‘భోళా శంకర్‌’ షురూ

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రీకరణను పట్టాలెక్కించేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళయాలం సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మెహన్‌రాజ్‌ దర్శకుడు. ఇదిలా ఉండగా, ‘భోళా శంకర్‌’ సినిమాను సైతం అదే సమయంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ హిట్‌ మూవీ ‘వేదాళం’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ స్వరాలు అందించనుండటం విశేషం. సంగీతపరంగా ఈ సినిమా అత్యుత్తమ ప్రమాణాలతో ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో సంగీతం, పాటలు, నేపథ్య సంగీతం ఒక స్థాయిలో ఉండబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా కీర్తిసురేశ్‌ నటించనుంది. ఇదికాక బాబా దర్శకత్వంలో సైతం చిరంజీవి హీరోగా మరో సినిమా రూపుదిద్దుకోనుంది.

Review ‘భోళా శంకర్‌’ షురూ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top