ఇంకా చాలా టైం ఉంది..

టాలీవుడ్‍ స్టార్‍
హీరోయిన్‍ రకుల్‍ప్రీత్‍ సింగ్‍ తన అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. వరుస విజయాలతో జోరుమీదున్న రకుల్‍ తన అభినయంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే అటు నటనతో పాటు.. ఇటు జిమ్‍ ను కూడా నడిపిస్తోంది. ‘ఎఫ్‍ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‍ను నెలకొల్పిన రకుల్‍.. వ్యాయామ ప్రియులకు అవసరమైన అన్నిరకాల అత్యాధునిక ఎక్విప్‍మెంట్‍ తమ ఫిట్‍నెస్‍ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయంటోంది. అటు సినామాలు.. ఇటు జిమ్‍ నిర్వాహకురాలిగా ఏలా రాణిస్తున్నారని అడిగితే.. ‘సమయం సరిపోవడం లేదు’ అనే పదం తన డిక్షనరీలోనే లేదని చెబుతోంది. అదెలా అని అడిగితే.. ఒకేసారి రెండు మూడు పనులు చేయడాన్ని తాను ఎంజాయ్‍ చేస్తానంటోంది. మనం ఎన్ని పనులు చేసినా.. ఇంకా చేయడానికి మరికొంత సమయం మిగిలే ఉంటుంది కదా అంటూ టైమ్‍ మేనేజ్‍ మెంట్‍ పాఠాలు చెబుతున్న రకుల్‍ తో చిట్‍ చాట్‍.

ఒకపక్క సినిమాల్లో నటిస్తూ.. మరోపక్క జిమ్‍ నిర్వహణ ఎలా?
నాకు పది చేతులున్నాయ్‍.. (నవ్వుతూ). నాకు ఊపిరిసలపనంత బిజీగా ఉండటం అంటే ఇష్టం. దీనివల్ల అనవసర ఆలోచనలు దరిచేరవు. ఇష్టపడి చేసే పనుల్లో నిండా మునిగిపోతే.. కలిగే ఆనందమే వేరు. అందుకే రెండు మూడు సినిమాలు చేస్తూ కూడా నేను హైదరాబాద్‍లో ఓ జిమ్‍ను నడుపుతున్నా.. త్వరలో విశాఖపట్నంలోనూ ఒక బ్రాంచ్‍ను ప్రారంభించబోతున్నా.

ఒకేసారి ఇన్ని పనులు చేయడం అలసట అనిపించదా?
మనకు నచ్చే పనులనే మనం చేసేటప్పుడు అలసట అనే ప్రశ్నే లేదు. ప్రస్తుతం నేను సినిమాల్లో నటిస్తున్నాను. జిమ్‍ నడుపుతున్నాను. ఇంకో పది పనులు చేయడానికైనా సిద్ధమే.

మరి, సమయం సరిపోతుందా?
మనం ఎన్ని పనులు చేసినా.. చేస్తున్నా.. ఇంకా ఎంతో కొంత సమయం మిగిలే ఉంటుంది. టైమ్‍ను జాగ్రత్తగా మేనేజ్‍ చేసుకోగలిగితే ఏదైనా సాధ్యమే.

మీ తరువాతి చిత్రం..?
పస్తుతం మహేశ్‍ సరసన నటిస్తున్నా. తరువాత నాగచైతన్యతో చేయబోతున్నా.. ఇందులో పూర్తిగా లంగా ఓణి, పరికిణిల్లోనే కనిపిస్తాను.

ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?
ఇంకా కొత్తగా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాను. వాటిని వర్కవుట్‍ చేయ
డానికి ప్రయత్నిస్తా..

స్నేహితులతో చాటింగ్‍లు.. షాపింగ్‍లూ చేస్తారా?
ఇండస్ట్రీలో నా తోటి కథానాయికలు చాలామంది నాకు బెస్ట్ ఫ్రెండ్స్. అందరితో క్లోజ్‍గా ఉంటా.. టైమ్‍ దొరికితే వాళ్లతోనే ఫీలింగ్స్ పంచుకుంటా.

బుక్‍ రీడింగ్‍ హాబీ ఉందా?
యోగా, మెడిటేషన్‍, ఫుడ్‍కి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదువుతా.

Review ఇంకా చాలా టైం ఉంది...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top