నాని నన్నయ్యాడు

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా ఆరు హిట్లను తన ఖాతాలో వేసుకున్న అరుదైన నటుడిగా రికార్డు సృష్టించిన హీరో నాని కంటే ప్రస్తుతం ఎవరూ సంతోషంగా లేరు. ఎందుకంటే, నటుడిగా వరుస విజయాలతోనే కాదు.. ఇటీవల కొడుకు పుట్టిన ఆనందంతోనూ నాని రెట్టింపు సంతోషంతో ఉన్నాడు. తెలుగు సంవత్సరాది రోజున నానికి పుత్రోత్సాహం కలిగింది. ఆయన తండ్రి కావడంతో సినీ పరిశ్రమలో అందరితో ఆనందాన్ని పంచుకున్నాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో

అదిరింది గురు

మొదటి నుంచీ విలక్షణ పాత్రలకు కేరాఫ్‍గా నిలుస్తాడని వెంకటేష్‍కు పేరు. తెలుగు నాట అగ్ర కథానాయకుడైన ఈయన ఇమేజ్‍కు భిన్నంగా ఏ పాత్రలోనైనా కనిపించడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇటీవలే విడుదలైన ‘గురు’లో గెడ్డంతో, మంచి ఫిజిక్‍తో కనిపించిన వెంకటేష్‍ను అందరూ ప్రశంసిస్తున్నారు. బాక్సింగ్‍లో అమ్మాయిని తీర్చిదిద్దే క్రమంలో ఆమెను మోటివేట్‍ చేస్తూ బాగా నటించారని అందరూ అంటున్నారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, ఇకపై

బాష చూడు మళ్ళి వచ్చాడు

దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చి.. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో సంచలన రికార్డులు సృష్టించిన రజనీకాంత్‍ ‘బాషా’ డిజిటల్‍ హంగులు అద్దుకుని మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రిలీజైన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అప్పట్లో ‘బాషా’ను నిర్మించిన సత్య మూవీస్‍.. ఇటీవల 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రాన్ని మళ్లీ ఇలా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇందు కోసం విజువల్‍

చిరు సర్ప్రైసింగ్

మహేశ్‍బాబు సినిమా షూటింగ్‍లో మెగాస్టార్‍ చిరంజీవి అనుకోకుండా తళుక్కుమన్నారు. నిజమే..! ప్రస్తుతం మురుగదాస్‍ దర్శకత్వంలో మహేశ్‍ హీరోగా తెరకెక్కనున్న చిత్రం హాట్‍ ఫేవరెట్‍గా మారింది. ఈ సినిమా షూటింగ్‍ ముంబయ్‍, అహ్మదాబాద్‍.. తదితర ముఖ్య పట్టణాల్లో జరుగుతోంది. దీనికి ‘సంభవామి’, ‘ఏజెంట్‍ శివ’ ‘మర్మం’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఉన్నట్టుండి ఈ సినిమా సెట్‍లోకి మెగాస్టార్‍ చిరంజీవి వచ్చారు. మహేశ్‍పై తీసిన సాంగ్‍ ప్రివ్యూను

మళ్లీ వచ్చేసింది

‘హే పిల్లా.. హల్లో పిల్లా..’ అంటూ మెగాస్టార్‍ చిరంజీవి సరసన ‘ఘరానా మొగుడు’ చిత్రంలో ఆడిపాడిన వాణీవిశ్వనాథ్‍ గుర్తుందా? మధ్యలో కొన్నాళ్లు వెండితెరకు దూరమైన ఈ భామ మళ్లీ మేకప్‍ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‍ హీరోగా నటిస్తున్న చిత్రంలో వాణీ విశ్వనాథ్‍ ఓ కీలక పాత్ర చేయనుంది. కొద్ది రోజుల క్రితం బ్యాంకాక్‍లో జరిగిన షెడ్యూల్‍లో వాణీ విశ్వనాథ్‍తో పాటు జగపతిబాబు,

Top