ఇద్దరూ ఇద్దరే!

తెలుగు సినీ అభిమానులకు ఈసారి సంక్రాంతి కొన్ని రోజుల ముందే వచ్చేసింది. ఒకరోజు తేడాతో విడుదలైన ఇద్దరు అగ్రహీరోల సినిమాలు టాక్‍ ఆఫ్‍ ది స్టేట్‍గా మారాయి. ఒకరిది చాలా రోజుల విరామం తరువాత 150వ సినిమాగా రావడం, మరొకరిది కెరీర్‍లో వందో సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సినిమాల జయాపజయాలను పక్కనపెడితే వీటి విశేషాలు ఆసక్తికరం.. అవేమిటంటే..
సినిమా పేరు: ఖైదీనంబర్‍ 150
కథ: ‘కత్తి’ అనే తమిళ హిట్‍ సినిమా రీమేక్‍గా తెలుగులో రూపుదిద్దుకుంది. మరికొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. హీరో రైతుల తరపున పోరాడతారు.
బడ్జెట్‍: దాదాపుగా రూ.45 కోట్లు
విడుదల తేదీ: జనవరి 11
దర్శకుడు: వీవీ వినాయక్‍
ఎంత వసూలు చేస్తే లాభం?: దాదాపు రూ.90 కోట్లు
ముందే వచ్చిన లాభం: బాలకృష్ణ సినిమాకు ఒకరోజు ముందు విడుదల కావడంతో, తొలిరోజు ఎక్కువ థియేటర్లలో ఆడటంతో రూ.10 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ రకంగా ముందే రూ.10 కోట్లు ఖరారు చేసుకుంది.
సినిమా నిడివి: 2 గంటల 27 నిమిషాలు
మాటలు: బుర్రా సాయిమాధవ్‍
నటీనటులు: చిరంజీవి, కాజల్‍, అలీ తదితరులు

సినిమా పేరు: గౌతమీపుత్ర శాతకర్ణి
కథ: తొలి తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర చారిత్రక విజయాన్ని, తెలుగు ప్రాంతాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చిన వైనాన్ని కొంత ఊహాజనిత కథనాన్ని జోడించి తయారు చేశారు.
బడ్జెట్‍: దాదాపు రూ.45 కోట్లు
విడుదల తేదీ: జనవరి 12
దర్శకుడు: జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‍)
ఎంత వసూలు చేస్తే లాభం?: దాదాపు రూ.65 కోట్లు
ముందే వచ్చిన లాభం: చారిత్రక సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇచ్చాయి. దీంతో రూ.10 కోట్ల వరకు ఆ మేరకు సినిమా విడుదలకు ముందే సమకూరాయి.
సినిమా నిడివి: 2 గంటల 14 నిమిషాలు
మాటలు: బుర్రా సాయిమాధవ్‍
నటీనటులు: బాలకృష్ణ, హేమమాలిని, శ్రియ తదితరు

Review ఇద్దరూ ఇద్దరే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top