నాన్నారి విల్ పవర్

శుతిహాసన్‍.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటుడు కమల్‍హాసన్‍ కుమార్తె. రియల్‍ లైఫ్‍లోనే కాదు.. రీల్‍ లైఫ్‍లోనూ వీరిద్దరు తండ్రి-కూతురుగా కనిపించనున్నారు. ‘శభాష్‍ నాయుడు’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అయితే, కొద్ది రోజుల క్రితం కమల్‍హాసన్‍ ఇంటిలో జారి పడటంతో షూటింగ్‍కు బ్రేక్‍ పడింది. ఆ సమయంలో శ్రుతి విదేశాల్లో వేరే సినిమా షూటింగ్‍లో ఉంది. విషయం తెలిసిన వెంటనే వచ్చేసింది. ‘నాన్న విల్‍ పవర్‍ చాలా గొప్పది. అందుకే ఆయన త్వరగానే ప్రమాదం నుంచి రికవరీ అయ్యారు’ అని చెప్పింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది.

Review నాన్నారి విల్ పవర్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top