వినాయక పాఠం

వినాయకుడిని- సుముఖుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, లంబోదరుడు, వికటహాసుడు, వక్రతుండుడు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ అంగాల పేర్లు. ఒక్కోటి ఒక్కో సుగుణానికి ప్రతీక. ఆ సుగుణాలన్నీ కలవాడే సమర్థ నాయకుడు మన హైందవ ధర్మంలోని దేవతలది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఆయా దైవాంశాల్లోని ప్రత్యేకతలను అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదగటమే మనిషి విద్యుక్త ధర్మం. దేవుడిని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే సాధనగా ఉప యోగించుకున్నంత కాలం మనిషిలో ఆధ్యాత్మిక వికాసం కలగదు.

నారు పోసిన వాడే నీరు పోస్తాడూ

ఇది వ్యవసాయదారుల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న సామెత. నేలలో విత్తనాలు చల్లితే కొన్నాళ్లకు అవి మొలకలెత్తుతాయి. ఆ చిన్న చిన్న మొక్కలను మరో చోట పాతడానికి ఉపయోగిస్తారు. వాటిని నారు అంటారు. ఈ నారు వేసినపుడు, బాగా ఎండ కాస్తే నీటి తడులందక అవి ఎండుముఖం పడుతుంటాయి. అప్పుడు వాటిని బతికించుకోవడానికి రైతులు పడే ఇబ్బందుల నుంచే ఈ సామెత పుట్టిందని భావించాలి. అయితే, ఈ సామెత రెండు విధాలుగా పుట్టుకొచ్చిందని

ఎదుగు నింగే హద్దుగా

చాలా ఏళ్లుగా తీవ్రమైన సమస్యలతో సతమతం అవు తున్న ఒక యువకుడు విసిగి వేసారి, అన్నీ విడిచి పెట్టేయాలని నిర్ణయించు కున్నాడు. అన్నీ అంటే.. సమస్యలు, ఉద్యోగం, తననే నమ్ముకుని ఉన్న కుటుంబం, తాను నమ్మిన దైవం.. చివరికి దైవమిచ్చిన జీవితం.. ఇవన్నీ విడిచి పెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్లాడు. ‘భగవంతుడా! నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండటానికి

సామెత కథ

‘‘గాడిద కొడకా అంటే.. తమరు తండ్రులు, మేం బిడ్డలం అన్నాట్ట’’ కొన్ని సామెతల్లో అర్థాల కంటే హాస్యమే ఎక్కువ తొంగి చూస్తుంది. ఎవరినైనా ఏదైనా అంటే, వెంటనే తగిన సమాధానం చెప్పడం అనే ధోరణి నుంచి ఇటువంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు నేటి సినిమాల్లో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో ‘ఏం చేస్తుంటారు?’ అని అడిగితే, ‘ఏం చేయాలా

మడిబట్ట కడితే దొంగలు ముట్టరా?

వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. టెంకాయ చెట్టుకు మడిబట్ట కట్టినట్టు నమ్మకాలు వమ్మయ్యే విషయంలో ఉప

Top