అల్లుడొస్తున్నాడు!

రమ్యకృష్ణ మామూలుగానే యాంగ్రీ ఉమన్‍ పాత్రలు అదరగొట్టేస్తుంది. ఇక, అత్త వంటి క్యారెక్టర్‍ ఇచ్చి నటించమంటే.. జీవించి చూపెయ్యదూ! ఇప్పుడు అదే జరగబోతోంది. నాగచైతన్య అల్లుడిగా, అనూ ఇమ్మాన్యుయేల్‍ రమ్యకృష్ణ కుమార్తెగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‍కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్త (రమ్యకృష్ణ) ఓరకంటితో కాసింత కోపంగా చూస్తోంటే, అల్లుడు.. తన భార్య (రమ్యకృష్ణ కుమార్తె)తో కలిసి అత్తను ఆట పట్టిస్తున్నట్టు ఉన్న ఈ చిత్రం చూస్తుంటే.. సినిమాలో అత్త – అల్లుడు మధ్య మాంచి పోటా పోటీ సన్నివేశాలే ఉంటాయని అనిపిస్తోందని ఫిల్మ్నగర్‍ జనాలు అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Review అల్లుడొస్తున్నాడు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top