ఆనందం అలలై.. బంగారు కలలై…

గురువులు పూజ్యశ్రీ శివరామకృష్ణ గారికి .... రక్షాబంధన శుభాకాంక్షలతో ... ప్రణామాలతో ... అవును నాకు తెలుసు. హృదయేశ్వరా, ఇదంతా నీ ప్రేమే, ఇంకేమీ కాదు. చెట్ట ఆకులపైన చిందులు త్రొక్కే ఈ బంగారు కాంతి, ఆకాశంపైని తేలిపోయే సోమరి మబ్బులు నా నుదుటి మీద తన చల్లని స్పర్శని వదలి పోయేగాలి, ఇదంతా నీ ప్రేమే కాక ఇంకేమి కాదు - ఠాగూర్ నిర్మల గంగాఝరీ ప్రవాహంలాంటి మీ ప్రేమలో తడవ గలిగిన అదృష్టం... కూడా ‘ఆయన’

అష్టైశ్వర్యాలివిగో.

1. సకల ప్రాణికోటిపై దయ: భగవంతునికి ప్రత్యేకంగా సాధించవలసిన అవసరం కానీ, అగత్యం కానీ ఏమీ ఉండదు. కానీ మానవాళి ఉద్ధరణ కోసం ఆయన ఎన్నో అవతారాలను దాల్చాడు. మనం ఒకరికి సహాయం చెయ్యగలిగి ఉన్నపుడు తప్పక సహాయం చేయాలి. ఇందుకు మనకు భగవంతుడే స్వయంగా దారి చూపించాడు. మన పక్క వారి బాధలను తీర్చాలనే భావనే కరుణ. కొందరికి స్వతహాగా కరుణా దృష్టి ఉంటుంది. మరికొందరికి వారితో పాటు ఉన్న

ముగ్గూ ముచ్చటా.

బ్రహ్మ దేవుడు నుదుటి రాతను గీతలుగా రాసినట్టే, ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటి వారి సంస్కారాన్ని, సంస్క•తిని తెలుపుతుందని అంటారు. ముగ్గు లేకుండా సంక్రాంతి లేదు. ముగ్గులు మన సంస్క•తిలో విడదీయరాని భాగం. ముగ్గు వేయడం అనేది అపురూపమైన కళ. ఇది తరతరాలుగా అమ్మమ్మలు, బామ్మల నుంచి వారసత్వంగా వస్తోంది. సంక్రాంతి వేళ ఇంటి ముంగిట ముగ్గులు వేసే విషయంలో తెలుగు పడుచులు, అమ్మాయిలు ముద్దుగుమ్మలైపోతారు. సూర్యుడు ఉదయించడానికి

కనుమ పిలుస్తోంది.. కలిసుందాం రమ్మని

మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో చివరిది- కనుమ. ఇది పశుపక్ష్యాదులకు ప్రత్యేకించిన పండుగ. అరక కట్టి పొలాన్ని దున్నడం మొదలుకుని, చేతికందిన పంటను ఇంటికి తీసుకురావడం వరకు కర్షకులకు సేద్యంలో చేదోడువాదోడుగా ఉండేవి పశువులే. వీటికి కనుమ రోజు పూర్తిగా ఆటవిడుపు. ఈనాడు పశువులు ఉన్న ఇంట చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడుగుతారు. అందంగా అలంకరిస్తారు. మెడలో గంటలు కడతారు.

సంక్రాంతి వేళ ఏ రాశి వారు ఏ దానం చేయాలి?

పండగంటే.. పిండివంటలు చేసుకుని తినడం మాత్రమే కాదు. ఉన్నది ఇతరులతో పంచు కుని ఆనందాన్ని పంచుకోవడం కూడా మన పండుగల్లో దాగి ఉన్న ముఖ్య సందేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే పూజలు, దానధర్మాలు మంచి ఫలితాలనిస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యం సంపాదించు కోవాలని మన పెద్దలు నిర్దే శించారు. ఆయా రాశుల వారు ఆయా వస్తువులను దానం చేయాలి. దీనివల్ల పుణ్యం సంగతలా ఉంచితే..

Top