గురువే దైవమైనది

గురువు అంటే ఎవరు? గురువు అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలు సహజంగా తలెత్తేవే. నిజానికి భారతదేశమే ఒక జగద్గురువు. అపారమైన గురు పరంపరకు నిలయమైన ఈ పుణ్యగడ్డ ప్రపంచానికే గురువు వంటిది. ఇక్కడ పుట్టిన వేదం కూడా జగద్గురువే. ఇక్కడే ఆవిర్భవించిన యోగా నేడు అంతర్జాతీయ గురువు కూడా!. ఇక గురువు అంటే ఎవరనే విషయానికి వద్దాం. అసలు మనం పలికే మంత్రాలు, మాటలు పుట్టినవే గురువు ముఖతా. మంత్రాలకు

పల్లె ఖ్యాతి…. సంక్రాంతి

సంక్రాంతి తెలుగు వారి పెద్ద పండుగ. పంటల పండుగ. తెలుగు పల్లెలన్నీ కళకళలాడే పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ ఇది. ఈ పండుగకు చాలా రోజుల ముందు నుంచే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజల మనసులు తాము పుట్టి పెరిగిన పల్లె లకు చేరుకుంటాయి. అమ్మతోటి అనుబంధాన్ని, చిన్నప్పటి ఆట పాటలను, బాల్యస్నేహాలను, చిలిపి పనులను, బడిలో చదువుకున్న పాఠాలను అందరూ గుర్తు చేసుకునే సమయ మిది.

భగవంతుని సన్నిధికి…

మనకు ఆత్మీయులు అనుకునే వారు దూరమైనపుడు మాటలు పెగలవు. కళ్లు నీటితో నిండిపోతాయి. మనసు మౌనంగా రోదిస్తుంటుంది. హృదయం.. మనకు దూరమైన వారి జ్ఞాపకాల తడితో బరువెక్కుతుంది. మనసులో చెలరేగే వేదన.. మాటలకు అందదు. క్రెగ్‍ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే వార్త విన్న క్షణం నుంచీ నాదీ ఇదే అనుభవం. ఆయన తోడిది పరిచయం యాదృచ్ఛికం కాదు. దైవ నిర్ణయం. స్వయంగా సాయినాథుడే మా ఇద్దరినీ కలిపాడు.

నవ్వు కొనాల్సిందేనా

ఈ జీవితం ఒక్కటే. దీన్ని ఫలవంతం చేసుకోవాలంటే జీవించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. కష్టమైనా, నష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ఎదుటి వారిని, సాటి వారిని బేషరతుగా ప్రేమించాలి. సూర్యుడు, చంద్రుడు, పువ్వులు, పక్షులు, జంతువులు.. తమ తమ స్వభావాలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిసరాలను ఆనందమయంగా చేసుకుంటాయి. వాటితో పోలిస్తే విచక్షణ, వివేకం కలిగిన మనం ఈ జీవితాన్ని, ఎందుకు సంతోషకరం చేసుకోలేం. ఈ సృష్టిలో పైసా

ఉగాది పచ్చడి ‘ఔషధీ’

వేపపువ్వు ప్రధాన ద్రవ్యంగా ఉగాది నాడు ఒక విధమైన పచ్చడి చేస్తారు. దీనికి ఉగాది పచ్చడి అని పేరు. ఇది ఔషధ యోగం. కొత్త చింతపండు తెచ్చి నీటితో పిసికి గింజలు, ఉట్లు, తొక్కలు మొదలైనవి లేకుండా తీసివేసి చిక్కటి గుజ్జు తయారు చేయాలి. ఆ గుజ్జులో కావాల్సినంత కొత్త బెల్లం వేయాలి. అందులో వేపపూవుల కాడలు, పుల్లలు లేకుండా బాగు చేసి వేయాలి. అలా తయారు చేసి గుజ్జులో

Top