కొత్త జీవితం..

కాలాన్ని భగవత్‍ స్వరూపంగా భావిస్తే ప్రతి రోజూ, ప్రతి నిమిషమూ పండుగే. ఆనందమే. ఇలాంటి భావనే లేకుండా ఆచరించే పండుగలు మన జీవితంలో ఎన్ని వచ్చినా దండుగలే. పవిత్ర భావన లేకుండా చేసుకునే పండుగ నాడు పిండివంటలూ, పండుగ వంటలూ కడుపారా తింటే రజస్తమోగుణాలు కలగడమే తప్ప సాత్త్విక ప్రవృత్తి లభించదు. పండుగల నాడు ఇలాంటి పవిత్ర భావన కలగాలనే ఉద్దేశంతోనే మన పూర్వులు ప్రతి పండుగకూ ఒక అధిష్టాన దేవతనూ, పూజ, నియమాలూ,

శివతత్త్వమే మనతత్త్వం

శివం.. శివం అంటే మనసు పరవశం చెందుతుంది. శివతత్త్వం జీవన వేదం. నిరాకార స్వరూపుడైన శివుడి భావాలను, మననం చేసుకుంటే జీవితం ఆనందసాగరం అవుతుంది. శివుని అలంకరణలను మన జీవన విధానానికి అన్వయించుకుని చూద్దాం! పరమశివుడికి నిరాడంబర జీవితం. మనిషి కూడా భ్రమ కలిగించే ఆస్తులను చూసి గర్వంగా కాకుండా సామాన్య జీవితం గడపాలన్నది శివుడిలో ఇమిడివున్న నిరాడంబర తత్త్వం చాటుతుంది. అవసరాన్ని మించి ఖర్చులతో ఆనక ఇబ్బందుల పాలవడం ఎంతమాత్రం మంచిది

బతుకును పండించుకుందాం!

మన నవీన ధర్మాల మూలాలన్నీ సనాతన ధర్మాలతో ముడిపడి ఉన్నాయి. మన సంప్రదాయంలో విద్యాభ్యాసం అనేది అత్యంత ముఖ్యమైనది. హృదయ వికాసం కలిగించేదీ, ద్వంద్వాలు, మానసిక వికారాలు తొలగించి వివేకాన్నిచ్చేది అసలైన విద్య. మొత్తం మనకున్న విద్యలన్నీ కలిపి పద్దెనిమిది రకాలని అంటారు. కానీ, స్థూలంగా చెప్పాలంటే విద్యలు రెండు రకాలు. ఒకటి- పరావిద్య, రెండు- అపరావిద్య. పరావిద్యనే ఆధ్యాత్మిక విద్య అని కూడా అంటారు. దీనివల్ల జన్మరాహిత్యం కలుగుతుంది. అపరావిద్య అంటే- లౌకిక విద్య. అంటే

సరి ‘కొత్త’ క్రాంతి

ఒక రాజు తన రాజ్యంలో జ్ఞానులందరినీ పిలిచాడు. ‘విజయంలో, ఓటమిలో, ఆనందంలో, దు:ఖంలో.. ఎలాంటి సందర్భంలోనైనా ఓ మంత్రంలా పనిచేసే మాటల్ని మీలో ఎవరైనా సూచించగలరా? మీరెవరూ సలహా ఇవ్వడానికి నాకు అందుబాటులో లేనపుడు ఆ మాట నాకు సాయపడాలి’ అని అడిగాడు. రాజు ప్రశ్నలకు జ్ఞానులందరూ మొదట అయోమయంలో పడ్డారు. చివరకు ఆలోచించగా, ఆలోచించగా, వారిలో ఒకరు చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి. ఆ మాటల్ని వారంతా కాగితంపై రాసి రాజుకు ఇచ్చారు.

ఆదియందు వాక్యముండెను..

ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను.. అమ్మ చేతి గోరుముద్దల్లా తేలికగా వంటబట్టే తేట తెలుగు పదాలే పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులకు ఎంతో చేరువ చేశాయి. తెలుగు భాష ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే మాధ్యమం కాబట్టే, తెలుగు అనువాద క్రైస్తవ మత గ్రంథం క్రైస్తవుల చేతుల్లో కరదీపికై వెలుగుతోంది. ఈ గ్రంథంలోని విషయాలను ప్రత్యేక సత్యాలుగానూ, దేవుని అభీష్టాన్ని తెలిపే దివ్యవాణి గానూ భక్తులు భావిస్తారు. ఈ

Top