ఉత్తరాయణ

చెప్పలేనంత సంతోషం కలిగింది…
ఎడిటర్‍ గారికి నమస్తే..
నా పేరు యోగితా సరస్వతి. మేము అట్లాంటాలో ఉంటాము. ఈ నెల ఇండియన్గ్రోసరీ స్టోర్‍ లో మీ(మన తెలుగు) పత్రికను మొదటి సారి చూసేసరికి చెప్పలేనంత సంతోషం కలిగింది. చాలా మంచి విషయాలు ప్రచురిస్తున్నారు. అందులో శ్రీరాం గారి అసమానతలో సమానత్వం శీర్షిక చాలా నచ్చింది.
అద •ష్టవశాత్తు మేము చెన్నైలో ఉన్నప్పుడు స్వామీజీ ఆశ్రమంలో దేవాలయంకి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్వామీజీ దర్శనం కలిగింది. పొరుగింటి పుల్లకూర శీర్షికకి ఆ పేరు సరిపోలేదనిపించింది. ఆ సామెత పూర్తిగా రాసి దాని గురించి వివరించి మిగతాది రాస్తే బాగుండనిపించింది. ఇంకా మన అందమైన తెలుగు పదాల ఉనికి కోల్పోతుందని తలచుకుంటేనే చాలా బాధనిపించింది. వాటి అందం తరవాత తరాలవారికి తెలియదు అని అనిపిస్తుంటే వారు తెలుగు భాషకి ఎంత దూరం అవుతున్నారో తలచుకుంటే చాలా బాధ కలుగుతుంది.
పత్రికలో ఇక్కడ ఉంటున్న ఈ తరం మరియు తరవాత తరాలవారికి మాత •భాష మీద పట్టు తప్పిపోవటంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుందన్న విషయం ప్రతి నెలా ఏదో విధంగా కొద్దో గొప్పో చెప్తే బాగుంటుందనిపిస్తుంది.
మర్యాద రామన్న గారిని మరువగలమా చెప్పండి?
ఇంకా యోగి వేమన గారి పద్యం గుర్తు చేసి చాలా మంచి మరియు గొప్ప సందేశం ఇచ్చారు.
పిల్లల ఆటపాటలు పేజీ చూశాక నా చిన్నతనపు ఆటపాటలు గుర్తురాకుండా ఉంటుందా? ప్రతి పేజీ చివరన ఉన్న వాక్యాలు చాలా బాగున్నాయి.
నా తరపున ఒక వాక్యం –
మాత •త్వానికి దాసులయినవారికి భగవంతుడు కూడా దాసుడే కదా.
ఈ విషయం నేను ప్రత్యక్షంగా అనుభవించాను, మా అమ్మ గారి పాదాలకు నమస్కరించాకే బయటకు వేళ్ళటం నాకు అలవాటు. ఇండియాలో రెండు మూడు రోడ్డు ప్రమాదాలు త•టిలో తప్పిపోయాయి. చనిపోవలసింది చాలా చిన్ని రోడ్డు గాయాలతో బయటపడటం జరిగింది. తల్లి ఆశీర్వాదం ఏదో ఒక విధంగా రక్షణ వలయంగా మారుతుంది. ఇంకా చాలా అనుభవాలున్నాయి. అందుకే ఈ వాక్యం రాసాను.
-యోగితా సరస్వతి దండా
తెలుగు పత్రిక బావుంది…
సర్‍ నమస్తే. నాపేరు డా.బల్లూరి ఉమాదేవి.నేను రటైర్డ తెలుగు అసోసియేట్‍ ప్రొఫెసర్‍ని. మాఅబ్బాయి ••, ణ•శ్రీశ్రీ••లో వుండడంవల్ల ఇక్కడికి వచ్చాను.ఈవాళే ‘తెలుగువారి మానస పుత్రిక’ తెలుగు పత్రికను చూశాను చదివాను. బావుంది. నేను పద్యాలు వ్యాసాలు వ్రాస్తుంటాను. ఈ పత్రికకు పంపవచ్చా. తెలుపగలరు.
– డా.బల్లూరి ఉమాదేవి

Review ఉత్తరాయణ

Your email address will not be published. Required fields are marked *

Top