పరవశమే.. పరమశివా!

బుద్ధిని శివుడిలో నిలిపి ధ్యానం చేసేవాడు సాక్షాత్తూ శివుడే అవుతాడట! భక్తుడిలోని భక్తికి, చిత్తశుద్ధికి వశమయ్యేవాడు శివుడు. అందుకే ఆయన భక్తవశంకరుడు. ఈ విశ్వానికే నాథుడు- విశ్వనాథుడు. ఈ సృష్టిలోని అణువణువూ ఆయన చైతన్యానికి నిదర్శనమే.. ఈ సృష్టిలోని ప్రతి కదలికా ఆయన తాండవమే.. ఆ మహా దేవదేవుడిని స్మరించే రోజే- శివరాత్రి. శివనామ స్మరణం, రుద్రాక్ష ధారణం, విభూతి ధారణం.. ఈ మూడూ శివచిహ్నాలు. వీటిని పాటించే వారిని తీర్థదేహులని అంటారు. అంటే- తరించిన వారని అర్థం. ఏ

పలుకు తేనెల తల్లి

సర:’ అంటే కాంతి. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. జనజీవితాలను జ్ఞాన, కాంతిమంతం చేసే మాతృశక్తి, అక్షరజ్ఞానాన్ని ఒసగే మంత్రశక్తి- శ్రీ సరస్వతీమాత. సాహిత్యం, సంగీతం అనే రెండు అమృత కలశాలను మానవాళికి ప్రసాదిస్తున్న జగన్మాత ఆమె. సకల కళారూపిణి అయిన సరస్వతీదేవి అక్షరానికి అధిదేవత. ప్రణవ స్వరూపిణి. జ్ఞానానంద శక్తి. లౌకిక, అలౌకిక విజ్ఞాన ప్రదాయిని. శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు. మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ

‘కొత్త’ సందేశం

‘‘హ్యాపీ న్యూ ఇయర్‍’’ ఇలా కొత్త సంవత్సరం తొలిరోజును చెప్పించుకోవడమన్నా.. చెప్పడమన్నా అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఆ పలకరింపులో, అలా చెప్పడంలో ఎంతో ఆనందం ఇమిడి ఉంది. మరెంతో సంతోషం దాగి ఉంది. న్యూ ఇయర్‍ సంతోషాలను మూటగట్టి ఇస్తుందన్న ఓ విశ్వాసమే ఇంతటి ఆనందానికి కారణం. అందుకే కొత్త సంవత్సరం నాడు కనిపించిన అందరికీ, ఎదురైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెబుతుంటాం. ఇది ఆంగ్లమానం ప్రకారం వచ్చే కొత్త సంవత్సరమే

సమస్తం.. పుస్తకం

పుస్తకం అంటే ఆపాద మస్తకం మనల్ని స్ప•శించే ఓ నేస్తం. మంచి పుస్తకం మన మస్తిస్కాన్ని తెరుస్తుంది. భావాలను, ఆలోచనలను విశాలం చేస్తుంది. జీవన సరళిని మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అందుకే పుస్తకం అంటే కేవలం కాగితాల పుటలు కాదు.. పుస్తకం అంటే ఓ భావం.. ఓ బంధం.. ఓ భావోద్వేగం. మనిషిని మహోన్నతుడిని చేసేది పుస్తకమే. పుస్తకం మాట్లాడదు. కానీ, మనతో ఎన్నో భావాలను పలికిస్తుంది. ఆలోచనల్ని చిలకరిస్తుంది. ఊరడిస్తుంది. నవ్విస్తుంది. ఆలోచింపచేస్తుంది. కథలు చెబుతుంది. కలలు కనేలా

స్నానం పుణ్యప్రదం వ్రతం మోక్షపథం

హరిహరులు వేరు కాదు. వారిద్దరి తత్వాల మధ్య ఉండేది ఏకత్వ భావనే.. హరిహర తత్త్వం అన్యోన్యతకు మరో రూపం. ఈ భావనను అర్థం చేసుకోవడానికి, హరిహరులిద్దరూ ఒకటేనని సత్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞానదీపం వెలిగించే మాసం కార్తీకం. ‘న కార్తీక సమో మాస:’ మాసాలలో కార్తీకాన్ని మించినది లేదని అర్థం. ఇది స్కాంద పురాణోక్తి. ఈ మాసంలో మహా విష్ణువుకు కార్తీక దామోదరుడని పేరు. ఇక, పరమశివుడు కార్తీక మహాదేవుడిగా ఈ మాసంలో పూజలందుకుంటాడు. ‘విష్ణోర్నుకం

Top