ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా

‘మన లైన్‍లో మనం వెళ్లడం కాదు.. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గుర్తించి, వారి ఆలోచనలకు తగినట్టుగా కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేయాలి’ అంటున్నాడు అల్లరి నరేష్‍. ‘బెండు అప్పారావు’, ‘కితకితలు’ వంటి సినిమాలతో కామెడీ హీరోగా పేరొందిన నరేష్‍.. ఒకటి రెండు కామెడీ సినిమాలు హిట్‍ అయ్యాయి కదాని వరుసగా అదే జోనర్‍లో సినిమాలు చేసుకుంటూ వెళ్తే లాభం లేదనే విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని చెబుతున్నాడు. అందుకే ఈసారి రూటు మార్చి, వెరైటీ కథాంశంతో, వెరైటీ పాత్రతో ‘మేడ మీద అబ్బాయి’ సినిమా చేసినట్టు చెప్పాడు. జీవితాన్ని తేలిగ్గా తీసుకునే ‘శీను’ అనే కుర్రాడు తన దురుసు ప్రవర్తనతో కష్టాలు కొనితెచ్చుకుంటాడు. నెమ్మదిగా విలువల గురించి తెలుసుకుంటాడు. పరివర్తన చెంది తనకెదురైన సమస్యల నుంచి ఎలా బయట పడాడనేదే ‘మేడ మీద అబ్బాయి’ కథాంశం. ఈ సినిమాలో నాలో ప్రేక్షకులు కచ్చితంగా కొత్తదనం చూస్తారని, తన నటనతో నిరాశపరచనని నరేష్‍ గట్టిగా చెబుతున్నాడు.

Review ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top