కాజల్ జిగేల్

‘ఖైదీ నంబర్‍ 150’లో మెగాస్టార్‍ చిరంజీవితో జట్టు కట్టి.. హిట్‍ కొట్టి..జోరు మీదుంది కాజల్‍ అగర్వాల్‍. ఆమె చిత్రసీమలో ప్రవేశించినప్పటి నుంచి ఏ రోజూ ఖాళీగా లేదంటే నమ్మాల్సిందే. తెలు గుతో పాటు తమిళంలోనూ నటిస్తూ వరుస విజయాలతో చాలా కాలంగా అగ్రతారగా కొన సాగు తున్న కాజల్‍.. తన తోటి నటీమణులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందనే టాక్‍ ఉంది. ‘పోటీ.. పోటీ.. ఎప్పుడూ అదేనా? అందుకే కొన్నాళ్లు పరుగు ఆపాలనిపించింది’ అని చెబుతున్న కాజల్‍తో ‘తెలుగు పత్రిక’ చిట్‍చాట్‍..

టాలీవుడ్‍లో చాలా కాలంగా అగ్ర నాయకగా కొనసాగడం ఎలా ఉంది?
టాలీవుడ్‍లో నా ప్రయాణాన్నీ.. నా ప్రతి అడుగునూ ఎంజాయ్‍ చేశాను. దాదాపు అందరు అగ్ర కథానాయకులతోనూ నటించాను. పదేళ్లుగా విజయవంతంగా నా కెరీర్‍ను పూర్తి చేశాను.
వృత్తి, వ్యక్తిగత జీవితాన్నీ ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?
నిజమే.. వృత్తిని వ్యక్తిగత జీవితాన్నీ సమన్వయం చేసుకుంటూ చిత్ర పరిశ్రమలో ముందుకు సాగడం కాస్త కష్టమైన పనే. ఇదంత ఈజీ కాదు. అయితే, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. నిజ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కూడా ఏమాత్రం మిస్‍ కాలేదు. అందుకు ప్లానింగ్‍తో ముందుకు వెళ్లడమే కారణం.
అంటే.. మీ జీవితంలో అన్నీ ప్లానింగ్‍ ప్రకారమే జరిగాయా?
అవును. ఏనాడూ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురు కాలేదు. ఒకటి రెండు సినిమాలకే నేడు హీరోయిన్లు పరిమితం అవుతోంటే నేను పదేళ్లుగా అదే స్థానంలో కొనసాగుతున్నానంటే.. అదృష్టమనే చెప్పాలి. అంటే, ఒక నటిగా నా తలరాతను నేనే రాసేసుకున్నానేమో అనిపిస్తుంటుంది. నా జీవితంలో అన్నీ ప్లాన్డ్గానే జరిగాయి. తలుచుకుంటే నాకే చిత్రంగా అనిపిస్తోంది.
ఈ పదేళ్లలో సినిమాలు కాకుండా ఇంకా ఏం చేశారు?
విదేశాలు చుట్టొచ్చాను. ఫ్రెండ్స్తో సరదాగా పార్టీలకు వెళ్లాను. షాపింగ్‍ చేశాను. సినిమాల్లో నటిస్తూనే చదువుకున్నాను. కొత్త ప్రదేశాలు చూసొచ్చాను. కుటుంబ సభ్యులతో కావాల్సినంత సమయం గడిపాను. అందుకే ఈ జీవితంలో ఏదో కోల్పోయాననే భావన నాకెప్పుడూ కలగలేదు.
ఓ సందర్భంలో పరుగు ఆపేస్తున్నానన్నారు? ఎందుకు?
అవే పాత్రలు.. అవే వేషాలు.. ఎంత కాలమిలా? అందుకే నా సినీ జర్నీని కొంత స్లో చేయాలని నాకు నేనుగానే అనుకొన్నాను. నాణ్యమైన పాత్రల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాను. చిన్న పాత్ర అయినా సరే.. మనసుకు పరిపూర్ణమైన సంతృప్తినిచ్చే పాత్ర కోసం ఎదురు
చూస్తున్నా. ఈ నిర్ణయం మరో కొత్త ప్రయాణానుభూతిని కలిగిస్తోంది?
నెక్టస్ సినిమా ఏమిటి?
రానా హీరోగా, ‘నేనే రాజు.. నేనే మంత్రి’ చిత్రంలో నటిస్తున్నాను.

Review కాజల్ జిగేల్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top