నాని నన్నయ్యాడు

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా ఆరు హిట్లను తన ఖాతాలో వేసుకున్న అరుదైన నటుడిగా రికార్డు సృష్టించిన హీరో నాని కంటే ప్రస్తుతం ఎవరూ సంతోషంగా లేరు. ఎందుకంటే, నటుడిగా వరుస విజయాలతోనే కాదు.. ఇటీవల కొడుకు పుట్టిన ఆనందంతోనూ నాని రెట్టింపు సంతోషంతో ఉన్నాడు. తెలుగు సంవత్సరాది రోజున నానికి పుత్రోత్సాహం కలిగింది. ఆయన తండ్రి కావడంతో సినీ పరిశ్రమలో అందరితో ఆనందాన్ని పంచుకున్నాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాని భార్య అంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. నాని, అంజన 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే ‘నేను లోకల్‍’ సినిమాతో ‘గ్లోబల్‍ స్థాయి హిట్‍’ కొట్టిన నాని.. మరిన్ని విభిన్న కథలను ఎంచుకునే పనిలో బిజీగా ఉంటూనే కొడుకుతోనూ వీలైనంత సమయాన్ని గడుపుతున్నాడు.

Review నాని నన్నయ్యాడు

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top