చిరు సర్ప్రైసింగ్

మహేశ్‍బాబు సినిమా షూటింగ్‍లో మెగాస్టార్‍ చిరంజీవి అనుకోకుండా తళుక్కుమన్నారు. నిజమే..! ప్రస్తుతం మురుగదాస్‍ దర్శకత్వంలో మహేశ్‍ హీరోగా తెరకెక్కనున్న చిత్రం హాట్‍ ఫేవరెట్‍గా మారింది. ఈ సినిమా షూటింగ్‍ ముంబయ్‍, అహ్మదాబాద్‍.. తదితర ముఖ్య పట్టణాల్లో జరుగుతోంది. దీనికి ‘సంభవామి’, ‘ఏజెంట్‍ శివ’ ‘మర్మం’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఉన్నట్టుండి ఈ సినిమా సెట్‍లోకి మెగాస్టార్‍ చిరంజీవి వచ్చారు. మహేశ్‍పై తీసిన సాంగ్‍ ప్రివ్యూను మహేశ్‍, మురుగదాస్‍తో కలిసి చూశారు. ఈ దృశ్యాన్ని కెమెరామెన్‍ సంతోశ్‍శివన్‍ ఫొటో తీయగా.. మురుగదాస్‍ దాన్ని ట్విట్టర్‍లో షేర్‍ చేశారు. ఈ ఫొటో సినీ పరిశ్రమలో హాట్‍ టాపిక్‍గా మారింది.

Review చిరు సర్ప్రైసింగ్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top