ఔషధాలకు పుట్టినిల్లు తెలుగు లోగిళు

తరతరాల వారసత్వ సంపద.. ‘తెలుగు వైద్యం’. చిట్కా వైద్యంగా, వంటింటి కిటుకులుగా ఈనాటికీ గ్రామీణ జీవితానికి ప్రాణం పోస్తోందీ వైద్యం. ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని దీనికి మేళవిస్తే ఇది మరింత వన్నెసంతరించుకుంటుంది. మన పాటలు, ఆటలు అన్నింటా తరచి చూస్తే ఎన్నో వైద్య రహస్యాలు కనిపిస్తాయి. మన తెలుగు వారికి వైద్యం అనేది అరచేతిలో ఉసిరికాయ వంటిది. తరతరాలుగా తెలుగునాట జరుగుతున్న ఉత్సవాలు, పండుగలు, పబ్బాలు.. అన్నిటిలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉండటం

ఆరోగ్యసిరి అరటి, కొబ్బరి

అరటి, కొబ్బరి.. ఈ రెండూ లేకుండా పూజాధికాలు జరగ•వంటే అతిశయోక్తి కాదు. శుభకార్యాల్లోనూ ఈ రెండింటికే పెద్దపీట వేస్తారు. అటు ఆధ్యాత్మికపరంగానూ, ఇటు ఆరోగ్యపరంగానూ కూడా ఇవి రెండూ ఎంతో విశేషమైనవి. పైగా ఇవి రెండూ అన్ని కాలాల్లోనూ, సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. పూజలు, శుభకార్యాల్లో వీటికి గల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం.

Top