తింటే వదలరు.. బీట్‍రూట్‍ వడ

బీట్‍రూట్‍ వడ

కావాల్సినవి:
శనగపప్పు, కందిపప్పు- 4 టేబుల్‍ స్పూన్లు చొప్పున 2 గంటల పాటు నానబెట్టాలి), ఎండుమిర్చి- 5, జీలకర్ర- అర టీ స్పూన్‍, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 2 (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి), బీట్‍రూట్‍ తురుము- 2 కప్పులు, కరివేపాకు- 2 రెమ్మలు, అల్లం పేస్ట్- అర టీ స్పూన్‍, ఉప్పు- సరిపడా, నూనె- డీప్‍ ఫ్రైకి సరిపడా.

త•యారు చేసే విధానం:

ముందుగా మిక్సీ బౌల్‍ తీసుకుని అందులో శనగపప్పు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‍లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, కరివేపాకు, బీట్‍ రూట్‍ తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాల్స్లా చేసుకుని వడల్లా చేతులతో నొక్కి, నూనెలో డీప్‍ ఫ్రై

ప్రైడ్‍ రైస్‍ బాల్స్

కావాల్సినవి:
అన్నం- 3 కప్పులు, మైదాపిండి- అర కప్పు, గుడ్లు- 4, పాలు- 2 టీ స్పూన్లు, సోయా సాస్‍- 1 టేబుల్‍ స్పూన్‍, క్యారెట్‍- 1 (చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి), రెడ్‍ క్యాప్సికం- 2 టేబుల్‍ స్పూన్లు, ఉప్పు- తగినంత, బ్రెడ్‍ పౌడర్‍- 1 కప్పు, నూనె- డీప్‍ ఫ్రైకి సరిపడా.

తయారు చేసే విధానం:

ముందుగా ఒక బౌల్‍లో అన్నం, మైదాపిండి, రెండు గుడ్లు, సోయా సాస్‍ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్‍ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‍లో 2 గుడ్లు + పాలు, మరో బౌల్‍లో బ్రెడ్‍ పౌడర్‍ వేసుకుని.. ఆ బాల్స్ను గుడ్లు + పాల మిశ్రమంలో ముంచి, వాటికి బ్రెడ్‍ పౌడర్‍ పట్టించి, నూనెలో దోరగా వేయిం చాలి. సాస్‍తో కలిపి సర్వ్ చేసుకుంటే
భలే టేస్టీగా ఉంటాయి.

పనీర్‍ పొటాటో శాండ్విచ్‍

కావాల్సినవి:
పనీర్‍ తురుము- 1 కప్పు,
ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు,
క్యాప్సికం ముక్కలు- 1 టేబుల్‍ స్పూన్‍,
చీజ్‍- 2 టేబుల్‍ స్పూన్లు, బంగాళాదుంప ముక్కలు- 1 కప్పు (మెత్తగా ఉడికినవి),
మసాలా పొడి- 1 టీ స్పూన్‍,
కారం- 1 టీ స్పూన్‍,
గుడ్డు- 1, పాలు- 1 టేబుల్‍ స్పూన్‍,
ఉప్పు- తగినంత, బ్రెడ్‍ పీసులు- 6,
సాస్‍- 2 లేదా 3 టేబుల్‍ స్పూన్లు, నూనె- కొద్దిగా.

తయారు చేసే విధానం:

ముందుగా బ్రెడ్‍ పీసులను చిన్న బౌల్‍ ఉపయోగించి గుండ్రంగా కట్‍ చేసుకోవాలి. తరువాత ఒక పెద్ద బౌల్‍ తీసుకుని అందులో పనీర్‍ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, చీజ్‍, మసాలా పొడి, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుండ్రటి బ్రెడ్‍ పీసు తీసుకుని దానిపైన పనీర్‍ మిశ్రమాన్ని పెట్టుకుని, మరో గుండ్రటి బ్రెడ్‍ పీస్‍ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‍లో గుడ్డు, పాలు వేసుకుని బాగా కలుపుకుని అందులో ఈ శాండ్విచ్‍ను ముంచి దోరగా నూనెలో వేయించాలి. ఇప్పుడు ఆ శాండ్విచ్‍ను సగానికి కోసి, దానిపైన సాస్‍, బంగాళాదుంప ముక్కలు, ఇతరత్రా అలంకరణ పదార్థాలు వేసుకోవచ్చు. అభిరుచిని బట్టి కారపుపూస వంటివి కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.

Review తింటే వదలరు.. బీట్‍రూట్‍ వడ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top