భలే కాంబినేషన్‍ గురూ…

త్రివిక్రమ్‍ డైలాగుల్ని వెంకటేశ్‍ పలికితే.. థియేటర్లలో ప్రేక్షకుల పొట్టలు బద్దలే.. వీరిద్దరి కాంబినేషన్‍లో గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్‍’, ‘మల్లీశ్వరి’ ఎంత పెద్ద హిట్లో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలకు త్రివిక్రమ్‍ కేవలం సంభాషణల రచయితగా మాత్రమే పని చేశాడు. ఇప్పుడు వెంకటేశ్‍ను డైరెక్ట్ చేయడానికి ఆయన రెడీ అయిపోయారు. నిజానికి ఈ రెండు సినిమాల తరువాతే త్రివిక్రమ్‍ డైరెక్టర్‍ అయ్యారు. అయితే, వెంకటేశ్‍తో ఇన్నాళ్లూ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు టైమొచ్చింది. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ వెంకటేశ్‍ హీరోగా త్రివిక్రమ్‍ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తోంది. వచ్చే ఏడాది చివరిలో వెంకీ, త్రివిక్రమ్‍ల క్రేజీ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని అనుకుంటున్నారు. వెంకటేశ్‍ జన్మదినం సందర్భంగా డిసెంబరు 13న నిర్మాత రామకృష్ణ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం త్రివిక్రమ్‍- పవన్‍కల్యాణ్‍ హీరోగా ‘అజ్ఞాతవాసి’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్‍ అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారని ఫిల్మ్నగర్‍ టాక్‍.

Review భలే కాంబినేషన్‍ గురూ….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top