మనలోని దీపం!

ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగిస్తాం. అలాగే, జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి మనకు మనమే జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి. అంటే, మనకు మనం కృషి చేసి ఆయా కష్టాల నుంచి గట్టెక్కాలి. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని ప్రయత్నపూర్వకంగా మనమే దూరం చేసుకోవాలి. కష్టాలకు కంగారు పడకుండా ధైర్యజ్యోతులను నింపుకుని కష్టాలకు స్వస్తి పలకాలి. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూనే సాటి మనిషి కష్టంలో ఒక

నమస్తే టీచర్‍!

తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెక్కే శిల్పం- విద్యార్థి. విద్యార్థుల భవిష్యత్తును.. తద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. మన భారతీయ విద్యావిధానం ప్రపంచంలోనే విశిష్టమైనది. క్రీస్తుపూర్వమే మన దేశంలో గొప్ప గొప్ప గురుకులాలు ఉండేవి. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. శాస్త్రపారంగతలున్న గురువులు వివిధ శాస్త్రాలలో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేవారు. కొందరు గురువులు దేశ చరిత్ర గమనాన్నే మార్చారు. శాస్త్రాల పురోగతిలో మైలురాళ్లుగా నిలిచారు. మన పురాణాల్లో గురుశిష్యుల సంబంధాలపై బోలెడన్ని కథలు ఉన్నాయి. గొప్ప గొప్ప గురువుల గురించి, వారి

లక్ష్మీ గణపతిం భజే!

లక్ష్మీ గణపతి.. తెలుగునాట ఈ దైవాల చిత్రపటం లేని ఇల్లు దాదాపు ఉండదంటే అతిశయోక్తి కాదు. చేసే పనుల్లో విఘ్నాలు తొలగించే దైవం ఒకవైపు.. లక్ష్యసిద్ధిని సిద్ధింపచేసే ‘లక్ష్య’దేవి మరోవైపు.. ఇద్దరూ కలిసి మన ఇంట్లోనే ఉంటే.. ఇక మనం చేసే పనులన్నింటా జయమే.. అందుకే కాబోలు ‘లక్ష్మీ గణపతి’ అనే ద్వయం ఇంటింటా కొలువుదీరింది. ఇదే విశేషమైతే.. ఈ ఆగస్టులో మరో పరమ విశేషం పలకరిస్తోంది. శ్రావణ, భాద్రపద మాసాల కలయిగా ఉన్న ఆగస్టులో ఈ జంట దేవుళ్ల

గురువే దైవమని..

ఆషాఢ మాసం నుంచి వర్ష రుతువు ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒకచోట ఎక్కువ కాలం గడపరు. కానీ, వర్షాకాలంలో వానల వల్ల ఇబ్బంది కలగడమే కాక, వ్యాధులు సోకడానికి అవకాశం ఎక్కువ. అందుకే సాధారణంగా సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్యం పాటిస్తారు. అంటే, తాత్కాలికంగా ఎక్కడో ఒకచోటే ఉంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన

సంపాదకీయం మహా మంత్రం

బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనా శక్తి పరుచుకుంటున్న వేళ.. నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ.. అపూర్వ తేజో విరాజితుడైన ముని సత్తుముని కంఠంలో నుంచి వెలువడిన సుస్వర మంత్రఝురి- గాయత్రి మంత్రం. ఇది సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించే అద్భుత చంధో తరంగం. ఉత్క•ష్టమైన గాయత్రి మంత్రాన్ని సృష్టించిన ఆ రుషి సత్తముడు మరెవరో కాదు.. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి. ఈ

Top