ఒక్క క్షణం ఆలోచించండి!

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.

అల్లం – బెల్లం

రమణ తరగతిలో ఎంతో చురుకైన విద్యార్థి. అతని మార్కులను, ప్రతిభను చూసి రమణ వాళ్ళ అమ్మ నిర్మలమ్మ ఎప్పుడూ మురిసి పోతుండేది. రమణ విషయంలో ఒక బెంగ వుండేది. అదేమిటంటే రమణ ఎప్పుడూ ఇంటిలోని వంట గది లోకి దొంగచాటుగా వెళ్ళి, బెల్లం డబ్బా ఖాళీ చేసేవాడు. నిర్మలమ్మ ఈ విషయంలో రమణ మందలించినా, రమణ అలవాటులో పెద్దగా మార్పు రాలేదు. ఒకరోజు నిర్మలమ్మకు, రమణ చదువుకునే స్కూలు

లోకజ్ఞానం లేనిది పాండిత్యం ఎందుకు?

కొందరికి అపారమైన మేధస్సు ఉంటుంది కానీ, రోజువారీ వ్యవహారాలలో అది ఉప యోగపడక ఇబ్బందులు పడుతుంటారు. మనిషికి పాండిత్యమే కాదు, లోకజ్ఞానం కూడా ముఖ్యమే అని చెప్పేందుకు ఈ జాతీయాన్ని లేదా నానుడిని వాడుతుంటారు. పూర్వం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఐదుగురు పండితులు వచ్చారు. ఎవరికి వారే సాటి. వారి ప్రతిభకు, పాండిత్యానికి రాయల వారు ముగ్ధులయ్యారు. వారిని బాగా పొగిడి, భారీగా సత్కరించాలని అనుకున్నారు. ఈలోపు మంత్రి తిమ్మరుసు వచ్చి-

ఏమో… ఏది ఎవరికెరుక

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. సర్వం కర్మాధీనం మంచి కావచ్చు..

రెండు చిలుకలా కథ

పేరుకే పిల్లల కథలు.. పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

Top