ఉత్తరాయణం

సదాశివ లింగం తురీయ సంధ్యాకాలం, లింగోద్భవ కాలం, పంచభూత లింగాలు నెలకొన్న క్షేత్రాల ప్రాశస్త్యం గురించి వివరిస్తూ తెలుగు పత్రిక మార్చి 2024 సంచికలో అందించిన ముఖచిత్ర కథనం బాగుంది. శివలింగం త్రిమూర్తులతో పాటు శక్తి దేవతకు ప్రతీకగా ఎలా ఉంటుందో, అలాగే వేదాలు నాలుగూ నాలుగు ముఖాలుగా లింగంలో ఎలా ఉంటాయో అనే వివరాలు చాలా కొత్తగా, తెలియని విషయాలు తెలుసుకునేలా ఉన్నాయి. - కె.ఎల్‍.హరిప్రసాద్‍, పి.నారాయణరావు, కమల్‍, ఆర్‍.రవికాంతరావు మరికొందరు

కొత్త జీవితం..

కాలాన్ని భగవత్‍ స్వరూపంగా భావిస్తే ప్రతి రోజూ, ప్రతి నిమిషమూ పండుగే. ఆనందమే. ఇలాంటి భావనే లేకుండా ఆచరించే పండుగలు మన జీవితంలో ఎన్ని వచ్చినా దండుగలే. పవిత్ర భావన లేకుండా చేసుకునే పండుగ నాడు పిండివంటలూ, పండుగ వంటలూ కడుపారా తింటే రజస్తమోగుణాలు కలగడమే తప్ప సాత్త్విక ప్రవృత్తి లభించదు. పండుగల నాడు ఇలాంటి పవిత్ర భావన కలగాలనే ఉద్దేశంతోనే మన పూర్వులు ప్రతి పండుగకూ ఒక అధిష్టాన దేవతనూ, పూజ, నియమాలూ,

ఉగాదికి స్వాగతం.. శ్రీరాముడికి జయం

తెలుగు వారి తొలి పండుగ ఉగాది. తెలుగు వారి తొలి పూజ శ్రీరామ నవమికే.. ఈ రెండు పర్వాలు చైత్రంలో వస్తాయి. శ్రీమన్నారాయణుని అవతారాల్లో మానవజాతికి అత్యంత హితమూ, ఆదర్శమూ అయినది శ్రీరామావతారం. సీతారామలక్ష్మణులూ, భరత శత్రుఘ్నులూ తెలుగు వారికే కాక, విశ్వమానవ కుటుంబానికే నిరంతర స్మరణీయ మూర్తులు శ్రీరాముని అరణ్యవాసం ఎక్కువ భాగం తెలుగునాటనే జరిగిందని అంటారు. రామావతార ప్రయోజనసిద్ధికి అవసరమైన బీజాలు ఇక్కడే మొలకెత్తాయి. అందరి హృదయాల్లో ఆనందమూర్తియై రమించే వాడు రాముడు. రామశబ్దం పరమాత్మ వాచకం

ఎవరు గొప్ప?

పూర్వం ఒక అడవిలో అనేక రకాలైన పక్షులు ఉండేవి. అవి ఆ అడవిలో దొరికిన ఆహారాన్ని తిని సుఖంగా, స్వేచ్ఛగా జీవిస్తుండేవి. అలాగే, ఒక్కోసారి వాటికి వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉండేది. వారి బారి నుంచి ఎలాగో తప్పించుకుని ఆనందంగా ఆ అడవిలో జీవిస్తుండేవి. ఇదిలాఉండగా, ఒకరోజున ఆ అడవిలోకి ఎక్కడి నుంచో ఒక ముసలి కోతి వచ్చింది. అది కొద్దికాలానికే ఆ అడవి జంతువులతో బాగా కలిసిపోయింది. వాటితో

శివరాత్రి.. విష్ణుధాతి

2024- మార్చి 1, శుక్రవారం, మాఘ బహుళ షష్టి నుంచి 2024- మార్చి 31, ఆదివారం, ఫాల్గుణ బహుళ షష్టి వరకు.. శ్రీశోభకృతు నామ సంవత్సరం- మాఘం- ఫాల్గుణ మాసం -శిశిర రుతువు-ఉత్తరాయణం ఆంగ్లమానం ప్రకారం మార్చి నెల సంవత్సరంలో మూడో నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మాఘ-ఫాల్గుణ మాసాల తిథుల కలయిక. మాఘ మాసంలోని కొన్ని రోజులు, ఫాల్గుణ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. మార్చి

Top