తొలి అడుగు కొత్త జీవితానికి ఆశల చిగురు

ఉగాది.. యుగానికి ఆది.. కొత్త ఆశలకు పునాది.. ఉగాది అంటే వికాసానికి గుర్తు. ఈ నేలపై వసంతం వికసించిన తొలి రోజుకు ఉగాది నాంది. వసంతమాసంలో ప్రకృతి కొత్త చిగుర్లు వేస్తుంది. కాలం మానవ జీవితాలకు కొత్త ఆశల రెక్కలు తొడుగుతాయి. రానున్న కాలంలో అందే సత్ఫలితాలకు ఉగాది ఒక సంకేతం. మనిషి ఆశలు కూడా చిగురుల వంటివే. అవి ఫలించాలి. ఫలితాలనివ్వాలి. అదే ఉగాది పండుగకు చాటే శుభ సంకేతం. మనకు వచ్చే పండుగలన్నీ ఏదో ఒక

జ్యోతిర్లింగ వెలుగుల్లో మనసు కడిగిన ముత్యం కావాలి

ఒక యువకుడు కొత్తగా పోలీసు ఉద్యోగంలో చేరాడు. తొలి రోజు డ్యూటీకి ఉత్సాహంగా హాజరయ్యాడు. యువకుడు.. ఉడుకులెత్తే రక్తం.. తన విధి నిర్వహణలో సమాజాన్ని మార్చేయాలన్నది అతని ఉద్దేశం. సీనియర్ పోలీసు అధికారితో కలిసి ఆ యువ పోలీసు అధికారి ఓ ప్రధాన రోడ్డు మీదుగా వాహనంలో వెళ్తున్నాడు. అంతలో వారి వాహనంలోని వైర్లెస్ సెట్కు ఒక సందేశం వచ్చింది. ‘ఫలానా రహదారిపై జనం పెద్దసంఖ్యలో గుమికూడారు. అక్కడేం జరుగుతోందో తెలుసుకోండి’

ముగ్గు చూడు.. ముగ్గందం చూడు

సంక్రాంతి పండగ వేళ, పల్లెటూరి తెలుగింటి పడుచుల సృజనాత్మకత రంగుల హరివిల్లులా వెల్లివిరుస్తుంది. వాళ్ల మునివేళ్ల చివరి నుంచి ఒడిసిపట్టే ముగ్గులు ఎన్ని రకాలో ! శివుడి కళ్లు, పద్మాలు, గుంటల కోనేరు, పాముల బుట్ట, ఏనుగుల ముగ్గు, పతంగుల ముగ్గు, పన్నీరు బుడ్డి, గంధపు గిన్నె, మల్లె పందిరి, తాబేలు, కొబ్బరిబోండాలు, అడ్డబాస, విస్తరాకు, బాణం, తులసికోట, గుమ్మడికాయ, వరివెన్నులు, గాదె.. ఇలాంటి ముగ్గులను వరుస చుక్కలతో,

నీ స్నేహం..

ఒక ఎలుక ఉదయాన్నే జీవయాత్ర కోసం బయలుదేరింది. కన్నం దాటి నాలుగడుగులు వేసిందో లేదో యమధర్మరాజులా పిల్లి ఎదురుపడింది. ఎలుక కంగుతింది. అంతలోనే స్థిమితపడింది. ఆ పిల్లి వేటగాడి వలలో చిక్కుకుని ఉంది. హమ్మయ్యా అనుకుని ఎలుక ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి చెట్టు మీద గుడ్లగూబ, పొదలో నుంచి ముంగిస గుర్రుగా చూస్తూ కనిపించాయి. ఇదెక్కడి సంకటంరా దేవుడా! అని ఎలుక అనుకుందే కానీ, ధైర్యం కోల్పోలేదు. ఒక్క

బాల్యానికి పరీక్ష

అందరికీ అన్ని రోజులున్నట్టే చిన్నారులకూ ఒక రోజు ఉంది. అది నవంబరు 14 బాలల దినోత్సవం. చాచా నెహ్రూ పుట్టిన రోజున బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. తల్లిదండ్రులు కూడా ఈ ఒక్క రోజే పిల్లలది.. మిగతా అన్ని రోజులూ తమ చేతిలోనే ఉండాలనే ధోరణి, దృక్పథంతో ఉన్న రోజులివి. ఇంతకీ పిల్లలెలా పెరగాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? ఇవెప్పటికీ చిక్కు ప్రశ్నలే. ఇరవై

Top