కాకులు వాలని కోటప్ప కొండ

‘కాకులు దూరని కారడవి’ అంటుంటాం కదా!. కానీ, కాకులు వాలని కొండ కూడా ఒకటుంది. అదే కోటప్పకొండ. ఇక్కడ శివుడు దక్షిణామూర్తిగా వెలిశాడు. ఆంధప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నరసారావుపేటకు సమీపంలో కోటప్ప కొండ క్షేత్రం ఉంది. ఇక్కడ కొండపై ఒక్క కాకి కూడా వాలిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని అంటారు. శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఏపీలో ఇదొక్కటే. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేశాక శివుడు

శివాభిషేకం.. ఫలితం

శివుడు అభిషేక ప్రియుడు. ఏ పదార్థంతో చేసినా ఆయన అభిషేకానికి సంతుష్టడవుతాడు. మహా శివరాత్రి నాడు ఆయనను ఏయే పదార్థాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మన పెద్దలు చెప్పారు. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివ సాయుజ్యం లభిస్తుంది. పలు రకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండి ధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి. నవ ధాన్యాలతో

మహా శివరాత్రి.. మహా సందేశం

శివపూజతో చతుర్విధ ముక్తిలు మనిషి శివుడిని నిష్కల్మషంగా పూజించా లనుకుంటే, తన ఆత్మ అంతా శివుడే నిండి ఉన్నట్టు భావించాలి. మనిషి శివారాధనలో చతు ర్విధ ముక్తిలూ పొందుతాడని భగవత్పాదుల ఉపదేశం. భక్తుడు తానే శివుడై చేసే పూజలో శివుడి సారూప్యం (సమాన రూపం) ఉంటుంది. అందుకే ఇది ‘సారూప్య ముక్తి’. శివభక్తులతో సాహచర్యం చేస్తూ శివా లయాలను సందర్శించడం వల్ల శివుడి సమీ పానికి చేరుకున్నట్టు అవుతుంది. కనుక ‘సామీప్య

శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర మహిమ

శ్రీకాళహస్తి పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది- శ్రీ- సాలె పురుగు, కాళ- సర్పము, హస్తి- ఏనుగు అనే మూగ జీవాలకు ముక్తినిచ్చిన క్షేత్రమనే విషయం. అయితే ఎక్కువగా వాడుకలో ఉన్నది ఈ సాలె పురుగు, పాము, ఏనుగు కథే. కానీ, దీనికంటే ముందే ఇక్కడ చాలా ఉదంతాలు జరిగిన దాఖలాలున్నాయి. గతంలో శ్రీకాళహస్తి ప్రాంతాన్ని గజకాననం అని పిలిచే వారు. బ్రహ్మ ఇక్కడ పరమశివుడి గురించి తపస్సు చేసిన

దగ్గరి నుంచి చూస్తేనే రంగు తెలుస్తుంది

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. హైదరాబాద్ దక్కనీ

Top