మహేశ్‍, చరణ్‍, ఎన్టీఆర్‍ అనే మేము..

ఇదేంటి.. మహేశ్‍బాబు నటిస్తున్న ‘భరత్‍ అనే నేను’ తరహా టైటిల్‍తోనే ‘మహేశ్‍, చరణ్‍, ఎన్టీఆర్‍ అనే మేం’ అనే టైటిల్‍తో సినిమా వస్తుందని అనుకుంటున్నారా? అదేమీ కాదు కానీ, తెలుగు చిత్రసీమలో అగ్రపథాన ఉన్న ఈ ముగ్గురు నటులు ఇటీవల ఓ ఫంక్షన్‍లో కలిశారు. ముగ్గురూ కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చే సరికి ఫాన్స్ ఫిదా అయిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే… మహేశ్‍బాబు తాజా చిత్రం ‘భరత్‍ అనే నేను’ విడుదలకు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సన్నాహాలలో భాగంగా ఇటీవలే ‘భరత్‍ బహిరంగసభ’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఫంక్షన్‍లో మహేశ్‍ బాబుతో పాటు జూనియర్‍ ఎన్టీఆర్‍ వేదికను పంచుకోవడమే వండర్‍ అనుకుంటే, ఆ మర్నాడు మహేశ్‍బాబు ఇచ్చిన విందుకు జూనియర్‍ ఎన్టీఆర్‍తో పాటు రామ్‍చరణ్‍ కూడా రావడం మరింత సెన్సేషన్‍ అయ్యింది. ‘మాలాగానే ఫ్యాన్స్ కూడా కలిసిమెలిసి ఉండాలి’ అని ఈ ముగ్గురూ మెస్సేజ్‍ కూడా ఇచ్చారు.

Review మహేశ్‍, చరణ్‍, ఎన్టీఆర్‍ అనే మేము...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top