ముఖ్యమంత్రి మహేశ్‍బాబు

మహేశ్‍బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘భరత్‍ అనే నేను’ అనే టైటిల్‍ను దాదాపుగా ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం చాంబర్‍కు చెందిన సన్నివేశాలను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇక, ప్రతిపక్ష నేతగా పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‍ 27న విడుదల చేయడానికి నిర్ణయించినట్టు ఫిల్మ్నగర్‍ టాక్‍. ఇక, ఇది చేస్తూనే మహేశ్‍ మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో యూఎస్‍ బ్యాక్‍డ్రాప్‍లో ఓ చిత్రం తెరకెక్కించడానికి దాదాపు అంతా సిద్ధమైంది. ఇప్పటికీ మ్యూజిక్‍ డైరెక్టర్‍ దేవిశీప్రసాద్‍ ఈ సినిమా కోసం మూడు ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. రకుల్‍ ప్రీతిసింగ్‍ను హీరోయిన్‍గా కన్ఫార్మ్ చేసినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు క్లాప్‍ కొట్టనున్నారు. వంశీ పైడిపల్లి ఇంతకుముందు ‘బృందావనం’, ‘ఊపిరి’ వంటి సినిమాలను రూపొందించిన విషయం తెలిసిందే. మహేశ్‍తో ఆయన చేయనున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Review ముఖ్యమంత్రి మహేశ్‍బాబు

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top