ఇటు బోధన.. అటు సామాజిక సేవ
బోధన రంగమంటే ప్రాణమిచ్చే జిల్.. 1970 సంవత్సరం నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రెండు పర్యాయాల్లో రెండో మహిళగా హోదాను అందుకుంటూ ఒకవైపు అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు తన వృత్తినీ సమాంతరంగా కొనసాగించారు జిల్. ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రాణం పెట్టే జిల్..