ఆట మొదలైంది….

నిశ్శబ్దంగా హిట్లు కొట్టడం నారా రోహిత్‍ స్టైల్‍. తెరపై మంచి భావోద్వేగాలను పండించే ఈ నటుడు తాజాగా జగపతిబాబుతో కలిసి తెరపంచుకుంటున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‍లో ‘ఆటగాళ్లు’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి ‘గేమ్‍ విత్‍ లైఫ్‍’ అనేది ఉప శీర్షిక (ట్యాగ్‍లైన్‍). పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‍ మొదలైంది. ప్రేమ, వినోదంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‍గా ఈ సినిమా రూపొందుతోందని దర్శకుడు చెబుతున్నాడు. బ్రహ్మానందం ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఖాయ మని చిత్ర బృందం చెబుతోంది.

Review ఆట మొదలైంది…..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top