
– రాజేశ్వరి అన్నవరపు, స్వాతిభాస్క
అద్భుతాలకు నిలయం
ఈ ఆలయం నిర్మించి అప్పుడే 25 ఏళ్లు గడిచిపోయాయంటే నిజంగా నమ్మశక్యంగా లేదు. 1994లో మొదటిసారిగా ప్రాణప్రతిష్ట నిర్వహించాం. ఆలయాన్ని దర్శించే భక్తులకు సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతిని అందించాలన్నది ఐసీసీటీ ధ•ఢ సంకల్పం. అందుకనుగుణంగా నిర్మలమైన, ప్రశాంతమైన వాతావరణంలో అత్యున్నత అర్హతలు కలిగిన అర్చకులు ఆగమశాస్త్రానుసారం పూజాదికాలు, అర్చనాదులు నిర్వహిస్తారు
‘వెంకటాద్రి సమఃస్థానం బ్రహ్మాండే నాస్తికించనః. వెంకటేశ సమోదేవ న భూతో న భవిష్యతి’ అన్న మాటను నిలబెట్టేందుకు అనుక్షణం అక్కడే శ్రమిస్తుంటారు ప్రేమతో. మెంఫిస్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ట్రస్టీల మాటల్లోనే…
ఆలయ ప్రతిష్టాపన జరిగి కొద్ది ఏళ్లే అయినా మా ఆలయం పలు ప్రత్యేకతలను, విశిష్టతలను తన ఖాతాలో వేసుకుంది. నార్త్ అమెరికాలో ఆగమశాస్త్రాన్ని విధిగా పాటించే ఆలయంగా, ఇక్కడ మొట్టమొదటిసారిగా యజ్ఞం నిర్వహించిన ఆలయంగా నిలిచింది. ఇక్కడ ప్రపంచంలోనే మొదటిసారిగా ‘శ్రీ అష్టముఖ గండభేరుంఢ లక్ష్మీ నరసింహస్వామి మహా యజ్ఞం’ నిర్వహించాం. విదేశాలలో ప్రథమంగా యజ్ఞనిర్వహణ, ధ్యానం కోసం ప్రత్యేక గార్డెన్, పుష్కరిణి సముదాయం, విఖనస మహర్షికి ప్రత్యేక ఆలయం, ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రీ అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, నాగదేవత గుడి’’ ఉన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
మా ఆలయం 25వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ సముదాయం యొక్క పవిత్రతను సౌందర్యాన్ని, పవిత్రతను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఆలయపు బాటను వెడల్పు చేయాలని నిర్ణయించాం. ఆ బాట పొడవునా దశావతారాలు, అక్కడి కొలను చుట్టూ పరమేశ్వరుడి సప్తతాండవాలు, మెడిటేషన్ హాలు దగ్గర గాయత్రీమాత విగ్రహం ఏర్పాటు చేశాం. ఈ కొత్త ఏర్పాట్లన్నీ భక్తులు, సందర్శకులకు వైకుంఠాన్ని దర్శించినంత ఆధ్యాత్మిక, ఉద్వేగపూరితమైన అనుభూతిని కలిగించేందుకు దోహదం చేస్తాయి.
మా ఆలయం 25 ఏళ్ళ విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించు కుని ‘ద్వితీయ జీర్ణోద్ధరణ మహా ప్రతిష్ట’ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించాలని నిర్ణయించాం. దీనిలో భాగంగా ‘ప్రాణప్రతిష్ట ’ కార్యక్రమ నిర్వహణ కోసం శైవ, వైష్ణవ ఆగమాల్లో ఉద్దండులనదగ్గ వారిని ఆహ్వానించాం. వినోద కార్యక్రమాలతో అలరించేందుకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రసిద్ధి గాంచిన కళాకారులు విచ్చేస్తున్నారు. అంతే కాదు ఈ సందర్భంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన, పేరు పొందిన స్థానిక రుచుల కమ్మదనాన్ని ఆస్వాదించే ఏర్పాటు చేస్తున్నాం. అసంఖ్యాకంగా విరాళాలు అందించిన దాతల దాత•త్వం మా ఆలయం అన్ని విధాలా ఇంతగా అభివ•ద్ధి చెందింది. వీరే కాక ఆలయ కార్య క్రమాల్లో స్వచ్ఛందంగా సేవలందించిన వాలంటీర్లందరికీ మా హ•దయ పూర్వక క•తజ్ఞతలు. మా ట్రస్టీ బోర్డు ఇక్కడి హిందూ సమాజం కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే సంవత్సరాల్లో మీరు కూడా ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పరిరక్షిస్తారని, ఈ ఆలయ అభివ•ద్ధికి తోడ్పడతార ఆశిస్తున్నాం.
మెంఫిస్ ఆలయ అర్చకు
నారాయణం వెంకట సత్య నారాయణా చారు
వెంకట సాయి స్వర
నారాయణం వెంకట సత్య నారాయణా చార్యులు సంప్రదాయ పురోహిత కుటుంబంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలలో వైఖానస ఆగమంలో ‘ప్రతిష్టానం’ పూర్తిచేశారు. 1972 నుంచి 1985 వరకూ హ•షీకేష్లోని శ్రీ వెంకటేశ్వరాలయంలో అర్చకులుగా పనిచేశారు.1985 నుంచి 1992 దాకా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కాల యాన వెంకటేశ్వరాలయంలో ప్రధానార్చ కులుగా పని చేశారు.1992 నుంచి 1994 వరకూ మారిషస్‌లోని శ్రీ వెంకటేశ్వరాలయంలో పనిచేశారు. 1995, ఫిబ్రవరిలో తిరుమల-తిరుపతి దేవస్థానం వారు ఆయన్ను ఐసీసీటీ ప్రధా నార్చకులుగా సేవలందించాల్సిందిగా ఇక్కడకు పంపించారు. 1997లో అమెరికాలో మొదటిసారిగా యజ్ఞాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహ స్వామి మహా యజ్ఞాన్ని నిర్వ హించారు. అలాగే శ్రీ అష్టముఖ గండభేరుండ లక్ష్మీనరసింహస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. శ్రీ కరుణామయి విజయేశ్వరీ దేవి కోరిక మేరకు బెంగళూరులో ‘సాలిగ్రామ శ్రీనివాస’ విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి వారిని వైఖానస ఆగమ ప్రతిష్ఠంతు కర్తుం సమర్థత అనే బిరుదుతో సత్కరించారు.
ప్రాణప్రతిష్ట కార్యక్రమం తరువాత శ్రీ నండూరి (వాసుదేవ) శ్రీనివాస్, శ్రీ రామచంద్ర భట్లను అర్చకులుగా నియ మించడం జరిగింది. భట్ వెళ్లిపోయిన తర్వాత 1995 వరకూ వాసుదేవ నిత్యపూజలు నిర్వహించారు. అదే ఏడాది ఫిబ్రవరిలో పూజా విధి విధానాలను, సంప్రదాయాలను రూపొం దించేందుకు తిరుమల – తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడకు సత్యనారాయాణా చార్యులని తీసుకు వచ్చాం. ఆ ఏడాది మహాశివరాత్రి నాటి నుంచి వారు తమ అర్చకత్వాన్ని ప్రారంభించారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖానస ఆగమం ప్రకారం మహాశివుడు, శ్రీరామ సంబంధిత దేవతామూర్తులకు ఆగమం ప్రకారం పూజలు, అర్చనలు నిర్వహిస్తు.
ఇంకా శైవాగమ ప్రధాన అర్చకులు, ప్రముఖ జ్యోతిష పండితులు వెంకట సాయి స్వర్ణ, ప్రదీప్ కుమార్ దీవి, నాగప్రశాంత్ రుద్రపాక, రఘురామ్ అగ్నిహోత్రం, బాల గణేశ్ గంజాం తదితర పండితులు ఆల యానికి అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆలయ చరిత్ర
1950 తొలినాళ్లలో భారత్ నుంచి మెంఫిస్‌కు కొన్ని భారతీయ కుటుంబాలు వలస వచ్చాయి. 70,80ల మధ్యలో ఈ సంఖ్య 250కి పెరిగింది. మిడ్ సౌత్‌లో ఉన్న హిందువులు ఐఏఎమ్, టీఏఎమ్ ఏర్పాటు ద్వారా భారతీయ సంస్క•తిని అలవరచు కున్నారు. భారతీయ సమాజాలకు చెందిన సభ్యులు వారి మత, సాంస్క•తికపరమైన కార్యక్రమాలను కమ్యూనిటీ హాళ్లు, స్థానిక మాల్స్, చర్చి బేస్మెంట్లు, స్కూళ్ల ఆడిటోరియం లలో నిర్వహించుకునేవారు. సామాజిక, సాంస్క •తిక కార్యక్రమాల్లో భాగంగా వారంతా ఒక చోట చేరినపుడు తమకంటూ ప్రత్యేకంగా ఆలయం, ప్రార్థనామందిరం ఉండాలన్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చేది. కానీ చాలామంది అది నిజం కాని కల అని అను కునేవారు. వాస్తవంగా అది చాలాకాలం అలాగే ఉండి పోయింది.
1981లో ఐఏఎమ్ అధ్యక్షుడు శ్రీ విజయ్ రౌతానీ మెంఫిస్ యూనివర్శిటీలో జరిగిన ఒక సమావేశానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఇక్కడ ఒక ఆలయం, సాంస్క •తిక కేంద్రం ఏర్పాటు చేసి తీరాల్సిందేనని అందరూ అభిప్రాయపడ్డారు. తరువాతి కాలంలో డాక్టర్ ఏ.పీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కొంత మంది సభ్యులు కమిటీగా ఏర్పడి ఈ ఆలో చనను ముందుకు తీసుకువెళ్లడానికి తోడ్ప డ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో స్థానిక అటార్నీ మిస్టర్ మార్విన్ రాట్నర్ సహాయంతో నిబంధనలను రూపొందించారు. ఆలయం, ఇండియా కల్చరర్ సెంటర్లను ఎటువంటి లాభాపేక్ష లేని మత సంబంధ సంస్థలుగా ఆ నిబంధనల్లో పేర్కొ న్నారు. కమ్యూనిటీ సభ్యులు విరాళంగా ఇచ్చిన 250 డాలర్ల మూలధనంతో ఒక బ్యాంకు ఎకౌంట్‌ను కూడా ప్రారంభించారు.
అదే సమయంలో ‘ఆలయ కమిటీ’ సభ్యులు అంతా సమావేశం అయినప్పుడు ఆలయం, సాంస్క •తిక కేంద్రాల ఏర్పాటు గురించి ఇక్కడ ఉన్న ఇతర హిందువులు ఎన్నో సందేహాలు వెలిబుచ్చుతున్నారని, వారు తమను అవా స్తవంలో బతికేవారిగా నిజం కాని కలలు కనేవారిగా భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆ తరువాత ఎంతో శ్రమకోర్చి ఒక స్థలాన్ని వెదికి పట్టుకున్నాం. ఎట్టకేలకు 1985, అక్టో బర్లో ఈడ్స్లోని హైవే నెం. 64లో 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాం. అయితే ఆ తరువాత మాకు తెలిసిన ఆనందమూ, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆలయ నిర్మాణం కోసం మేం కొనుగోలు చేసిన ప్రదేశం షెల్బీ జిల్లాలోనే ఎత్తైన ప్రదేశం. అనంతరం శ్రీమతి సావిత్రి తహి లియానీ ఈ కార్యక్రమానికి దేవుడి ఆశీస్సులు ఉండాలన్న సదాశయంతో ‘సత్య నారాయణ పూజ’ నిర్వహించారు. ఆ తరువాత ఆలయ నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకున్నాం.
1985లో దసరా రోజున పిట్స్బర్గ్ వెంక టేశ్వర స్వామి ఆలయ అర్చకుల వారితో భూమి పూజ నిర్వహించాం. 1986, ఏప్రిల్‌లో మెంఫిస్ రాష్ట్ర తెలుగు అసోసియేషన్ సభ్యుల ఆధ్వ ర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ‘సీతారామ కల్యాణం’ జరిగింది.
ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఉన్న మన హిందూ సమాజానికి పరిచయం చేయడం కోసం, తరువాత సంవత్సరాల్లో ఇక్కడికి దగ్గర్లోని ఈడ్స్ హెడ్‌స్టార్ట్ పాఠశాలలో ఎన్నో పండగలను జరిపాం. సాంస్క•తిక కార్యక్రమా లను నిర్వహించాం.
ఆలయ కమిటీకి విశ్వసనీయత, చట్ట బద్ధత, నిర్ణయాధికారాలను కల్పిం చేందుకు నియమ, నిబంధనల ప్రకారం 1986లో డైరక్టర్ల బోర్డును ఎన్నుకొన్నాం. ఐసీసీటీ వ్యవహారాలను నిర్వ హించేందుకు డైరెక్టర్ల బోర్డులోని కొంతమందితో ఒక ఎగ్జి క్యూటివ్ కమిటీ ఏర్పాటైంది. ఆలయం, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ప్రణాళిక లను మరింతగా మెరుగు పరిచేందుకు డాక్టర్ ప్రసాద్ దుగ్గిరాల ఛైర్మన్‌గా 1987లో ఒక అడ్-హక్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటైంది.
ఆలయంలో ఏయే దేవతామూర్తులు ఉండాలన్న విషయంపై ఆలోచించాం. ప్లానింగ్ కమిటీ, ప్రసిద్ధ ఆలయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ ముత్తయ్య స్థపతిని ఆలయ రూపకల్పన కోసం ఆహ్వానించాం. మరో వైపు ఆలయం, కమ్యూనిటీ సెంటర్ల కోసం రూపొందించిన డిజైన్లను డైరక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ పక్రియలు, కార్యక్రమాలు అందరిలో ఆసక్తిని, ఉత్సుకతను పెంచాయి. 1990లో డాక్టర్ విజయ దుగ్గిరాల చైర్‌పర్సన్‌గా ఒక నిధుల సమీకరణ కమిటీ ఏర్పాటైంది. కార్యక్రమం పట్ల శ్రీమతి విజయ కున్న ప్రత్యేక శ్రద్ధాసక్తులు, నిబద్ధత కారణంగా ఎన్నో విరాళాలు పోగయ్యాయి. తరువాతి సంవత్సరాల్లో మిలియన్ డాలర్ల నిధులు ఐసీసీటీ ఖాతాలో జమ య్యాయి. 1991లో స్థానిక ఆర్కి టెక్ట్ శ్రీ క్లాడ్ బ్రగాంజాను ముత్తయ్య స్థపతికి తోడుగా నియమించారు. 10 మంది కమ్యూనిటీ సభ్యుల హామీతో 450,000 డాలర్ల లోను మంజూరు అయ్యింది.
1990లో డాక్టర్ విజయ దుగ్గిరాల చైర్‌పర్సన్‌గా ఒక నిధుల సమీకరణ కమిటీ ఏర్పాటైంది. కార్యక్రమం పట్ల శ్రీమతి విజయ కున్న ప్రత్యేక శ్రద్ధాసక్తులు, నిబద్ధత కారణంగా ఎన్నో విరాళాలు పోగయ్యాయి. తరువాతి సంవత్సరాల్లో మిలియన్ డాలర్ల నిధులు ఐసీసీటీ ఖాతాలో జమయ్యాయి .
ఎట్టకేలకు 1992, నవంబర్ 2లో పిట్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వరాలయ అర్చ కులు శ్రీ వరద రాజ భట్టార్ పునాది కార్యక్రమం నిర్వ హించారు. దేవతలు ఈ కార్యక్రమానికి శుభం చేకూరాలంటూ దివి నుంచి ఆశీస్సులు కురిపిస్తున్నారా అన్నట్లు ఆ రోజంతా భారీ వర్షం కురిసింది. 1993, జూన్ 27న ఆలయ నిర్మాణం మొదలైంది. 1994, మే లో నిర్మాణం పూర్త యింది. ఐసీసీటీ వ్యవస్థాపక సభ్యులు, ట్రస్టీ శ్రీ జమ్ను తహిలియానీ స్ట్రక్చరల్ ఇంజనీర్‌గా తమ అమూల్యమైన అనుభవాన్ని, విలువైన సమయాన్ని వెచ్చించారు. భూకం పాలను కూడా తట్టుకోగల, దీర్ఘకాల మన్నగల భవనాలను నిర్మించడంలో తోడ్పడ్డారు.
1993, జూన్ 27న ఆలయ నిర్మాణం మొదలైంది. 1994, మే లో నిర్మాణం పూర్త యింది. ఐసీసీటీ వ్యవస్థాపక సభ్యులు, ట్రస్టీ శ్రీ జమ్ను తహిలియానీ స్ట్రక్చరల్ ఇంజనీర్‌గా తమ అమూల్యమైన అనుభవాన్ని, విలువైన సమయాన్ని వెచ్చించారు. భూకంపాలను కూడా తట్టుకోగల, దీర్ఘకాల మన్నగల భవనాలను నిర్మించడంలో.
ఒక్లహామాకు చెందిన శ్రీ వేదాల శ్రీనివాసా చార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముహూ ర్తాన్ని నిర్ణయించారు. శ్రీ వరదరాజ భట్టార్ ఆధ్వర్యంలో 1994, జూన్‌లో చికాగో, న్యూయా ర్క్కు చెందిన ఆరుగురు అర్చక మహా శయులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమతి శోభారాజు నిర్వ హించిన అపూర్వ భక్తి గానకచేరితో కార్యక్రమం అద్భుతంగా ముగిసింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆమెకు తన కాషాయ వస్త్రాల్ని బహూకరించారు. ఆ విధంగా మొత్తం కార్య క్రమంపై తన కరుణా కటాక్షాలను ప్రస రించారు.
1995 జూన్‌లో ఆలయం మొదటి వార్షి కోత్సవం నాడు గరుడ, నంది ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించాం. అదే ఏడాది అక్టోబరులో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, దుర్గా నవరాత్రులు ఆగమ శాస్త్రాల ప్రకారం ఘనంగా నిర్వ హించడం జరిగింది. దేవుడి క•ప వల్ల తొమ్మిది రోజులు, తొమ్మిది వాహనాలతో బ్రహ్మాం డంగా ఉత్సవాలు జరిగాయి. కేవలం భగ వంతుడి పట్ల ఉన్న అచంచల భక్తి విశ్వాసాలతో వాలంటీర్లు ఈ ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపించారు. నార్త్ అమెరికాలో ఆగమ శాస్త్రానుసారం పూజాదికాలు, పండుగలు జరిపించే ఆలయం ఇదే. 1996లో రెండో వార్షికోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పూలంగి సేవ, మహాదేవుడికి అన్నాభిషేకం నిర్వ హించాం. అప్పటి నుంచి ప్రతీ ఏడాదీ వార్షికోత్స వాలు జరుగుతున్నాయి. అసంఖ్యాకంగా భక్తులు వాటికి హాజరవు తున్నారు. వార్షిక కాలెండర్లను ఎంతో సుందరంగా, ఆకర్షణీయంగా రూపొం దిస్తున్నాం.
ఆలయాన్ని భారతీయీకరణ గావిం చేందుకు గాను ఎన్. వీ రాఘవయ్య హామీగా ఉండి 300,000 డాలర్లను సమీ కరించడం జరిగింది. ఇందుకోసం
2001, మేలో శ్రీ లోకనాథన్ చిన్నస్వామి నాయ కత్వంలో తొమ్మిది మంది శిల్పులు ఇక్కడకు చేరుకున్నారు. వారందరూ అపూ ర్వమైన పనితనంతో సుందరమైన ఆలయగోపు రాన్ని, తొమ్మిది విమానాలను రూపొం దించారు. అద్భుతమైన శిల్పాలను చెక్కారు. అద్వితీయ నైపుణ్యంతో ఆలయాన్ని, పరిసరాల్ని సుందరంగా తీర్చి దిద్దిన వారి సేవలను హిందూ సమాజం ఎంతో ప్రశం సించింది.
సువిశాలమైన ముఖ ద్వార
పద్మసరోవరం నుంచి ఆలయం ఆవరణ వరకు గల తపోవనంలో 18 నూతన విగ్ర హాలను ప్రతిష్ఠించడం జరిగింది. వాటిలో పది విగ్రహలు శ్రీమహావిష్ణువు ధరించిన దశావతార వర్ణనకు సంబంధించినవి కాగా, 7 విగ్రహాలు శివతాండవానికి చెందినవి. మరో విగ్రహం గాయత్రీదేవిది.
మహాద్వారానికి ముందు సువిశాలమైన ముఖ.
అన్నదానం
హిందూ ధర్మ సూత్రాలను అనుసరించి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆరంభించాలని 2003, జనవరిలో ఐసీసీటీ బోర్డు తీర్మానించింది. ఈ తీర్మానాన్ననుసరించి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శనివారం ‘అన్న ప్రసాదం’ అందించాలని బోర్డు నిర్ణయించింది. ఆ భగ వంతుడి క•పాకటాక్షాల వలన ఆనాటి నుంచి దశాబ్దానికి పైగా ప్రతి శనివారం ఈ కార్య క్రమం ఎలాంటి అంతరాయం లేకుండా సాగు తోంది. అన్నదానం రోజు ఉదయాన వలంటీ ర్లందరూ కలసి కమ్మటి శాకాహర భోజనాన్ని వండుతారు. మొదటగా దానిని దేవుడికి నివే దించి ఆ తరువాత భక్తులకు అన్నప్రసాదంగా అందిస్తారు. తొలినాళ్లలో ఆలయంలో వంటచేసే సౌకర్యం లేకపోవడం వల్ల కొన్ని కుటుంబాలు ఇంటిలో వండుకుని ఆలయానికి తీసుకు వచ్చేవారు. అలా వారు తీసుకువచ్చేది సుమారు వందమంది సందర్శకులకు సరిపోయేది. త్వర లోనే గ్రేటర్ మెంఫిస్ ప్రాంతంలో భారతీయ సంస్క•తి వ్యాప్తి బాగా వ్యాప్తి చెందడం వల్ల ఆలయానికి సందర్శకుల రద్దీ పెరిగిపోయింది. వచ్చినవారందరికీ ఇళ్ల వద్ద వండి తీసుకు రావడం కష్టమైపోయింది. దాంతో డాక్టర్ దేనాథ్, పిడికిటి, విజయ్ రవతాని నిధులు సమీకరించి వంటశాలను వాణిజ్యస్థాయికి తీసిపోనివిధంగా ఆధునీకరించారు. ప్రాజెక్టును తొందరగా పూర్తి చేశారు. ఒక యువ స్వచ్ఛంద సేవకుడు గౌతమ్ పిడికిటి భోజన శాలకు టేబుళ్లు, కుర్చీలు విరాళం ఇచ్చాడు.
ప్రస్తుతం ప్రతిశనివారం 300 నుంచి 600 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగు తోంది. ఇద్దరు యువ ధర్మకర్తలు అశోక్ ఉప్పు టూరి, చంద్రశేఖర్ పొట్నూరు ఈ కార్యక్రమా లను ఎంతో చాకచక్యంగా నిర్వ హిస్తున్నారు. వారి కుటుంబాలతో కలిసి వారు ఎంతో అమూల్య మైన సమయాన్ని వెచ్చించి వంటకాల జాబితా తయారు చేయడం దగ్గరనుంచి, వంటకాలు చేయించడం, శనివారాల్లోనూ ఇతర పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలలో వచ్చిన భక్తులందరికీ మహాప్రసాదం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఎంతో చురుకుగా.
దీన్నిబట్టి చూస్తుంటే అన్నప్రసాదం వితరణ కార్యక్రమం ముందు ముందు మరింత బాగా జరుగుతుందనే నమ్మకం కలుగుతోంది. భోజన శాలను ప్రస్తుతం 600 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా సిద్ధం చేశారు. దాతలు, వితరణశీలుర సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో మహాప్రసాదం ప్రతిశని వారం ప్రస్తుతానికి ఉచితంగానే అందుతోంది భక్తు లందరికీ.
బహ్సోత్సవాలు, నవరాత్రులు
ఆలయ కమిటీ ఏర్పడిన మొదటి సంవ త్సరం నుంచే అన్ని ప్రాంతాలనుంచి విచ్చేసిన భారతీయులందరూ కలిసి బ•ందాలుగా ఏర్పడి పండుగ స్ఫూర్తితో ఎంతో ఉత్సాహంగా విజయ దశమికి ముందు బ్రహ్సోత్సవాలు, నవరాత్రులు నిర్వహించడం అలవాటుగా మారింది. ఉత్సవ మూర్తులైన వేంకటేశ్వర స్వామి, దేవేరులు శ్రీదేవి, భూదేవులను వివిధ వాహనాలపై ఆలయ ఆవరణలో ఊరేగిస్తారు. అటు బ్రహ్సో త్సవాలు, ఇటు నవరాత్రి వేడుకలు రెండూ కలిపి జరపడం ఒక్క ఈ ఆలయానికే చెల్లింది. నవరాత్రులలో ప్రతి సాయంత్రం వేళ అమ్మవారిని వివిధ శక్తి రూపాలలో అలంకరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున ఆలయ పుష్కరిణిలో పవిత్రో త్సవాలు, మంగళస్నానాలు చేయిస్తారు.
అదేవిధంగా శివరాత్రికి 5 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం వేంకటేశ్వర స్వామివారికి, చంద్రమౌళీశ్వరుడికి సహస్రకల శాభిషేకం చేస్తారు. వేంకటేశ్వరుడికి పూలంగి సేవ, పుష్పయాగం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. శివుడికి అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ అన్ని సేవలూ, ఉత్సవాలూ కూడా కమ్యూనిటీ సభ్యులు ఎంతో భక్తిశ్రద్థలతో కుటుంబ వేడుకల్లా ఎంతో మక్కువతో జరుపుతారు.
అర్చకుల నివాసాలు:
ఎంతకాలంగానో నిరీక్షిస్తున్న అర్చకుల నివా సాలు పూర్తయ్యాయి. 2002, డిసెంబరులో ఇళ్లను వారికి ఇవ్వటం జరిగింది.
ఎంతోమంది మహానుభావులు మా ఆల యానికి విచ్చేసి తమ ఆశీర్వాదాలను అందిం చారు. తిరుపతి వ్యాసాశ్రమం నుంచి శ్రీ విద్యానందస్వామి, శ్రీ పరిపూర్ణానందస్వామి, నంబూరునుండి శ్రీ చంద్ర మాళిమాత (చండియాగం), హ్రైదరాబాదు, వనస్థలిపురం నుంచి శ్రీ సోమ నాథ మహర్షి మైసూరు నుంచి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి, ఆంధ్రపదేశ్ నుంచి శ్రీ కరుణామయి మాతా విజయేశ్వరీదేవి ఇక్కడకు విచ్చేసి తమ ఆశీస్సులను అందించారు. హ•షీకేష్లోని జగద్గురు సన్యాసాశ్రమం నుంచి మహామండలేశ్వర శ్రీ అభిషేక చైతన్య స్వామి, కర్ణాటకలో ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం నుంచి శ్రీ నిర్మలానంద స్వామీజీ, హవాయి నుంచి శైవ సిద్ధాంతానికి చెందిన గురుదేవ శ్రీ శివాయ్ సుబ్రమణ్యసామి ఈ ఆలయాన్ని ఎన్నో సార్లు పావనం చేసి తమ ఆశీస్సులను వర్షిం చారు.
శ్రీ వేలన్ బోధినాథ స్వామి 2015లో 120 మంది పురోహితులతో శతరుద్రీయ మహా యాగాన్ని నిర్వహించారు. ఈ మహానుభావు లందరూ తమ పాదస్పర్శతో మా ఆలయాన్ని పావనం చేశారు. వారి ఆశీస్సులతో మా ఆల యానికి మరింత పవిత్రతను, స్వచ్ఛతను, శక్తిని చేకూర్చారు.25 ఏళ్లుగా మా అర్చకులు ఆల యానికి అపూర్వమైన సేవలందిస్తున్నారు. పూజలు, అర్చనలు శ్రద్ధగా, సంప్రదాయాను సారం జరిపిస్తారన్న పేరు రావడంతో వీరికి ఎంతో డిమాండ్ ఏర్పడింది. నార్త్ అమెరికా, యూరప్‌లలో కుంభాభిషేకాలు, యజ్ఞాలు నిర్వ హించాల్సిందిగా ఆహ్వానించారు. మా ప్రధా నార్చకులు శ్రీ వెంకట సత్య నారాయణా చార్యులు భారత్, మారిషస్, ఇంగ్లండు, కెనడా, అమెరి కాల్లో 250కిపైగా వైష్ణవ ప్రతిష్టలను నిర్వ హించారు. మా ఆలయ శైవాగమ ప్రధానార్చ కులు 108 శైవ ప్రతిష్టలు నిర్వహించారు. ఆలయ అభివ•ద్ధికి వారు అందించిన సేవలు అమూల్యమైనవి. తిరుపతి వ్యాసాశ్రమవాసులు శ్రీ విద్యానంద గిరి, శ్రీ పరి పూర్ణానందల ఆశీస్సులతో, వారి మార్గదర్శ కత్వంలో 1997, ఆగస్టులో శ్రీ వెంకటేశ్వర అద్భుత శాంతి మహా యజ్ఞం నిర్వహించాం. నార్త్ అమె రికా నేలపై మొట్టమొదటి సారిగా నిర్వహించిన యజ్ఞమిది. అప్పటి నుంచీ ప్రతీ ఏడాదీ క్రమం తప్పకుండా యజ్ఞాల.
గణేశ నిమజ్జనం
గణేశ నిమజ్జనం, అంతకుముందు జరిపే గణేశ నవరాత్రులు కమ్యూనిటీ సభ్యులందరికీ ఎప్పటికప్పుడు కొత్త పాఠాలను నేర్పుతుంటాయి. వివిధ ప్రాంతీయ బ•ందాలన్నీ కలిసి ఒక గొప్ప సమ్మేళనంగా ఏర్పడి అందరూ కలిసి గణేశ నిమజ్జనంలో తలా ఒక చెయ్యి వేసి, న•త్యాలతో గీతాలతో శ్లోకా లతో భజనలతో స్వామివారిని సాగ నంపడం గొప్ప అనుభూతి.
హోలి
రంగుల పండుగ ఎప్పుడూ కులమత జాతి విభేదాలకు తావులేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించే పండుగ. ఈ పండుగ సంద ర్భంగా ఆలయానికి మిడ్ సౌత్ మొత్తం కదలి వచ్చిందా అన్నంత స్థాయిలో భక్తులు తరలి రావడం, ఆనందోత్సాహాల మధ్య అందరూ కలిసి ఒక పెద్ద కుటుంబంలా వేడుకలు జరుపు కోవడం గొప్ప సంత•ప్తి నిస్తుంది.
Review మెంఫిస్ హిందూ దేవాలయం.