద అందిస్తున్న కొత్త వంటకాల పరిచయం బాగుంటోంది. ఇంట్లోనే తేలికగా చేసుకోగల వంటకాల గురించి బాగా వివరిస్తున్నారు. అలాగే, ఆధ్యాత్మిక విశేషాలు, తెలుగు భాష – సంస్క•తి, సంప్రదాయాలు, ఆచారాల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. కార్టూన్లు, పరిమితిలోనే ఉంటూ సరదాగా నవ్వించే జోకులు వంటివి కూడా వీలును బట్టి ప్రచురించండి.

-రాగవర్షిణి, హైదరాబాద్‍, రాజ్‍.పి.కుమార్‍, ఆన్‍లైన్‍ పాఠకుడు, అక్షిత్‍, రంగనాథ్‍, పి.మధుకర్‍ మరికొందరు పాఠకులు (ఈ-మెయిల్‍)

ఇంటర్వ్యూ స్ఫూర్తి కలిగించింది..

త్వరలో అమెరికన్‍ అసోసియేషన్‍ ఆఫ్‍ ఫిజీషి యన్స్ ఆఫ్‍ ఒరిజిన్స్ (ఆపి) ప్రెసిడెంట్‍ కాబోతున్న డాక్టర్‍ సుధాకర్‍ జొన్నలగడ్డ గురించి గత సంచికలో అందిం చిన వివరాలు బాగున్నాయి. ఆయన ఎదుగుదల, కెరీర్‍ డెవలప్‍మెంట్‍ ఎంతో స్ఫూర్తి కలిగించాయి. కష్టపడే వారికి ఉన్నత స్థానాలు అంచలంచెలుగా లభిస్తా యనేందుకు ఆయన ఆదర్శంగా నిలుస్తారు. ఇలాగే ప్రతి సంచికలో సక్సెస్‍ఫుల్‍ పర్సన్స్ గురించి వివరాలు అందించండి. అవి ఇతరులకు ఆదర్శంగా నిలవడంతో పాటు స్ఫూర్తిని కలిగిస్తాయి. జీవితంలో విజేతలుగా నిలిచేందుకు ఎందరికో ఇటువంటి శీర్షికలు మార్గ దర్శకంగా నిలుస్తాయి.

-రాజ నరసింహారావు, సీనియర్‍ సిటిజన్‍- హైదరాబాద్‍, వినుకొండ అనిల్‍- గుంటూరు, కేశవ్‍, లలిత్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

సంప్రదాయాల రక్షకి

‘తెలుగుపత్రిక’లో అందిస్తున్న ఆధ్యాత్మిక వికాసం శీర్షిక పత్రిక మొత్తానికి హైలైట్‍గా నిలుస్తోంది. ఈ శీర్షిక కింద విలువైన కథనాలు మాత్రమే ఇవ్వండి. అలాగే, అనగనగా కథలు, పిల్లల పాటలు, ఆధ్యాత్మిక కథ వంటివి కూడా పిల్లలకూ పెద్దలకూ ప్రయోజన కరం అనడంలో సందేహం లేదు. తెలుగు భాష, సంస్క•తులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి ఈ కాలంలో బాధ్యతగా అందిస్తున్న ‘తెలుగు పత్రిక’ కృషి ఫలించాలని మనసారా కోరు కుంటున్నాం. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తెలుగు పిల్లలకే కాదు.. మాతృభూమిలో ఉంటున్న పిల్లలు తప్పనిసరిగా ఈ పత్రికను చదవాలి. మన తెలుగునేల వైభవం గురించి చెప్పి తల్లిదండ్రులు వారి చేత ఈ పత్రికను చదివించాలని విన్నపం.

Review ఉత్తరాయణం

Your email address will not be published. Required fields are marked *

Top