నాలో నేను… నీలో నువ్వు..

ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఇప్పటికిప్పుడు ఉన్నవన్నీ త్యజించేసి.. అడవులకో, పర్వత శిఖరాల మీదకో వెళ్లి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడమా? మనకున్నవన్నీ వదిలేసుకుని కట్టుబట్టలతో సంచరించడమా? ఆధ్యాత్మికత అంటే ఒక మతానికో, ఒక దేవుడికో సంబంధించినది కాదు. అదొక మానసిక చింతన. నీలోకి నువ్వు చూసుకోవడం. నీలోని నిన్ను తెలుసుకోవడం. నిన్ను నువ్వు గుర్తించడం. అదొక దైవ చింతన. దీని కోసం సంసారాలను వదిలి పెట్టాల్సిన పని లేదు. ఆస్తిపాస్తుల్ని త్యజించాల్సిన అవసరం లేదు. కాస్తంత వైరాగ్య భావం ఉంటే

చిన్నారి లోకం

సీతాకోకచిలుక ఎలా రూపాంతరం చెందుతుంది? అసహ్యకరమైన పురుగు రూపం సీతాకోకచిలుకలా సౌందర్యాన్ని ఎలా రంగరించుకుంటుంది? ఒకరోజు ఒక రాజు గారికి ఈ సందేహం కలిగింది. గొంగళి పురుగు సీతాకోకచిలుకలా ఎలా మారుతుందో తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడు. వెంటనే అందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రిని ఆదేశించాడు. ఒకరోజు సమీపంలోని ఉద్యానవనానికి మంత్రి.. రాజు గారిని తీసుకుని వెళ్లాడు. మొదట ఆకులను అంటిపెట్టుకుని ఉన్న లార్వా వంటి దశను మంత్రి రాజుకు చూపించి అది తొలి

ఆలయ శిఖరం

దైవ కార్యాలకు పునాదులు ఎలా పడతాయో, అసలు దైవికమైన ఆలోచనలు ఎలా కలుగుతాయో ఎవరూ చెప్పలేరు. అది ఆ భగవంతునికే ఎరుక. దేవుడే తన కార్యాలను కొందరు భక్తులను సాధనగా చేసుకుని వాటిని నిర్వర్తింప చేసుకుంటాడు. అటువంటిదే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అట్లాంటాలో గల హిందూ టెంపుల్‍ నేపథ్యం. ‘హిందూ టెంపుల్‍ ఆఫ్‍ అట్లాంటా’గా విశ్వ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ ఎలా జరిగింది? ఆ దైవిక

వినాయక పాఠం

వినాయకుడిని- సుముఖుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, లంబోదరుడు, వికటహాసుడు, వక్రతుండుడు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ అంగాల పేర్లు. ఒక్కోటి ఒక్కో సుగుణానికి ప్రతీక. ఆ సుగుణాలన్నీ కలవాడే సమర్థ నాయకుడు మన హైందవ ధర్మంలోని దేవతలది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఆయా దైవాంశాల్లోని ప్రత్యేకతలను అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదగటమే మనిషి విద్యుక్త ధర్మం. దేవుడిని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే సాధనగా ఉప యోగించుకున్నంత కాలం మనిషిలో ఆధ్యాత్మిక వికాసం కలగదు.

అమ్మ బాషాకు వందనం

అ- అమ్మ, ఆ- ఆవు అని చదవడమే చిన్నతనమని భావించే రోజులొచ్చేశాయి. ‘మాతృభాష సరిగ్గా నేర్వని వారికి ఇతర భాషలు లొంగవు’ అని జార్జి బెర్నార్డ్ షా చద్దన్నంలాంటి మాట చెప్పాడు. కానీ, మన తరమంతా పరభాషా ఫాస్ట్ఫుడ్‍కు అలవాటు పడిపోతోంది. తెలుగు మాట్లాడటమే నామోషీ.. ఆంగ్లం ఫస్ట్ లాంగ్వేజ్‍ అని చెప్పుకోవడానికి గర్వకారణం.. అనే భావన పెరిగి పెద్దదవుతోంది. ‘అమ్మ భాష మకరందం’ అంటారే కానీ, జుర్రుకునే

Top