పిల్లను చూసి పెట్టండి

ఇటీవలే ‘పాగల్‌’గా అలరించిన విశ్వక్‌సేన్‌.. తాజాగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్‌` అల్లం అర్జున్‌ కుమార్‌ పాత్రలో కనిపించనున్నాడు. 34 ఏళ్లు దాటినా.. నెలకు రూ.70 వేలు సంపాదిస్తున్నా పెళ్లి కాని యువకుడి పాత్రలో కనువిందు చేయనున్నాడు. ‘తన కోసం అమ్మాయిని చూసి పెట్టాలని, కట్నం వద్ద’ని చెబుతున్న ఈ సినిమా ప్రచార చిత్రం ఇటీవలే

మారేడుమిల్లిలో మళ్లీ ‘పులి’

ఇటీవలే ‘దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ అంటూ అదరగొట్టిన అల్లు అర్జున్‌పై మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి చిత్ర బృందం సిద్ధమైంది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప’ షూటింగ్‌ ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. గతంలోపూ ఒక ముఖ్య షెడ్యూల్‌ను ఇక్కడ చిత్రీకరించారు. ప్రస్తుత పార్ట్‌ ముగిశాక హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప’ రెండు భాగాలుగా

బ్యాచిలర్‌ కుర్రోడు రెడీ

అక్కినేని అఖిల్‌, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ 2021, అక్టోబర్‌ 8న విడుదలకు సిద్ధమవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అఖిల్‌ ఏడు గెటప్స్‌లో కనిపించనున్నాడట. ఫార్మల్‌ లుక్‌ నుంచి మోడ్రన్‌ వరకు స్టిల్స్‌లో కనిపించాడు. ఈ ఏడు గెటప్స్‌లో అతను చేసే హంగామా చూడాలంటే అక్టోబర్‌ 8 వరకు ఆగాల్సిందే.

క్రేజీ కాంబినేషన్‌

తమిళ దర్శకుడు శంకర్‌ ` తెలుగు నటుడు రాంచరణ్‌.. చాలా ఇంట్రెస్టింగ్‌, క్రేజీ కాంబినేషన్‌ ఇది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో రాంచరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తుండగా, ఇతర ముఖ్యపాత్రలను సునీల్‌, అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌చంద్ర, జయరాం పోషిస్తున్నారు. బలమైన సామాజింకాశాలను కమర్షియల్‌గా చెప్పడంలో తనదైన మార్క్‌ ఉన్న శంకర్‌

భీం..భీం భీమ్లానాయక్‌

పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భీమ్లానాయక్‌ ఫస్ట్‌ లుక్‌తో పాటు పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. భీం.. భీం.. భీమ్లానాయక్‌ అంటూ సాగే ఈ పాట ఫాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్‌ స్వరాలు అందించాడు. ఈ గీతం ప్రారంభంలో ‘కిన్నెర’ కళాకారుడు మొగులయ్య పాడిన పద్యం ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. మలయాళీ హిట్‌ ఫిల్మ్‌ ‘అయ్యుప్పున్‌ కోషియమ్‌’ ఇది

Top