జంటలను కలిపే కళ్యాణ క్షేత్రం

శ్రీనివాసుని సమక్షంలో పెళ్లి చేసుకుంటే జీవితంలో అర్థం, పరమార్థం సిద్ధిస్తుందని ఆశించే వారెందరో! అటువంటి భక్తుల ఆశలకు వేదిక.. చేవెళ్ల (రంగారెడ్డి జిల్లా)లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్‍కు కేవలం 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం తిరుపతి, చిలుకూరు తరువాత అంతటి ప్రాశస్త్యం కలది. ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇక్కడ చిన్న ఆంజనేయస్వామి గుడి ఉండేది. పక్కనే పుష్కరిణి ఉండేది. వెంకన్న

పరమపద సోపాన ‘పాఠం’

పరమపద సోపాన పథము లేదా వైకుంఠపాళీ లేదా పాము-నిచ్చెన ఆట.. లేదా మోక్షపథం.. మోక్షపటం..లేదా పాము పటం.. పేరేదైనా ఇదో ప్రాచీన భారతీయ ఆట. మన తెలుగు నాట ఇది మరీ సుప్రసిద్ధం. ఇది మానవ జీవితాల్లోని ఆధ్యాత్మిక కోణాన్ని వెలికితీస్తుంది. జీవితంలో మనిషి ఎదుర్కొనే కష్టనష్టాలకు, చివరకు చేరుకోవలసిన గమ్యానికి ప్రతీకగా నిలిచే ఆట ఇది. పాశ్చాత్యులు దీనిని ‘క్లాసిక్‍ ఆట’గా పరిగణిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఆడాల్సిన ఆటగా మన పెద్దలు చెబుతుంటారు. మన పురాణాలు,

పలుకు తేనెల తల్లి!

సిరి దేవత లక్ష్మీదేవి గురించి తెలుసుకునే ముందు ఓ చిన్న కథ చెప్పుకుందాం. భారత యుద్ధం ముగిసింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పరుండి అంతిమ ఘడియల కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అలా ప్రాణాలను నిలుపుకోవాలనే తలంపుతో ఉన్నాడు. కృష్ణుడు, ధర్మరాజు తదితరులు ఆయన వద్ద విచార వదనాలతో నిల్చున్నారు. అక్కడ రాజ్యమేలుతున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ.. ‘ధర్మనందనా! భీష్ముడు రాజనీతిజ్ఞుడు. లోకం పోకడ తెలిసిన మనిషి. సకల ధర్మాలూ తెలిసిన

మూర్తి’ చిన్నది కీర్తి గొప్పది

మన ఉపనిషత్తుల్లో అతి చిన్నది- కైవల్యోపనిషత్తు. కానీ, ఇది బోధించే విషయం మాత్రం చాలా పెద్దది. ఇది అథర్వణ వేదంలో ఉంది. స్వయంగా అనేక మంత్రాలను వేదాల్లో చేర్చగలిగిన సామర్థ్యమున్న అశ్వలాయన మహారుషి అడిగిన ప్రశ్నలకు చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చిన సమాధానాల సారమే ఈ ఉపనిషత్తు. శుద్ధ ఆత్మతత్త్వం ఈ ఉపనిషత్తులోని ముఖ్యాంశం. సాధారణంగా భోజన సమయాల్లోనూ, ఇతరత్రా తీరిక వేళల్లో భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని పఠించడం చాలామందికి అలవాటు. అయితే,

అందరూ బాగుండాలి యోగా వర్థిల్లాలి

శరీరాన్ని యోగా.. మనసును ధ్యానం నియంత్రించి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చికిత్సకూ లొంగని కొన్ని వ్యాధులు యోగాభ్యాసంతో నయమవుతున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమతో పాటు ఒత్తిడినీ మోస్తున్నారు. ఈ యాంగ్జయిటీ కారణంగా శరీరంలో చోటుచేసుకునే మార్పులు.. మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగానే.. మనిషి, మనసు అదుపు తప్పుతున్నాయి. అసంతృప్తి, ఆందోళన, డిప్రెషన్‍.. ఇంకా మానసిక రుగ్మతలు మనసు అదుపు తప్పడం వల్లనే కలుగుతున్నాయి.

Top