రాజకీయాల్లోకి మహేశ్‍!

తెలుగు నాట సినిమాలకు రాజకీయాలకు అవినాభావసంబంధం ఉంది. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి.. ఆపై రాజకీయాల్లో మెరుపులా మెరిసిన వారు తెలుగు చిత్రసీమలో ఎందరో.. ఈ కోవలో మొదట నిలిచే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన సినిమాల్లో, రాజకీయాల్లో తెలుగునాట చెరగని ముద్ర వేశారు. ఆ తరువాత ఎందరో సినీ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. మెగాస్టార్‍ చిరంజీవి కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా మహేశ్‍బాబు పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. ఆశ్చర్యంగా ఉందా? నిజమే! కాకపోతే తెరపై! అవును! కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే తదుపరి చిత్రంలో మహేశ్‍ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని, సినిమా మొత్తం రాజకీయాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. అన్నట్టు.. మహేశ్‍బాబు గతంలో ‘దూకుడు’ చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో నటించాడు. ఇప్పుడు కొరటాల సినిమాలో ‘ముఖ్యమంత్రి’గా ప్రమోషన్‍ పొందారన్న మాట. గతంలో కొరటాల శివ- మహేష్‍బాబు కాంబినేషన్‍లో ‘శ్రీమంతుడు’ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాజా సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చకచకా జరుగుతోంది.

Review రాజకీయాల్లోకి మహేశ్‍!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top