వెలుగు పూలు

ఆసేతు హిమాచలం పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, మరియు దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ. ఇది ఆశ్వయుజ మాసం చివరిలో వస్తుంది. ఈ పండుగ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి అమావాస్య. మూడవది బలి పాడ్యమి. నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగు వత్తులతో

జంట పర్వాల కన్నుల పండువ

ఆశ్వయుజంలో ఆనందాన్ని పంచే దసరా, దీపావళి పండుగలు విజయ వికాసాన్ని నేర్పే విజయదశమి.. జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి ఆశ్వయుజ శుద్ధ దశమి, మంగళవారం, అక్టోబరు 8: దసరా ఆశ్వయుజ బహుళ చతుర్దశి, ఆదివారం, అక్టోబరు 27: దీపావళి మనుషుల్లో ఆధ్యాత్మికంగా ఆనందం, వికాసం రెండింతలు చేసే మాసం.. ఆశ్వయుజం. దసరా, దీపావళి వంటి రెండు విశేషమైన పర్వాలు ఈ మాసంలో మనల్ని ఉత్తేజితం చేస్తాయి. అసలు దసరా, దీపావళి పర్వాల వెనుక పరమార్థం

ఎవరు పేద

ఒకసారి ఒక పేదవాడు బుద్ధుడి వద్దకు వచ్చాడు. అతను బుద్ధుడిని ఇలా అడిగాడు ‘అయ్యా! నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను? నేనే ఎందుకిలా పుట్టాలి? నేనెందుకు పేదవాడను?’. బుద్ధుడు అతనికి శాంతంగా ఇలా సమాధానం చెప్పాడు. ‘మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటు వంటి ఔదార్యం కలిగి లేరు. మీ జీవితంలో దాన ధర్మాలు చేసి ఎరుగరు. అందుకే ఇలా పేదవాడిగా పుట్టారు’. ‘నిజమే! నేను దాన ధర్మాలు చేయలేదు. కానీ, చేయడానికి నా

జ్ఞానార్జనకి వయస్సుతో నిమిత్తం లేదు

జీవితంలో చివరికంటా విజ్ఞానం, ధనం సంపాదిస్తూనే ఉండాలి, నలుగురికీ పంచుతూనే ఉండాలని, మరుక్షణం నాదికాదు - అనుకొని కర్తవ్యాలు నిర్వహించాలనీ సందేశమిచ్చే శ్లోకం ఇది. శ్లో।। అజరామరవత్‍ ప్రాజ్ఞో, విద్యామర్థం చ సాధయేత్‍ । గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్‍ ।। ‘‘వ•సలితనంగానీ, మరణంగానీ నాకు అంటదు’’, అనే భావనతో జ్ఞానాన్ని, ధనాన్ని నిరంతరం ఆర్జిస్తూనే వుండాలి. దానధర్మాల విష యంలో మాత్రం మృత్యువు జుట్టుపట్టుకొని లాగుతోందనే తొందరతో (ఇప్పుడే) వ్యవహరించాలి.

ఆదిశంకరుని మూడు దోషాలు

ఆదిశంకరులు ఒకసారి శిష్యులతో కలిసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.గంగా నదిలో స్నానం చేసి, దర్శనానికి ఆలయం లోపలికి వెళ్లి, విశ్వేశ్వరుని ఎదుట నిలిచి ఇలా ప్రార్థించారు- ‘స్వామీ! నేను మూడు దోషములు (పాపాలు) చేశాను. నన్ను క్షమించండి’. ఈ విధంగా శివుడిని వేడుకున్నారు. ఇది విన్న శిష్యులు- ‘ఆచార్యుల వారు ఏం పాపాలు చేశారని పరమశివుని ఎదుట ప్రాయశ్చిత్త మడుగుతున్నారు?’ అని అనుకున్నారు. ఒక శిష్యుడు మాత్రం, ఆది శంకరుల వారు ఏం

Top