రామోజీ సర్.. ఆలోచించండి
‘చతుర వచ్చిందా?’.. ‘విపుల ఉందా?’.. ఈ మాటలు వింటే ఎవరో కుటుంబసభ్యుల గురించి ఆరా తీస్తున్నట్టుగా అనిపిస్తోందా? కానీ, కుటుంబసభ్యుల కంటే కూడా ఎక్కువే ఇవి. 1978 నుంచి నిరాటంకంగా వెలువడుతోన్న ‘చతుర’, ‘విపుల’.. ఇక మనల్ని పలకరించవు. వీటితో పాటు తెలుగువెలుగు (2012), భాల భాకతం (2013) కూడా. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నష్టాలు భరించలేక వీటి ప్రచురణను నిలిపివేస్తున్నట్టు రామోజీ గ్రూపు తరఫున మేనేజింగ్ ట్రస్టీ