అట్టా చూడమాకే..

తెలుగు తెరపై కొత్త నటీనటులు తళుక్కుమనడం కొత్తేం కాదు. ఎంతమంది వచ్చినా, ఎన్ని సినిమాలు చేసినా అభిమానులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ కోవలో వస్తున్న హీరో జొన్నలగడ్డ హరికృష్ణ. ఇతని సరసన హీరోయిన్‍గా చేస్తోంది అక్షిత. ఇటీవలే ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ‘అట్టా చూడమాకే..’ అనే పాట అందరి నోట్లలో హమ్‍ చేస్తోంది. హరికృష్ణలో మంచి డ్యాన్సర్‍ ఉన్నాడని మాస్‍ మహారాజా రవితేజ, వెటరన్‍ నటి జయప్రద కితాబునిచ్చారు.

శ్రీకాంత్‍ ‘కోతలరాయుడూ

కుటుంబ కథా చిత్రాలతో తనదైన నటనతో ముద్ర వేసిన శ్రీకాంత్‍ చాలా కాలం తరువాత ముఖానికి మేకప్‍ వేసుకుంటున్నారు. ఆయన హీరోగా, ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్‍ చోపడే, ‘జై సింహా’ ఫేం నటాషా దోషి కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కోతలరాయుడు’. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లోనూ, బెంగళూరులోనూ ఈ చిత్రం అత్యధిక భాగాన్ని షూట్‍ చేయడానికి చిత్ర బృందం ప్లాన్‍ చేసింది. ఈ సినిమాలో తెలుగు చిత్రసీమలోని భారీ

మహేశ్‍ మెచ్చిన అభిమన్యుడూ

సినిమా బాగుంటే చాలు.. రెండో మాట లేకుండా ముఖంపైనే ప్రశంసించేస్తాడు మహేశ్‍బాబు. విశాల్‍, సమంత, అర్జున్‍ ముఖ్య పాత్రల్లో నటించిన అభిమన్యుడు జూన్‍ 1న విడుదలైన విషయం తెలిసిందే. రిలీజైన నాటి నుంచి ఈ సినిమా హిట్‍ టాక్‍తో బాక్సాఫీస్‍ బద్దలుకొడుతోంది. విదుడలైన మొదటి పద్దెనిమిది రోజుల్లోనే పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసిందీ చిత్రం. ఇటీవలే ఈ సినిమాను చూసిన మహేశ్‍బాబు.. సినిమా చాలా బాగుంది అని

మన సంస్క•తిని చాటే ‘యామిని’

పాకిస్థాన్‍లో భరతనాట్య ప్రదర్శన చేసిన భారతీయ నృత్య కారిణి యామిని కృష్ణమూర్తి. నృత్యంతో భారతీయ సంస్క•తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఆమె జీవితంలో చాలా డ్రామా ఉంది. అవన్నీ తెరపై ఆవిష్కరించనున్నారు గిరిధర్‍ గోపాల్‍. ఆయనే ఈ సినిమాకు దర్శక నిర్మాత. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన యామిని కృష్ణమూర్తి ఇరవై ఎనిమిదో ఏటనే పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. పద్మభూషణ్‍, పద్మవిభూషణ్‍ కూడా అందుకున్నారు. తెలుగు వారైన యామినీ కృష్ణమూర్తి భరతనాట్యం,

సైరాకు సుదీప్‍ సై

తన కెరీర్‍లో సినిమా అనేది ఎప్పుడూ స్పెషలేనని అంటున్నారు కన్నడ నటుడు సుదీప్‍. నా మూవీ రెగ్యులర్‍ జర్నీలో సినిమా ఎప్పుడూ సర్‍ప్రైజ్‍లు ప్లాన్‍ చేస్తుందని కూడా అంటున్నాడీయన. ఇంతకీ విషయం ఏమిటంటే మెగాస్టార్‍ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘సైరా’లో సుదీప్‍ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్య ‘ఈగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన చిరంజీవి వంటి లెజండ్‍తో నటించనుండటం తన అదృష్టమని అంటున్నారు.

Top