రాశి ఫలాలు

మేష రాశి
చాంద్ర గోచారము: అశ్వని 4పా, భరణి 4పా, కృత్తిక 1వపా
నామ నక్షత్రములు: చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
ఆదా: 2, వ్యయం 14, రాజ: 5, అవ: 7
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు తులారాశిలో ఏడింట, ఆపై 29-03-2019 వరకు అష్టమంలో, తరువాత ధనస్సులో.
శని: సంవత్సరమంతా 9వ ఇంట ధనస్సులో సంచారం
రాహు కేతువులు: 7-3-2019 వరకు 4-10 లలో కర్కాటక మకరములలో సంచారం.
అక్కడి నుండి 3-9లలో మిధున, ధనస్సులలో సంచారం.
వేధ గోచారం: 11-10-2018 నుంచి, 29-3-2019 వరకు గురుడు శుభుడు. సంవత్సర మంతా శని, కేతువులు శుభులు. 3-1-2019 నుంచి రాహువు పాపి.
మంచికాలం:
గురువు: 11-10-2018 వరకు సప్తమంలో గురువు వుండటం వల్ల పనులలో విజయం. పూర్వం నిలిచిపోయిన పనులలో పురోగతి. సమాజంలో గౌరవం. ధనలాభం. ఉత్సాహం, ఆరోగ్యం, అధికారుల మెప్పు.
కేతువు: 7-3-2019 వరకు దశమంలో ఉన్న కేతువు వల్ల పనులలో విజయం. మంచి భోజనం, శరీర ఆరోగ్యంతో పెరుగుదల, సుఖం లభిస్తాయి.
దోషకాలం:
గురువు: 12-10-2018 నుంచి అష్టమంలో ఉండటం వల్ల కోపం, మాట తొందరపాటు, అలసట ఎక్కువ ఉంటుంది. శక్తికి మించి ప్రయత్నం చేస్తారు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవటం మంచిది. ప్రభుత్వం వల్ల, అధికారుల వల్ల ఇబ్బందులు.
శని: సంవత్సరమంతా నవమంలో ఉండటం వల్ల అధిక శ్రమ. స్వల్ప ధనం, కొద్దిపాటి సుఖం కుటుంబ సభ్యులకు అనారోగ్యం.
రాహువు: 7-3-2019 వరకు చతుర్థంలో ఉన్న రాహువు వల్ల మనస్సు పరిపరి విధాల ఆలోచన చేస్తూ ఉంటుంది. మనస్సు నిలకడగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి.
నక్షత్ర రీత్యా :
అశ్వని: 29-3-2019 వరకు గురువు శుభాన్నివ్వడు. శని సంవత్సరమంతా పాపి. రాహువు పూర్తి శుభుడు. 7-3-2019 నుంచి కేతువు శుభాన్నివ్వడు.
భరణి: 10-10-2018 నుంచి 29-3-2019 వరకు గురుడు శుభుడు. శని, రాహు కేతువులు సంవత్సరమంతా శుభులు.
కృత్తిక: 26-10-18 వరకు గురుడు శుభుడు. 30-08-2018 వరకు కేతువు శుభుడు. శని, రాహువులు సంవత్సరమంతా శుభులే.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: పూర్వం కంటే, ఈ సంవత్సరం ఆరోగ్యం మెరుగు పడుతుంది. పాత ఆరోగ్య సమస్యలు నెమ్మదిస్తాయి. అలా అని ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశముంది. తల్లిగారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. గుండె జబ్బులతో బాధపడే వారు జాగ్రత్త వహించాలి. అక్టోబరు 2018 నుంచి జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద సరైన శ్రద్ధతో ఉంటే ఆరోగ్య సమస్యలు బాధించవు.
ఆదాయం – ధనం: ఈ సంవత్సరం ఆదాయం బావుంటుంది. ఇంతకు ముందున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. మొదటి 6 నెలల్లో ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఈ సంవత్సరం మొదట్లో షేర్‍ మార్కెట్‍లో పెట్టిన డబ్బు నష్టం అవుతుంది. ఎక్కువ ఆదాయం కోసం పెద్ద ప్రణాళికలు వేయడం వల్ల ఉపయోగం లేదు. అప్పులు తీర్చగలుగుతారు. తేలికగా ఆదాయం సంపాదించాలన్న కోరిక మంచిది కాదు.
వృత్తి-ఉద్యోగాలు: వృత్తి, ఉద్యోగాలలో కొంత పని భారం తగ్గవచ్చు. వృత్తి పరంగా ఇంటికి దూరంగా ఉండవలసిన అవసరం వస్తుంది.
ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం సామాన్యంగా గడు స్తుంది. కానీ, గడిచిన సంవత్సరం కంటే అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో సంబంధం బావుం టుంది. మే మరియు డిసెంబరులలో ఉద్యోగ మార్పు లకు, ట్రాన్స్ఫర్‍లకు అనుకూలమైన కాలం. వ్యాపారస్థులకు, సొంత వృత్తిలో ఉన్న వారికీ గడిచిన కాలంలో ఆలస్యంగా జరుగుతున్న పనులు ఇప్పుడు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారంలో ప్రగతి కనిపిస్తుంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులపై ఇప్పుడు లాభాలు రావటం మొదలవుతాయి.
ప్రయాణాలు-యాత్రలు: ఫిబ్రవరి, మే, జూన్‍లలో ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, వ్యాపారులు సహచర్యులతో కలిసి యాత్రలు చేస్తారు. అక్టోబరు నెలలో విదేశీ ప్రయాణాలకు అవకాశముంది. ఆ తర్వాత సాధ్యమైనంత తక్కువ ప్రయాణాలు పెట్టుకోవాలి. దూరపు ప్రయాణాల పూర్తి జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకున్న ప్రయాణాలు కొన్ని ఆగుతాయి. అలాగని నిరుత్సాహ పడనవసం లేదు.
విద్యార్థులు-పరీక్షలు: విద్యార్థులకు సామాన్యంగా గడుస్తుంది. జూన్‍ నుంచి ఆగష్టు మధ్య కాలంలో ఎక్కువ కష్టపడి చదవ వలసి ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు మార్చి నెలలో ప్రయత్నించడం మంచిది. ఆగస్టు నుంచి పరిస్థితి మెరుగు పడుతూ వెళ్తుంది. డిసెంబరు నెల నుండి ఇష్టమైన చదువు కోసం సరిగా కష్టపడాలి. ఈ సమయంలో బద్దకం పెరిగి ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది జాగ్రత్త.
కుటుంబం-సమాజం: ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో అనుబంధం పూర్తి స్థాయిలో బావుంటుంది అని చెప్పలేం. ఏదో కారణం చేత ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది. కొన్ని అనుకోని ఇబ్బందుల వల్ల ఇంట్లోని వ్యక్తులతో అభిప్రాయ బేధాలు వస్తాయి. అక్టోబరు నెలలో కుటుంబ వివాదాలు తగ్గించు కోవటానికి కావాల్సిన సహాయం అందుతుంది. వారసత్వంగా వచ్చిన ఇళ్లు, స్థలాల వివాదాలు పరిష్కార దిశగా ముందుకు కదులుతాయి. వివాహం కాని వారు మొదటి ఆరు నెలలలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కూడా అనుకూలంగా వుంటుంది.
ధార్మిక విషయాలు: ఈ సంవత్సరం శని నవమిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక విషయాలు, వ్రతాలు, పండుగలు, ఉత్సవాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఒక్కోసారి దైవం పట్ల విసుగు జనించి, పూజలు ఆపేసే అవకాశం కూడా ఉంది. ఓపిక పెంచుకోవడం అవసరం.
పరిహారాలు: హనుమాన్‍ చాలీసా పారాయణం, శనేశ్వరారాధన, లలితా సహస్ర నామ పారాయణ పౌర్ణమి నాడు సత్య నారాయణ స్వామి వారి వ్రతం.

వృషభ రాశి

చాంద్ర గోచారము: కృత్తిక 2,3,4పా, రోహిణి 4పా, మృగశిర 1,2పా
నామ నక్షత్రములు: ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
ఆదా: 11, వ్యయం: 5, రాజ: 1, అవ: 3
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు ఆరవ ఇంట తులారాశిలో, నాటి నుండి 29-3-19 వరకు సప్తమం, వృశ్ఛిక రాశిలో ఆపై అష్టమంలో సంచారం.
శని: సంవత్సరమంతా 8వ ఇంట ధనస్సులో సంచారం
రాహు కేతువులు: 7-3-2019 వరకు 3-9 రాశులలో, ఆ తర్వాత మిధున, ధనస్సులలో 2-8 లలో.
వేధ గోచారం: 11-10-2018 వరకు గురువు, సంవత్సరమంతా శని, కేతువులు శుభులు. 3-1-2019 నుంచి రాహువు పాపి.
మంచికాలం:
గురువు: 12-10-2018 నుంచి గురువు సప్త మంలో సంచారం వల్ల పాత సమస్యలు పరిష్కార మవుతాయి. అధికారుల, పెద్దల ఆశీర్వాదం లభి స్తుంది. చేపట్టిన పనులలో విజయం. ఉత్సాహం, ఆరోగ్యం.
రాహువు: 7-3-2019 వరకు రాహువు తృతీయంలో ఉన్నందున ధనలాభం, కీర్తిలాభం. విందు, వినోదాలు, ఆరోగ్య లాభం. సోదరులతో వివాదాలకు తావు ఇవ్వకూడదు.
ప్రతికూల సమయం:
గురువు: 11-10-2018 వరకు గురువు ఆరింట ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బయట వారితో కూడా వివాదాలకు చోటివ్వద్దు.
శని: సంవత్సరమంతా అష్టమంలో ఉండటం వల్ల ఎక్కువగా చికాకులు, పనులలో ఆలస్యం అనవసరపు, ఆటంకాలు, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ. ఖర్చులపై నియంత్రణ అవసరం.
కేతువు: 7-3-2019 వరకు నవమంలో
ఉండటం వల్ల పనులలో పురోగతి తక్కువ. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.
నక్షత్ర రీత్యా :
కృత్తిక: 26-10-2018 వరకు గురుడు, శని, రాహువులు సంవత్సరమంతా శుభులు. 30-08- 2018 వరకు కేతువు శుభుడు.
రోహిణి: 18-06-2018 నుంచి 01-08-2018 వరకు గురుడు, సంవత్సరమంతా శని, కేతువులు శుభులు. రాహువు 7-03-2019 వరకు శుభుడు.
మృగశిర: సంవత్సరమంతా గురుడు, 7-08- 2019 వరకు రాహువు పాపులు. శని సంవత్సరమంతా శుభుడు. కేతువు 30-08-2018 నుండి పాపి.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా వ్యవహరించాలి. పూర్వం నుంచి ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఆరోగ్య పరీక్షలను సమయానికి చేయించుకోవాలి. ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశముంది. అందుచేత వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. నడుము కింద భాగానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చు, జాగ్రత్త.
ఆదాయం – ధనం: ఆదాయాన్ని పెంచుకోవటానికి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.్క డ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టరాదు. అప్పులు ఇవ్వరాదు. అనవసరపు ఖర్చులు ఎక్కువవుతాయి జాగ్రత్త. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలు ధన సంపాదన బావుంటుంది. సంవత్సరం మధ్యలో డబ్బుకు కటకట ఏర్పడి అప్పు తీసుకోవలసిన అవసరం రావచ్చు కానీ, తీసుకున్న అప్పు ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు తీర్చేస్తారు. అడ్డంకులు తొలగించుకుంటూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి.
వృత్తి-ఉద్యోగాలు: ఈ సంవత్సరం బాగా శ్రమించిన తర్వాత ఫలితం లభిస్తుంది. కొత్త వ్యాపారాల వైపు వెళ్లటం అనుకూలించదు. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మధ్యమంగా ఉంటుంది. ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్‍లు తప్పక పోవచ్చు. పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనిలో మార్పు, ఉద్యోగంలో మార్పు ఉండే అవకాశముంది. అలాగే, పనిలో నియమాలు ఉల్లంఘించటం, చట్టాలకు వ్యతిరేకంగా పని చేయటం మంచిది కాదు.
వృత్తి, వ్యాపారాలలో ఉండేవారికి కూడా అను కూలత ఎక్కువ ఉండదు. వ్యాపారం ఉత్సాహంగా సాగదు. బాధలు ఎక్కువవుతాయి. అలాగే ఇన్‍కంటాక్స్ రిటన్స్ విషయంలో అశ్రద్ధ కూడదు.
ప్రయాణాలు-యాత్రలు: ఈ సంవత్సరం ప్రయా ణాలు చేయాల్సిన అవసరం తక్కువగానే ఉంటుంది. ప్రయాణాలు అంత సుఖంగా సాగవు. ఉద్యోగంలో ఇబ్బందులు కారణంగా మార్పు కోరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలకు అనుబంధంగా ఇంటికి దూరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో ప్రయాస అధికం. లాభం శూన్యం. ఇష్టం లేని చోటకు ఉద్యోగులు తాత్కాలికంగా వెళ్లి పనిచేయవలసి వస్తుంది. జూన్‍ నెలలో కుటుంబం అంతా కలిసి ప్రయాణం చేస్తారు. జూన్‍, జూలైలో వ్యాపార విస్తరణ కోసం ప్రయాణాలుంటాయి.
విద్యార్థులు-పరీక్షలు: విద్యార్థులకు ఈ సంవత్సరం 2019 ఫిబ్రవరి మాసంలో విపరీత ఫలితాలు కలిగే అవకాశముంది. ఏకాగ్రత తగ్గుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఏప్రిల్‍ మే నెలలు అనుకూలంగా ఉంటాయి. నియమంగా చదవకపోతే పరీక్షలలో నెగ్గరు. అదృష్టం కలిసి వచ్చే కాలం కాదు.
కుటుంబం-సమాజం: కుటుంబంలోని వ్యక్తులతో దగ్గరితనం పెంచుకోవాల్సిన సమయం. సంవత్సరం మొదట్లో కుటుంబ సభ్యుల తీరు మనస్సుకు కష్టాన్ని కల్గిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఓపికతో సమస్యలను పరీక్షించుకుంటూ ముందుకు సాగుతారు. మార్చి, ఏప్రిల్‍ నెలలో పిల్లలు సాధించిన విజయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలున్నాయి.
ధార్మిక విషయాలు: ఈ సంవత్సరం దైవం, పూజ మొదలైన విషయాలపై అంత ఆసక్తి ఉండదు. మానసిక చికాకులు పూజలో ఏకాగ్రతను నిలువ నివ్వవు.
పరిహారాలు: హనుమాన్‍ పూజ, రోగులకు ఔష ధాలను అందివ్వటం, మృత్యుజయం జపం, శివ పూజ, నిత్యము పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, నమక పారాయణ, గణపతి దత్తాత్రేయుల ఉపాసన.

మిధున రాశి

చాంద్ర గోచారము: మృగశిర 3,4పా, ఆరుద్ర 4పా, పున్వసు 1-2-3పా
నామ నక్షత్రములు: కా,కి,కూ,ఖం,జ్ఞ,చ్ఛ,కే,కో,హ
ఆదా: 14, వ్యయం 2, రాజ: 4, అవ: 3
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు పంచమంలో 29-3-19 వరకు, వృశ్ఛికంలో ఆరింట, ఆ తర్వాత ధనస్సున సప్తమంలో.
శని: సంవత్సరమంతా ధనస్సున సప్తమంలో
రాహు కేతువులు: 7-3-2019 వరకు 2-8 రాశులలో, ఆ తర్వాత మిధున, ధనస్సులలో 1-7లలో
వేధ గోచారం: గురుడు సంవత్సరమంతా పాపి, రాహువు 26-4-2018 నుండి 3-1-2019 వరకు పాపి. శని, కేతువులు సంవత్సమంతా శుభులు.
మంచికాలం:
గురువు: 11-10-2018 వరకు పంచమంలో ఉన్న గురువు, కుటుంబంలో సుఖ సంతోషాలను ఇస్తాడు. అవసరానికి డబ్బు అందుతుంది. పనులలో విజయం తేలికగా సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి.
ప్రతికూల సమయం:
గురువు: 12-10-2018 నుంచి ఆరవ రాశిలో ఉండటం వల్ల ఇంటా, బయటా జాగ్రత్తగా ఉండాలి.
శని: సంవత్సరమంతా సప్తమంలో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. విదేశీ ప్రయాణాలుంటాయి.
రాహువు: 7-3-2019 వరకు రాహువు రెండింట ఉండటం వల్ల కుటుంబాలలోను, డబ్బు విషయంలోను చిన్న చిన్న కష్ట నష్టాలు తరచుగా ఎదురవుతాయి.
కేతువు: 7-3-2019 వరకు అష్టమ కేతువు ప్రభావం వలన అనుకోని విధంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు.
నక్షత్ర రీత్యా:
మృగశిర: గురువు సంవత్సరమంతా పాపి, శని సంవత్సరమంతా శుభుడు, రాహువు 7-3-2019 వరకు కేతువు 30-08-2018 నుంచి పాపులు.
ఆరుద్ర: గురుడు సంవత్సరమంతా పాపి, రాహు, కేతు, శనులు శుభులు.
పునర్వసు: రాహు, కేతువులు శుభులు 29-03- 2019 నుంచి గురుడు శుభుడు. 6-6-2018 నుంచి 26-11-2018 వరకు శని పాపి.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఆరోగ్య స్థితిలో మంచి చెడు రెండూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే. క్రోధావేశాలు అదుపులో ఉంచుకోవాలి. అశ్రద్ధ చేయకుండా సరైన డాక్టరుని కలిసి మందులు వాడాలి. ఈ సంవత్సరం శారీరకంగా మానసికంగా ఉత్సాహం పెరుగుతుంది. మార్చి నెలలో జల సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఏప్రిల్‍ నెలలో మాట తీరు సరిగా ఉంచుకోవాలి.
ఆదాయం – ధనం: ఆదాయం ఈ సంవత్సరం మధ్యమంగా ఉంటుంది. మరింత సంపాదన కోసం కొత్త మార్గాలను వెతుక్కోవలసి రావచ్చు. పాత పెట్టుబడులపై సరైన లాభం వస్తుందని గట్టిగా చెప్పలేం. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. సంవత్సరం చివరి ఆరు నెలలు శత్రువులతో జాగ్రత్తగా వుండాలి. అప్పులు ఇవ్వకూడదు. షేర్‍ మార్కెట్‍లో పెట్టుబడుల విషయంలో కూడా ఆచి తూచి అడుగు వేయాలి. ప్రణాళికా బద్దంగా కష్టించి పని చేస్తే కానీ కోరిన ఫలితం లభించదు. అక్టోబరులో కొంత ధనలాభం కనిపిస్తోంది.
వృత్తి – ఉద్యోగాలు: మాట మంచిదైతే మనకు అన్నీ లాభాలే. ఉద్యోగస్థులకు అక్టోబరు మాసం లాభాన్నిస్తుంది. వ్యాపారస్థులు ఆధునిక పద్దతులను వాడితే లాభం పొందగలుగుతారు. అధికారులతో సహోద్యోగులతో లేదా వినియోగదారులతో వాద వివాదాలకు పోకండి. ఉద్యోగస్థులకు ప్రమోషన్‍ వచ్చే అవకాశాలున్నాయి. సహోద్యోగులు పై అధికారులు సహకరిస్తారు.
వ్యాపారస్థులకు లాభాలు మధ్యమంగా వుంటాయి. పాత సంవత్సరం కంటే వ్యాపారం పెరిగినప్పటికీ అనుకోని సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఎక్కువ సరుకును అప్పుపై అమ్మరాదు.
ప్రయాణాలు-యాత్రలు: విదేశీ పర్యాటనకు ఈ సంవత్సరం అవకాశముంది. చదువుకోసం వ్యాపార పనులు నిమిత్తం లేదా విహార యాత్ర రూపంలో దూర ప్రయాణాలు సంభవిస్తాయి. చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రధమార్ధంలో స్థల మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మే, జూన్‍లలో వ్యాపార యాత్రలు చేస్తారు. ఈ సంవత్సరం యాత్రలు ప్రయాణాలు ఆనందాన్ని, లాభాన్ని అందిస్తాయి.
విద్యార్థులు-పరీక్షలు: ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలం. కోరుకున్న విద్యాలయంలో ప్రవేశం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసే వారికి మంచి ఫలితం వస్తుంది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు బాగా అనుకూల సమయం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి.
కుటుంబం-సమాజం: అవివాహితులకు పెళ్లిళ్లు జరుగుతాయి. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. సంతానం విషయంలో ఆలోచన పెరుగుతంది. లేదా వారి వల్ల కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవలసి రావచ్చు. పెద్ద సభల్లో ఉపన్యసించే అవకాశం దొరుకుతుంది.
ధార్మిక విషయాలు: ఈ సంవత్సరం కోరుకున్న విషయాలు సకాలంలో జరగక పోవడం వల్ల దృష్టి భగవంతుడి మీదకి మళ్లుతుంది. దైవానుగ్రహం కోసం ప్రయత్నాలు చేస్తారు. మొదటి ఆరు నెలల్లో ధర్మ కార్యాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా
ఉంటుంది.
పరిహారాలు: సుబ్రహ్మణ్య పూజ, శివరాధన, దుర్గా దర్శనం, పెద్దలు, గురువుల ఆశీర్వాదం పొందటం చేయాలి.

కర్కాటక రాశి

చాంద్ర గోచారము: పునర్వసు 4పా, పుష్యమి 4పా, ఆశ్లేష 4పా
నామ నక్షత్రములు: హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
ఆదా: 8, వ్యయం 2, రాజ: 7, అవ: 3
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు తులలో నాల్గవ రాశిలో, నాటి నుంచి 29-3-2019 వరకు పంచమం వృశ్ఛికంలో, ఆ తర్వాత ఆరింట ధనస్సులో.
శని: సంవత్సరమంతా ఆరింట ధనస్సులో
రాహు కేతువులు: 7-3-2019 వరకు జన్మరాశి, సప్తమ రాశుల్లో, ఆ తర్వాత 12వ రాశి అయిన మిధునం, 6వ రాశి అయిన ధనస్సులలో
వేధ గోచారం: ఈ సంవత్సరమంతా గురుడు పాపి. శని, కేతువులు శుభులు. రాహువు 26-4-2018 వరకు పాపి.
మంచికాలం:
గురువు: 12-10-2018 నుంచి గురువు పంచమంలో వుండటం వల్ల కుటుంబ విషయాలు చక్కగా ఉంటాయి. శుభవార్తలు ఆనందాన్నిస్తాయి. అవసరానికి డబ్బు సమకూరుతుంది. మొదలు పెట్టిన పనులు కొద్దిపాటి కష్టంతోనే పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
శని: సంవత్సరమంతా శని శత్రు స్థానంలో
ఉండటం వల్ల పనులలో విజయం. బంధుమిత్రుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకోవటం భవిష్యత్తు గురించిన చక్కని ప్రణాళికలు వేయడం జరుగుతుంది. ధన ధాన్యాలు నిండుగా లభిస్తాయి. సొంత ఇం•
కల నెరవేరుతుంది. ఆస్థులు పెరుగుతాయి.
దోషకాలం:
గురువు: 11-10-2018 వరకు నాల్గింట వుండటం వల్ల దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా
ఉండాలి. తొందరగా అలసిపోతారు.
రాహువు: 7-3-2019 వరకు జన్మరాశిలో ఉండటం వల్ల విదేశీ లేదా దూర ప్రయాణాలు చేస్తారు. ఓర్పు పెంచుకోవాలి. అనవసరపు మాటలు కూడదు.
కేతువు: 7-3-2019 వరకు సప్తమ కేతువు ప్రభావం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలుంటాయి.
నక్షత్ర రీత్యా:
పునర్వసు: 29-3-2019 నుండి గురుడు శుభుడు. 6-6-2018 నుంచి 26-09-2018 వరకు శని పాపి. రాహు కేతువులు శుభులు.
పుష్యమి: 27-12-2018 నుండి 29-3-2019 వరకు గురుడు శుభుడు. రాహువు 7-3-2019 నుంచి పాపి. శని కేతువులు శుభులు
ఆశ్లేష: 27-10-2018 నుండి 26-12-2018 వరకు గురుడు శుభుడు. శని, కేతువులు శుభులు. 7-3-2019 నుంచి రాహువు పాపి.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఒకరికి ఇద్దరు డాక్టర్లను సంప్రదించటం మంచిది. దీర్ఘకాలం బాధించే అనారోగ్యం ఇప్పుడు మొదలు కావచ్చు. లేదా ఎప్పటినుంచో ఉన్న అనారోగ్యం తీవ్రత చూపించవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాత సంబంధమైన రోగాలు, రోగ నిర్ణయం తప్పుగా జరిగి కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశముంది. ఆగష్టు, సెప్టెంబర్‍ నెలలలో ఆరోగ్య పరిస్థితి కొంత అదుపు తప్పవచ్చు.
ఆదాయం – ధనం: ఆదాయం ఈ సంవత్సరం బావుంటుంది. అప్పులు తీరుస్తారు. మే, జూన్‍లలో ఖర్చులు అదుపులో వుంచుకోవాలి. పెద్ద ఎత్తున అప్పులు చేయకూడదు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వ్యాపారానికి అనుకూలంగా కనిపిస్తోంది. పాత పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారులకు, ఉద్యోగులకు ఇద్దరికీ మంచి చెడులు మిశ్రమంగా ఉంటాయి. 2018 మార్చి, ఏప్రిల్‍ నెలలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించక పోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. చివరి ఆరు నెలలో వృత్తి,
ఉద్యోగాలు, వ్యాపారాలలో మంచి మార్పు అభివృద్ధి కనిపిస్తాయి. నిరాశను విడిచి ధైర్యంగా ముందుకు వెళ్లాలి.
వృత్తి – ఉద్యోగాలు: ఉద్యోగులకు ఈ సంవత్సరం ప్రమోషన్లకు, ట్రాన్స్ఫర్‍లకు అవకాశం కనిపిస్తోంది. అధికారులు, సహచరుల నుండి సహాయం లభిస్తుంది. సంపాదన పెంచుకోవటం కోసం అదృష్టం మీద ఆధారపడే పెట్టుబడుల వైపు మనస్సు పోతుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్థులకు లాభాలు వచ్చినప్పటికీ సరుకు కొనే చోట, వివాదాలు వస్తాయి. వ్యాపార పత్రాలు ఒకటికి రెండు సార్లు చూసుకొని సంతకాలు పెట్టడం మంచిది.
ప్రయాణాలు-యాత్రలు: ఏప్రిల్‍ 2018లో చిన్నవో పెద్దవో ప్రయాణాలు తప్పకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార పనుల నిమిత్తం ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువై ఉద్యోగ మార్పు కోరుకుంటారు. వ్యాపార పనుల నిమిత్తం చేసే ప్రయాణాలు అక్టోబరు నుండి డిసెంబరు మధ్యలో ఎక్కువ కలిసి వస్తాయి. మొత్తం మీద ప్రయాణాలు ఎక్కువే అని చెప్పవచ్చు.
విద్యార్థులు-పరీక్షలు: ఈ సంవత్సరం విద్యార్థులకు మంచికాలం. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారు తాము కోరుకున్న విద్యాలయంలో చేరే అవకాశాలున్నాయి. చదువు కోసం విదేశాలు వెళ్లాలనుకునేవారు జూలై నెలలో ప్రయత్నాలు చేయటం మంచిది పరిశోధనా రంగంలో ఉన్నవారికి కొన్ని కష్టాలు తప్పవు. కష్టపడి గట్టి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం రెండవ భాగంలో మంచి ఫలితాలు పొంద గలుగుతారు.
కుటుంబం-సమాజం: ఈ సంవత్సరం కుటుం బంలోకి కొత్త వ్యక్తుల ఆగమనం ఉంటుంది. అవివాహితులకు వివాహం దంపతులకు తొలి సంతానం కలిగే అవకాశముంది. జూన్‍ నుండి ఆగస్టు నెల వరకు సమయం అనుకూలం వుంది. ఈ సమ యంలో కుటుంబాన్ని గురించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి.
ధార్మిక విషయాలు: జన్మరాశిలో ఎక్కువ సమయం రాహువు, సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాల పట్ల అంత ఆసక్తి ఉండదు. మరో రకంగా చూస్తే అమ్మవారి ఉపాసన చేసేవారికి అనుకూల సమయం. అక్టోబరు నెల నుంచి తీర్ధయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా జరుగుతాయి. నవంబరులో కూడా అవి కొనసాగు తాయి.
పరిహారాలు: నవగ్రహ శాంతి హోమం, గణపతి, దుర్గ ఉపాసన, శివాలయ సందర్శనం, సుందరకాండ పారాయణ, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం చేయాలి.

సింహ రాశి

చాంద్ర గోచారము: మఖ 4పా, పూర్వ ఫల్గుణి 4పా, ఉత్తర ఫల్గుణి 1పా
నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
ఆదా: 11, వ్యయం: 11, రాజ: 3, అవ: 6
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు తృతీయ తులలో, తర్వాత 29-03-2019 వరకు వృశ్ఛికంలో చతుర్ధం, ఆపైన పంచమంలో
శని: సంవత్సరమంతా పంచమం ధనస్సులో
రాహు కేతువులు: కర్కాటక, మకరములందు 12, 6 రాశులలో 7-3-2019 వరకు ఆ తర్వాత 11, 5 రాశులలో మిధున ధనస్సులలో
వేధ గోచారం: గురుడు ఈ సంవత్సరమంతా పాపి. శని శుభుడు. 7-3-2019 వరకు రాహు కేతువులు పాపులు.
మంచికాలం:
కేతువు: 7-3-2019 వరకు ఆరింట వుండటం వల్ల శత్రువులపై విజయం, శుభం, భూలాభం.
దోషకాలం:
గురువు: 11-10-2018 వరకు మూడింట
ఉన్న గురువు మాట తూలటాన్ని సూచిస్తాడు. మాట్లాడటంలో తొందరపాటు కూడదు. వృత్తి, వ్యాపారాలలో ఓర్పు అవసరం. డబ్బు పరంగా స్తబ్దుగా ఉంటుంది. 12-10-2018 నుంచి చతుర్థంలో
ఉండటం చేత దూర ప్రయాణాలు మాత్రమే యోగిస్తాయి.
శని: పంచమంలో ఉండటం చేత అధిక శ్రమ, అనుకోని కష్టాలు, పనులలో ఆలస్యం తప్పవు.
రాహువు: 7-3-2019 వరకు వ్యయం. రాహువు వల్ల పనులలో ఆలస్యం, కంటి సమస్యలు, విదేశీ ప్రయాణాలు ఉంటాయి.
నక్షత్ర రీత్యా:
మఖ: శని సంవత్సరమంతా శుభుడు. గురుడు పాపి. 18-03-2018 నుండి 26-04-2018 వరకు రాహువు పాపి. 7-3-2019 నుండి కేతువు శుభుడు.
పూర్వ ఫల్గుణి: 29-03-2019 నుంచి గురుడు శుభుడు. సంవత్సరమంతా శని పాపి. 26-04-2018 నుంచి 3-1-2019 వరకు రాహువు పాపి. 7-3-2019 నుండి కేతువు పాపి.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఈ సంవత్సరం ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. పాత సంవత్సరంతో పోలిస్తే బావుంటుంది. పాత సమస్యలు తీరి ఆరోగ్యం కుదుట పడుతుంది. కానీ అకస్మాత్తుగా అనారోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పటి దాకా బయట పడని అనారోగ్యం పైకి కనిపించటం మొదలవుతుంది. జూలై, ఆగస్టులలో వచ్చే ఋతు మార్పుల పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే, గుండెకు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాలలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ.
ఆదాయం – ధనం: ఈ సంవత్సరం ఆదాయం ఫరవాలేదు. బెట్లు, పందాలు కలిసి రావు. పూర్వం పెట్టిన పెట్టుబడులపై లాభాలు చేతికి అందేదాకా మనవి అనుకోవటం కష్టం. ఆకస్మిక ఖర్చులుంటాయి. పాత అప్పులు తేలిగ్గా తీర్చగలుగుతారు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు మరింత పెరుగుతాయి. షేర్‍ మార్కెట్‍లలో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.
వృత్తి – ఉద్యోగాలు: ఈ సంవత్సరం ఎక్కువ ప్రయాణాలుంటాయి. చాలా ప్రయాణాల వల్ల లాభం కంటే ప్రయాస ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబరులలో ఆదాయం పెంచుకోవటం కోసం దూర/విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ప్రమోషన్‍ వచ్చే అవకాశముంటుంది.
వ్యాపారస్థులకు పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ తోడుగా సమస్యలు కూడా పెరుగుతాయి. ఆకస్మిక ఖర్చుల వల్ల ఇబ్బంది పడ్తారు. పెద్ద మొత్తాలు అప్పు ఇవ్వకూడదు.
ప్రయాణాలు-యాత్రలు: విదేశీ లేదా దూర ప్రయాణాలు, వృత్తి, ఉద్యోగాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ద్వాదశ రాహువు వల్ల ఎక్కువసార్లు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అక్టోబరు మాసంలో కుటుంబంతో కలిసి విహార యాత్ర చేసే అవకాశముంది. ఆ తర్వాత కూడా ఎన్నో యాత్రలు చేస్తారు.
విద్యార్థులు-పరీక్షలు: కోరుకున్న కళాశాలలో ఇష్టమైన చదువు మొదలు పెడ్తారు. సైన్స్ విద్యార్థులకు మరింత అనుకూలం సరైన శ్రమ పడితే పోటీ పరీక్షల్లో విజయం తథ్యం కొన్నిసార్లు ఏకాగ్రత తగ్గుతుంది. దానికోసం గట్టి ప్రయత్నం చేయాలి. విదేశాలలో
ఉన్నత విద్య చదవాలనుకునే వారికి అక్టోబరు నుంచి అనుకూలం
కుటుంబం-సమాజం: కుటుంబ పరంగాను, సామాజిక పరంగాను ఈ సంవత్సరం బావుంటుంది. కొత్త కోడలు/అల్లుడు రావడం వల్ల లేదా తొలి సంతానం కలగటం వల్ల కుటుంబంలో ఆనందోత్సవాలు పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంవత్సరం మొదట్లో కుటుంబ పరంగా ఉన్న చికాకులు మధ్యకు వచ్చేసరికి నిదానంగా తగ్గుతూ వస్తాయి.
ధార్మిక విషయాలు: ధార్మిక విషయాలలో బాగా ఎక్కువగా పాలు పంచుకుంటారు. కొన్ని కొన్ని సార్లు దైవ చింతనకు దూరమైనా, సంశయాలు ముసురు••న్నా, వ్రతాలు, పూజలు లాంటివి చేయటం మానరు.
పరిహారాలు: హనుమంతుని పూజ, శివ దర్శనం, సంకట గణేశ చతుర్ధి పూజ, నిత్యం గణేశ పంచరత్న స్తోత్ర పారాయణ.

కన్యా రాశి

చాంద్ర గోచారము: ఉత్తర ఫల్గుణి 2,3,4పా, హస్త – 4 పాదాలు, చిత్త 1,2పా
నామ నక్షత్రములు: టో, పా, పి, పూ, షం, ణా, ఠ. పే, పో
ఆదా: 14, వ్యయం: 2, రాజ: 6, అవ: 6
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు రెండింట, ఆపై 29-3-2019 వరకు 3లో తర్వాత ధనస్సున నాల్గులో
శని: సంవత్సరమంతా అర్ధాష్టమంలో ధనస్సులో
రాహు కేతువులు: 7-3-2019 వరకు లాభ స్థానం, పంచమంలో, ఆ తర్వాత దశమమైన కన్యా చతుర్థమైన ధనస్సులో
వేధ గోచారం: 18-6-2018 నుండి 2-8- 2018 వరకు ఆ తర్వాత 29-3-2019 నుంచి గురుడు శుభుడు. రాహు కేతువులు సంవత్సరమంతా శుభులు. శని పాపి.
మంచి కాలం:
గురువు: 11-10-2018 వరకు రెండింట
ఉండటం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగు తాయి. మంచి పనులు చేయటం వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. మీ ప్రతిభా పాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. ఉత్సాహంగా ఉంటుంది.
రాహువు: 7-3-2019 వరకు 11లో రాహువు ఉండటం చేత భోజనం సౌఖ్యం పశు సంపద, వస్త్రాలు, వస్తువులు లభిస్తాయి. లాభం, విజయం తథ్యం.
ప్రతికూలం:
గురువు: 12-10-2018 నుంచి, గురువు మూడింట ఉంటాడు. ఆచి తూచి మాట్లాడాలి. బంధులలో వ్యవహారం జాగ్రత్త. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమ తర్వాతే ఫలితం డబ్బు సమస్యలు వస్తాయి జాగ్రత్త.
శని: అర్ధాష్టమంలో ఉన్నందువల్ల వాత సంబంధమైన అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తగా
ఉండాలి. చేస్తున్న పనులలో అనుకోని ఆటంకాలు ఎదురై ఆలస్యంగా పూర్తవుతాయి. పూర్తి స్థాయిలో విచారణ చేసి గానీ నిర్ణయాలు తీసుకోకూడదు. స్థలం మార్పు కనిపిస్తోంది.
కేతువు: 7-3-2019 వరకు కేతువు. పంచమంలో ఉండటం చేత భోజనం ఆలస్యం ఉంటుంది. సంతానంలో విభేదాలు తలెత్తే ప్రమాదముంది.
నక్షత్ర రీత్యా:
ఉత్తర ఫల్గుణి: 10-10-2018 నుంచి 29-3-2019 వరకు గురుడు శుభుడు. 30-8-2018 నుంచి కేతువు పాపి. శని, రాహువులు సంవత్సరమంతా శుభులు.
హస్త: సంవత్సరమంతా గురుడు పాపి. 6-6-2018 నుండి 26-11-2018 వరకు శని పాపి. రాహు, కేతువులు శుభులు.
చిత్త: 29-3-2019 నుంచి గురుడు, సంవత్సర మంతా శని, కేతువులు శుభులు. 18-3-2018 నుంచి 7-3-2019 వరకు రాహువు పాపి.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఈ సంవత్సరం ఆరోగ్యం బాగానే ఉంటుంది. అలా అని అద్భుతమని చెప్పలేం. గుండె, ఊపిరి తిత్తులకు సంబంధించిన ఇబ్బందులుంటాయి. మసాలాల వినియోగం బాగా తగ్గించాలి. సమయానికి భోజనం చేయాలి. డాక్టరు సలహాలు పాటించాలి. నవంబరు, డిసెంబరులలో కోప తాపాలు ఎక్కువవు తాయి. జాగ్రత్త. డిసెంబరు నుంచి ఆరోగ్య పరిరక్షణ కోసం నడుం బిగిస్తారు. వాహనాలు నడపటంలో ప్రమాదాల నుండి దూరంగా ఉండండి.
ఆదాయం – ధనం: ఆదాయ విషయంలో ఈ సంవత్సరం సాధారణంగా సాగిపోతుంది. ఆదాయంలో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తాయి. షేర్‍ మార్కెట్‍ వైపు ఆకర్షితులవుతారు. కొంత వరకు లాభం కనిపించి నప్పటికీ అతిగా ఆశించకూడదు. ఆగస్టు నుంచి ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బులు చేతి కందుతాయి. డబ్బు సంపాదనకు అనువైన కాలం. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు జాగ్రత్తగా ఉండ వలసిన కాలం.
వృత్తి – ఉద్యోగాలు: ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగాలలో కష్టం, సుఖం కలిసే ఉంటాయి. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునేవారికి అనూకూలం. మొదటి ఆరు నెలల కంటే చివరి ఆరు నెలలు పరిస్థితి బాగుం టుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు కలిసొస్తుంది.
ఉద్యోగులకు ఉన్నతాధికారులతో విభేదాలున్నప్పటికీ రావాల్సిన ప్రమోషన్లు తప్పక వస్తాయి. అనుకోని ధన లాభాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు పనులు ఆలస్యం అవటం, చురుకు తగ్గటం కనిపిస్తుంది. ఆదాయంలో హెచ్చు- తగ్గులుంటాయి. పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం కాని, తీసుకోవటం కాని చేయరాదు. పన్నులు ఎగ్గొట్టే ఆలోచనలు మంచివికావు.
ప్రయాణాలు-యాత్రలు: ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేయాలన్న కోరిక బలంగా ఉంటుంది. జూలై, ఆగస్టు మాసాలలో విదేశీ యాత్రకు అవకాశముంటుంది. సెప్టెంబరులో తీర్థయాత్ర శ్రద్ధగా సాగుతుంది. నవంబరు, డిసెంబరులలో విదేశీ యాత్ర ప్రయత్నాలు కలిసి వస్తాయి.
విద్యార్థులు-పరీక్షలు: ఈ సంవత్సరం చదువు ఓ మాదిరిగా సాగుతుంది. చదువు కంటే ఇతర విషయాలు మీద మనస్సు ఎక్కువ మళ్లుతుంది. మనస్సును అదుపులో పెట్టుకోక పోతే మార్కులు కష్టం. సంవత్సరం మధ్యలో తేలిగ్గానే పరీక్షలు గట్టెక్కగలుగు తారు. నవంబరు, డిసెంబరు, జనవరిలో చదువు మీద గట్టి దృష్టి పెట్టాలి. లేకుంటే పరాభవం తప్పదు.
కుటుంబం-సమాజం: ఈ సంవత్సరం కుటుంబ పరంగాను, సామాజిక పరంగాను మంచి కాలం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అవివాహితులకు వివాహం, వివాహితులకు తొలి సంతానం కలిగే అవకాశముంది. శ్రావణ మాసంలో ఇంట్లో పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. మిత్రులు, సహచరులు, ఇరుగు పొరుగు వారితో కలిసి ఉత్సాహంగా కాలం గడుపుతారు.
ధార్మిక విషయాలు: ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. కానీ, తీర్ధ యాత్రలు, దైవ దర్శనానికి వెళ్లేటప్పుడు ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్లటానికి మంచి సమయం. కానీ, ధార్మిక విషయాలలో పాలు పంచుకోవటం కష్టం అవుతుంది. ఆగస్టు, సెప్టెంబరు నెలలు దైవ దర్శనానికి అనుకూలం.
పరిహారాలు: గణపతి, దుర్గా దేవతల ఉపాసన మంచిది. రోజూ తులసి మొక్కకు నీళ్లు పోయాలి. పేదలకు అన్నదానం చేయాలి. అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేయాలి.

తులా రాశి

చాంద్ర గోచారము: చిత్త 3,4పా, స్వాతి – 4 పాదాలు, విశాఖ 1,2,3పా
నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే
ఆదా: 11, వ్యయం 5, రాజ: 2, అవ: 2
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు జన్మరాశిలో ఆపై 29-3-2019 వరకు రెండింట వృశ్ఛికంలో, ఆ తర్వాత ధనస్సులో మూడింట.
శని: సంవత్సరమంతా మూడింట ధనస్సులో శని
రాహు కేతువులు: 7-3-2019 వరకు దశమం, చతుర్దాలలో, ఆ తర్వాత 9-3 రాశులలో
వేధ గోచారం: శని రాహువులు, సంవత్సరమంతా శుభులు. గురుడు పాపి. కేతువు 30-8-2018 నుంచి పాపి.
మంచికాలం:
గురువు: 12-10-2018 నుండి రెండింట గురువు వల్ల కుటుంబంలో శుభకార్యాలు. మంచి పనుల వల్ల కీర్తి లభించటం. ప్రతిభకు తగిన గుర్తింపు. పెద్దలు, ముఖ్యులతో సమావేశం. ఉల్లాసం, ఉత్సాహం.
శని: మూడింట సంవత్సరమంతా ఉండటం వల్ల పట్టుదలతో విజయం సాధిస్తారు. బుద్ధి చక్కగా పని చేస్తుంది. మంచి ఆరోగ్యం, ఆనందం.
రాహువు: 7-3-2019 వరకు దశమంలో ఉన్న రాహువు వల్ల మొదలుపెట్టిన పనులలో విజయం. మంచి భోజనం. శారీరక బలం పెరుగుదల. వస్తు, వాహన, వస్త్ర ప్రాప్తి.
ప్రతికూలం:
గురువు: 11-10-2018 వరకు జన్మరాశిలో ఉండటం వల్ల వృత్తి-ఉద్యోగాలలో శ్రద్ధ పెట్టాలి. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. మాట తూల కూడదు. అధిక ఖర్చులు.
కేతువు: 7-3-2019 వరకు నాల్గవ రాశిలో ఉండటం వల్ల పనులలో ఆటంకాలు. సంతానంతో విభేదాలు. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు రాకుండా జాగ్రత్త పడాలి.
నక్షత్ర రీత్యా:
చిత్త: శని, కేతువులు సంవత్సరమంతా శుభులు. 18-3-2018 నుండి 7-3-2019 వరకు రాహువు పాపి. 29-3-2019 నుండి గురుడు శుభుడు.
స్వాతి: సంవత్సరమంతా గురుడు పాపి. 7-3-2019 నుండి రాహువు పాపి. శని, కేతువులు సంవత్సరమంతా శుభులు.
విశాఖ: సంవత్సరమంతా శని, రాహు, కేతువులు శుభులు. 27-10-2018 నుంచి 26-12-2018 నుండి గురుడు శుభుడు.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఈ సంవత్సరం ఆరోగ్యం బాగానే
ఉంటుంది. పాత ఇబ్బందులు తొలగుతాయి. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యం గురించి బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సెప్టెంబరు మాసంలో తల్లి ఆరోగ్యం, తన ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. డిసెంబరు కూడా కొన్ని ఇబ్బందులుంటాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆదాయం – ధనం: ఆదాయ పెరుగుతుంది. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. పాత పెట్టుబడులపై మంచి లాభాలు అందుతాయి. భూమి, భవనాలు, వాహనాల అమ్మకాలు చేస్తారు. సంవ త్సరం మొదట్లో మామూలు ప్రయత్నంతోనే మంచి ఫలితాలు లాభిస్తాయి. యంత్రాలు, ఎలక్ట్రానిక్‍ వస్తు వులు వ్యవసాయం, వాహనాదులు మొదలైన విషయాలపై ఖర్చు ఎక్కువై ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
వృత్తి – ఉద్యోగాలు: ఉద్యోగంలో మార్పులు లేదా ట్రాన్స్ఫర్‍లకు అవకాశముంది. కొత్త అవకాశాలు వస్తాయి. జూన్‍ నెలలో అనవసరపు వాద వివాదాలు జరిగే అవకాశముంది. అందుచేత నోటిని అదుపులో ఉంచుకోవాలి. క్రోధా వేశాలకు లోనై అవకాశాలు జార విడుచుకోవద్దు. సంవత్సరం మధ్యలో ప్రమోషన్లు, జీతంలో పెరుగుదల లేదా బోనస్‍లు లభించే అవకాశముంది పూర్వం డిపార్ట్మెంట్‍ పరంగా కోర్టులో విచారణ ఏమైనా జరుగుతూ ఉంటే అది కొట్టి వేయబడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. రావనుకున్న బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు చేతికంది వ్యాపార విస్తరణ చేపట్టే అవకాశముంది.
విద్యార్థులు-పరీక్షలు: విద్యార్థులు మంచి ఫలితాన్ని అందుకుంటారు. గురువుల అనుగ్రహం, సహాయం వల్ల అన్ని రకాల పరీక్షలలో మంచి ప్రతిభ కనబరుస్తారు. పోటీ పరీక్షలలో కూడా నెగ్గేందుకు అనువైన కాలం చదువు పూర్తయిన వారికి కష్టపడితే ఉద్యోగం లభించే అవకాశముంది. కానీ, అధిక శ్రమ తప్పదు. చివరి ఆరు నెలలో పోటీ పరీక్షల విష యంలో నిర్లక్ష ్యంగా వ్యవహరించకూడదు.
ప్రయాణాలు-యాత్రలు: ఆగస్టు, నవంబరు మాసాలలో పెద్ద ప్రయాణాలు పెట్టుకుంటారు. ఆ యాత్రల వల్ల మంచి లాభం కలుగుతుంది. ప్రయాణాల వల్ల, దూర దేశాలకు వెళ్లటం వల్ల, స్థలం మార్పు వల్ల బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చేసే యాత్రలు కష్టంతో కూడుకొని ఉంటాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. వారితో స్నేహం ఏర్పడి నిలబడుతుంది.
కుటుంబం-సమాజం: ఎప్పటి నుంచో కుటుం బంలో చేయాలనుకున్న మార్పులు, (నివాసం) మరమ్మత్తులు, ఈ సంవత్సరం చేస్తారు. భూమి, భవనాల విషయంలో సమయం అంత అనుకూలం కాదు. అవివాహితులకు సంతానం కోసం ఎదురు చూసే వారికి మంచి సమయం. సంవత్సరం చివరి ఆరు నెలల్లో కుటుంబం లోని వ్యక్తులతో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. సర్దుబాట్లు తప్పవు. కుటుంబంలోకి కొత్త వ్యక్తుల ఆగమనం సంతోషాన్నిస్తుంది.
ధార్మిక విషయాలు: ఈ సంవత్సరం మనశ్శాంతి కోసం, నిరాశను దూరం చేసుకోవటం కోసం ధర్మ కార్యాల పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. కుటుంబ సభ్యులు అందరితో కలిసి దైవారాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అవకాశం ఉన్నంతవరకు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పరిహారాలు: శివ కుటుంబాన్ని ఆరాధించాలి. ప్రతి రోజూ తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందాలి. సూర్యోదయ కాలంలో సూర్యుని ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. లలితా సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

వృశ్ఛిక రాశి

చాంద్ర గోచారము: విశాఖ 4పా, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు
నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు
ఆదా: 2, వ్యయం: 14, రాజ: 5, అవ: 2
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు వ్యయంలో, నాటి నుండి 29-3-2019 వరకు జన్మరాశిలో, ఆపైన రెండింట ధనస్సులో సంచారం.
శని: సంవత్సరమంతా ధనురాశిలో రెండవ ఇంట సంచారం.
రాహు కేతువులు: 9-3 రాశులలో 7-3-2019 వరకు ఆపైన మిధున, ధనస్సులలో 8-2 రాశులలో
వేధ గోచారం: 26-12-2018 వరకు గురుడు శుభుడు. 30-8-2018 నుంచి కేతువు పాపి. శని, రాహువులు సంవత్సరమంతా శుభులు.
మంచికాలం:
కేతువు: 7-3-2019 వరకు మూడింట కేతువు
ఆరోగ్యాన్ని ధన లాభాన్ని, కీర్తిని ఇస్తాడు. సోదరులతో వివాదాలకు తావు ఇవ్వకూడదు. విందు, వినోదాలలో పాలు పంచుకుంటారు.
దోషకాలం:
గురువు: 11-10-2018 వరకు గురువు వ్యయంలో ఉండగా, ఇంటిలో శుభకార్యాలు, వాటి వల్ల ధన వ్యయం. స్థలం మార్పు కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. 12-10-2018 నుంచి జన్మరాశిలో ఉన్న గురుడు వల్ల శ్రద్ధ తగ్గటం, ఇబ్బందులు, అవరోధాలు పెరగటం, వాక్కుపై అదుపు లేకపోవటం, ఖర్చులు పెరగటం, అధికారులతో గొడవలుంటాయి.
శని: ద్వితీయంలో ఉన్న ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కొత్త పనులు మొదలు పెట్టినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
రాహువు: 7-3-2019 వరకు మూడింట ఉన్న రాహువు పనులలో ఆలస్యం, ప్రయాణాలకు కారణం అవుతాడు.
నక్షత్ర రీత్యా:
విశాఖ: సంవత్సరమంతా శని, రాహు, కేతువులు శుభులు. 27-10-2018 నుంచి 26-12-2018 వరకు గురువు శుభుడు.
అనురాధ: శని, కేతువులు సంవత్సరమంతా శుభులు. 18-3-2018 నుండి 26-4-2018 వరకు రాహువు పాపి. 18-3-2018 నుండి 18-6-2018 వరకు మరోసారి 2-8-2018 నుంచి 29-3-2019 వరకు గురువు శుభుడు.
జ్యేష్ఠ: 18-6-2018 నుండి 29-3-2019 వరకు గురుడు శుభుడు. 26-4-2018 నుండి 3-1-2019 వరకు రాహువు పాపి. 7-3-2019 నుండి కేతువు పాపి. సంవత్సరమంతా శని పాపి.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: పూర్వం కంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది. నిరాశ తగ్గి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. క్రోధావేశాలు అధికంగా ఉంటాయి. తినే ఆహారం పై శ్రద్ధ పెట్టాలి. సెప్టెంబరు, అక్టోబర్‍లలో వైద్యం ఖర్చులు ఎక్కువవుతాయి. అక్టోబరు నెలలో జీవిత భాగస్వామి గురించిన చింత వుంటుంది. ఉష్ణాధిక్యత చేత, ఎసిడిటి వల్ల, ఒత్తిడి వల్ల, ఊబకాయం వల్ల, మధుమేహం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి.
ఆదాయం – ధనం: పూర్వం కంటే ఈ సంవత్సరం ఆదాయం బావుంటుంది. అనుకోని ఖర్చులు పెరుగు తాయి. అప్పు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. సృ• నాత్మక వ్యక్తులకు ఈ సంవత్సరం మంచి ఆదాయం వస్తుంది. 2018 మార్చి, ఏప్రిల్‍ నెలలలో ఆదాయం చాలా బావుంటుంది. మే, జూన్‍లలో చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం తగ్గుతుంది. సంవత్సరం చివరి నాలుగు నెలల్లో స్థిరాస్థుల గురించిన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంవత్సరం మొదట్లో కంటే చివర్లో ఆదాయ పరంగా మరింత లాభం
ఉంటుంది.
వృత్తి – ఉద్యోగాలు: కాలంతో పరుగు పెట్టవలసిన సమయం. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువవుతాయి. ఆగస్టు 2018 తర్వాత ఆదాయంలో మంచి మార్పులు, లాభాలు కలిసి వస్తాయి. ధన సంపాదనకు ఈ సంవత్సరం ఉత్త•మమైన కాలం. ధైర్యం చేసి ముందుకు అడుగు వేసి మంచి ఫలితాలు సాధిస్తారు. సెప్టెంబరు, అక్టోబరు నెలలో తెలివి తేటలు ఉపయోగించి మంచి లాభం పొందుతారు. ఉద్యోగస్థులు ఈ సంవత్సరం నియమాలను, చట్టాలను ఉల్లంఘించకూడదు. పాత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉద్యోగ పరిస్థితులు మెరుగు పడతాయి. వ్యాపారంలో నిదానంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయంలో హెచ్చు తగ్గులుంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కువ సొమ్ము అప్పుగా ఇవ్వటం కాని, పుచ్చుకోవటం కాని చేయకూడదు.
విద్యార్థులు-పరీక్షలు: పూర్వం కంటే చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. కానీ, ఏకాగ్రత నిలపటం కష్టంగా ఉంటుంది. సంవత్సరం మొదట్లో ప్రతిభకు తగ్గ ఫలితం లభించక పోవటం చేత నిరాశ అలుము కుంటుంది. జూన్‍, జూలై మాసాలలో జాగ్రత్తగా వ్యవహరించక పోతే పరీక్షలు తప్పే ప్రమాదముంది. మనోబలం, ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.
ప్రయాణాలు-యాత్రలు: అక్టోబరు 2018 వరకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఎక్కువ. సమస్యల కారణంగా జూన్‍ నెలలో ప్రయాణాలుంటాయి. ఈ సమయంలో యాత్రల వల్ల సుఖం కంటే కష్టం ఎక్కువ ఉంటుంది. జూన్‍ 16 నుండి 18-7-2018 వరకు స్థలం మార్పుకు సంబంధించిన ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లటం మంచిది కాదు.
కుటుంబం-సమాజం: ఈ సంవత్సరం సంతా నానికి సంబంధించిన ఇబ్బందులు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు చోటు చేసు కుంటాయి. మాట మాట పెరిగి, దగ్గర వ్యక్తుల మనస్సు కష్టపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు, 10 మందితో చేసే పనులు ఆర్థిక లాభాన్ని అందిస్తాయి. సంవత్సరం చివర్లో శారీరక మానసిక చింతలు పెరుగుతాయి.
ధార్మిక విషయాలు: ధర్మ కార్యాలు, ధార్మిక విషయాలపై మనస్సు ఈ సంవత్సరం లగ్నమవుతుంది. రెండవ ఇం• కుటుంబ స్థానంలో ఏలినాటి శని సంచారం వల్ల మానసిక, సుఖ శాంతులకు గురించిన ఆలోచన సాగుతుంది.
పరిహారాలు: ఆపద్దుద్దారక దుర్గా స్తోత్రం, విష్ణు సహస్త్ర నామ పారాయణం నిత్యం చేసుకోవాలి. శివ, హనుమత్‍ ఆరాధనలు చేసుకోవటం మంచిది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం మరచిపోవద్దు.

ధనస్సు రాశి

చాంద్ర గోచారము: మూల 4పాదాలు, పూర్వాషాఢ 4పాదాలు, ఉత్తరాషాఢ 1పా
నామ నక్షత్రములు: యే, యో, భా, భీ, భూ, ధ, ఫ, ఢా, భే
ఆదా: 5, వ్యయం: 5, రాజ: 1, అవ: 5
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు లాభంలో, ఆ తర్వాత 29-3-2019 వరకు వ్యయంలో, ఆపై జన్మరాశిలో సంచారం.
శని: సంవత్సరమంతా జన్మరాశిలో సంచారం.
రాహు కేతువులు: 7-3-2019 వరకు అష్టమ, ద్వితీయ రాశులలో ఆపై సప్తమ, జన్మరాశులలో సంచారం.
వేధ గోచారం: శని, రాహు, కేతువులు సంవత్సర మంతా శుభులు. గురువు సంవత్సరమంతా పాపి.
మంచికాలం:
గురువు: 11-10-2018 వరకు లాభరాశిలో
ఉండటం వల్ల శత్రువులపై విజయం, ప్రతిభకు మంచి గుర్తింపు, మంచి ఆరోగ్యం, కీర్తి ప్రతిష్ఠలు, మంత్ర సిద్ధి, భోగ భాగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయి.
ప్రతికూలం:
గురువు: 12-10-2018 నుంచి వ్యయ రాశిలో గురువు ఉండటం వల్ల స్థాన మార్పు. శుభ కార్యాల వల్ల ధన వ్యయం ఉంటాయి.
శని: ఏలినాటి శని జన్మంలో ఉండటం వల్ల ఆరోగ్యం జాగ్రత్త. అపకీర్తిని మూటగట్టుకోకూడదు. ఖర్చులపై అదుపు ఉండాలి. పూర్తి స్థాయిలో ఆలోచించి కాని ఏ నిర్ణయాలు తీసుకోకూడదు.
రాహువు: 7-3-2019 వరకు అష్టమ రాహువు వల్ల మానసిక విచారం. ఆరోగ్య నష్టం, అధికారులతో విభేదాలు అంతగా లాభించని ప్రయాణాలు.
కేతువు: 7-3-2019 వరకు ద్వితీయంలో వాక్‍ స్థానంలో ఉండటం వల్ల మాట తూలటం వల్ల కష్టాలు పడ్తారు.
మూల: సంవత్సరమంతా రాహు, శనిలు శుభులు. 7-3-2019 వరకు కేతువు, సంవత్సమంతా గురుడు పాపులు.
పూర్వాషాఢ: సంవత్సరమంతా గురుడు పాపి. శని, రాహు, కేతువులు శుభులు.
ఉత్తరాషాఢ: 10-10-2018 నుంచి 29-3- 2019 వరకు గురుడు శుభుడు. శని, రాహు, కేతువులు. సంవత్సరమంతా శుభులు.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఈ సంవత్సరం ఆరోగ్యం సామా న్యంగా బావుంటుంది. ఆహార విహారాదులలో నియమ పాలన వదలకూడదు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు నిర్ణీత సమయాలలో డాక్టర్లను తప్పని సరిగా కలవాలి సలహాలు తీసుకోవాలి. ఆకస్మికంగా అనారోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు. అనుకోని దుర్ఘటనలు జరిగేందుకు కొంత అవకాశం ఉంది. అజాగ్రత్త కూడదు. రోగ నిర్థారణలో లోపం జరిగే అవకాశముంది. సంవత్సరం చివరి ఆరునెలల్లో నిపుణులైన డాక్టరు సలహాలు తప్పని సరిగా తీసుకునే అవకాశం వస్తుంది.
ఆదాయం – ధనం: ఈ సంవత్సరమంతా కూడా క్రితం సంవత్సరంలానే ఆర్థిక స్థితి ఉంటుంది. ఆదాయంలో హెచ్చు తగ్గులుంటాయి. ధన సంపాదన కోసం బాగా కష్టపడవలసి వస్తుంది. జూన్‍, ఆగస్టు నెలలో వ్యాపారంలో సర్దుబాట్లు, ఆదాయం పెంచుకోవటం కోసం కొత్త ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి.
వృత్తి-ఉద్యోగాలు: ఉద్యోగులు పని చేసే చోట పరిస్థితులు అంతగా అనుకూలంగా ఉండవు. ఉన్న తాధికారులు, సహోద్యోగులతో వివాదాలు చెలరేగే అవకాశముంది. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నియమ నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలి. ఏ మాత్రం ఉల్లంఘించినా ఇబ్బందులు తప్పవు.
వ్యాపారస్థులకు వ్యాపారం పూర్వం లాగానే నడుస్తుంది. ఈ సంవత్సరం ఎక్కువగా అప్పులు ఇవ్వటం గానీ, తీసుకోవటం కాని చేయకూడదు. పూర్వం పెట్టిన పెట్టుబడులపై మంచి లాభాలే వస్తాయి.
జూలై నుంచి నవంబరు మాసం వరకు ఉద్యో గులకు, వ్యాపారులకు అభివృద్ధికి అనుకూలించే కాలం. సంవత్సరం ఉత్తరార్థంలో, కిరాణా, బంగారం, వస్త్రాలు, వాహనాలు, ప్రచురణ కర్తలకు వారితో పని చేసే వారికి అనుకూలం.
విద్యార్థులు-పరీక్షలు: ఈ సంవత్సరం ఎక్కువ అనుకూలంగానే ఉంటుంది. కానీ ఇతర విషయాల పట్ల ఆసక్తి చదువు మీద దృష్టి పెట్టకుండా ఆపుతుంది. ఏకాగ్రత పెంపొందించుకోవాలి. పోటీ పరీక్షలో గట్టి పోటీ ఇస్తారు. సెప్టెంబరు 2వ వారం నాటికి చదువు విషయంలో మార్పులు, చేర్పులు చేసుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతారు.
ప్రయాణాలు-యాత్రలు: స్నేహితులతో కలిసి ఈ సంవత్సరం చాలా ప్రయాణాలు చేసే అవకాశ ముంది. సంవత్సరం మొదట్లో స్థాన చలనం కని పిస్తోంది. జూన్‍ నుంచి ఆగస్టు వరకు, ఏ విధమైన ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. సెప్టెంబరు, అక్టోబరు మాసాలు వ్యాపారస్థులకు అనుకూలం. సంవత్సరం మధ్యలో ప్రయాణాల గురించి ప్రణా ళికలు వేసినా అనుకోని ఇబ్బందుల వల్ల ఆగిపోవలసి వస్తుంది.
కుటుంబం-సమాజం: ఈ సంవత్సరం వివాహానికి అనుకూలమైన కాలం. దాంపత్యం జీవి తంలో ప్రేమ అభిమానాలు కొద్దిగా తక్కువవుతాయి. ఇతర వ్యక్తులతో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు చక్కటి అనుబంధాన్ని పెంపొందుకుంటారు. ఈ సంవత్సరం సామాజికంగా, కుటుంబపరంగా కొంత కష్టం, కొంత ఇష్టంగా నడిచిపోతుంది.
ధార్మిక విషయాలు: ఈ సంవత్సరం ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం బాగా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే జన్మరాశిలో శని సంచారం వల్ల ఏ విషయాలలోను అత్యుత్సాహం చూప కుండా భగవత్‍ ధ్యానం చేసుకుంటూ తన పరిథిలో తాను జీవించాలి.
పరిహారాలు: శివ, ఆంజనేయ, దుర్గ, ఉపాసనం చేయాలి. చీమలకు, పక్షులకు ప్రతిరోజు ధాన్యపు గింజల్నో, బియ్యాన్నో అందించాలి. అర్థనారీశ్వర స్తోత్రం పారాయణ చేయాలి.

మకర రాశి

చాంద్ర గోచారము: ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2పా.
నామ నక్షత్రములు: భో, జా, జి, ఖి, ఖు, ఖె, ఖో, గా, గి
ఆదా: 8, వ్యయం 14, రాజ: 4, అవ: 5
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు దశమంలో, ఆ తర్వాత ఏకాదశంలో, ఆపై 29-3-2019 నుండి 12వ ఇంట సంచారం.
శని: సంవత్సరమంతా ధనుస్సు రాశిలో ద్వాద శంలో సంచరిస్తాడు.
రాహు కేతువులు: 7-3-2019 వరకు జన్మ రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, ఆ తర్వాత ఆరింట రాహువు 12లో కేతువు.
వేధ గోచారం: 28-3-2019 వరకు గురువు పాపి, శని 6-5-2018 నుంచి 27-11-2018 వరకు పాపి. రాహువు సంవత్సరమంతా శుభుడు. 30-8-2018 వరకు కేతువు పాపి.
మంచికాలం:
గురువు: 12-10-2018 నుంచి ఏకాదశంలో, గురువు ఉండటం వల్ల ప్రతిభకు తగిన గుర్తింపు, పని తీరుకు మెచ్చుకోలు, శత్రువులపై విజయం, మంచి ఆరోగ్యం, మంత్ర సిద్ధి, సుఖం భోగం ఎన్నో రోజులుగా ఆగిన సమస్యలు పరిష్కారమవుతాయి.
ప్రతికూలం:
గురువు: 11-10-2018 వరకు పనులలో జాప్యం, పరిస్థితుల ప్రభావం వల్ల ఆటంకాలు, లాభం లేని ప్రయాణాలు.
శని: సంవత్సరమంతా ఏలినాటి శని 12లో ఉండటం వల్ల బాగా ఆలోచించి మాట్లాడాలి. నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు.
రాహువు: సప్తమంలో 7-3-2019 వరకు
ఉండటం వల్ల కొద్దిపాటి లాభం, అనసరపు ప్రయాణాలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు.
కేతువు: 7-3-2019 వరకు జన్మరాశిలో కేతువు ఉండంటం వల్ల దూర/విదేశీయానాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి. వృధా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆచి తూచి మాట్లాడండి.
నక్షత్ర రీత్యా:
ఉత్తరాషాఢ: శని, రాహు, కేతువులు సంవత్సర మంతా శుభులు. 10-10-2018 నుండి 28-3-2019 వరకు గురుడు శుభుడు.
శ్రవణం: సంవత్సరమంతా గురుడు పాపి. శని, రాహువులు శుభులు. 7-3-2019 వరకు కేతువు పాపి.
ధనిష్ట: సంవత్సరమంతా గురుడు పాపి. శని, కేతువులు శుభులు. 7-3-2019 నుండి రాహువు శుభుడు.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఈ సంవత్సరం ఆరోగ్యస్థితి మధ్యమంగా ఉంటుంది. నిర్లక్ష్యం తగదు. పాత అనారోగ్య సమస్యలు కొంత ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. డాక్టరు సలహా పాటించి తీరాలి. ఏప్రిల్‍, మే నెలలో కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించిన చింత ఎక్కువవుతుంది. ఆకస్మికంగా ఆరోగ్యం ఇబ్బంది పెడ్తుంది. అనారోగ్య కారణాలను విశ్లేషించటంలో పొరపాట్లు జరగవచ్చు. ప్రతి విషయాన్ని ప్రతికూల దృక్పథంతో, నిరాశతో, అజ్ఞాత భయాలతో చూసి, మనస్సు కష్ట పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలి.
ఆదాయం – ధనం: ఈ సంవత్సరం ధనాదాయం బావుంటుంది. ఏప్రియల్‍ నెలలో ఖర్చులు ఎక్కువై ఆదాయం తగ్గవచ్చు. అప్పులు తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు. అభివృద్ధి బావుంటుంది. సెప్టెంబరు, అక్టోబరు నెలలో వ్యాపారం కోసం చేసే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ముందుగా, నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలితే కోరుకున్న ప్రగతి సాధిస్తారు. తొందరపాటు తగదు. జూన్‍ తర్వాత ఆర్థిక పరిస్థితులో మరీ ఎక్కువ మార్పులుండవు.
వృత్తి – ఉద్యోగాలు: ఈ సంవత్సరం అదృష్టాన్ని నమ్ముకోవద్దు. స్వయంకృషితో పద్ధతిగా చేసే ప్రయ త్నాలు, గొప్ప విజయాలను అందిస్తాయి. సంవత్సరంలో రెండు మూడు సార్లు ఉద్యోగం వదిలేద్దామన్నంత చిరాకు కలుగుతుంది. అక్టోబరు నుంచి వృత్తి ఉద్యోగాలలో ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కూడా కలసి వస్తుంది. ఏప్రిల్‍ 2018లో ట్రాన్స్ఫర్‍ కాని, తాత్కాలిక స్థల మార్పు కాని ఉంటాయి. సెప్టెంబరు మాసంలో చేసే కార్యకలాపాలలో అనుకోని ఆటంకాలు ఇబ్బంది పెడతాయి.
ఉద్యోగులకు, కార్యాలయాలలో పరిస్థితి బాగుండ నప్పటికీ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్‍లు వచ్చే అవకాశముంది. తాత్కాలిక ఉద్యోగులు చాలా జాగ్రత్తగా పనిచేయాలి.
వ్యాపారంలో అన్ని పనులు నత్తనడక నడుస్తాయి. అప్పులు తీసుకొని డబ్బులు పెట్టినా పెద్ద మార్పు ఏమీ కనిపించదు. ఖర్చులు పెరుగుతాయి. అనవసర వాద వివాదాలు పెరుగుతాయి. కోర్టుకు ఎక్కడం వల్ల ఫలితం ఉండదు. కొత్త వ్యాపారానికంటే ఉన్నదానిని జాగ్రత్తగా కాపాడుకోవటం మేలు.
విద్యార్థులు-పరీక్షలు: విద్యార్థులకు ఈ సంవత్సరం మంచికాలం. అక్టోబరు నెల నుంచి చదువు బాగా సాగుతుంది. అన్ని రకాల పరీక్షలలో ప్రతిభ కనబరుస్తారు. అంతకు ముందు వరకు ఏకాగ్రత నిలుపుకోవటం కష్టం అవుతుంది. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు కొత్త విషయాలు నేర్చుకోవటం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మనస్సుకు నచ్చిన విద్యాలయంలో ప్రవేశానికి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి.
ప్రయాణాలు-యాత్రలు: ఈ సంవత్సరం అంతగా అవసరం లేకుండానే ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కోరుకున్న ప్రయోజనం సిద్ధిస్తుందా, లేదా అన్న చింత నిరంతరం మనస్సును బాధిస్తుంది. ఒకటి తర్వాత ఒకటి ప్రయాణాలు, ఉత్తరార్థంలో ఎక్కువ ఉంటాయి. డిసెంబరు నెలలో దూరపు ప్రయాణాలు ఎక్కువ వుండొచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే యాత్రలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి.
కుటుంబం-సమాజం: అవివాహితులకు వివాహ యోగం ఉంది. అహంకారం వల్ల కుటుంబంలో వివాదాలు, దాంపత్యంలో పొరపొచ్చలు చోటు చేసుకునే ప్రమాదముంది. సంవత్సరం చివరి ఆరు నెలల్లో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త పనులు మొదలు పెడ్తారు. భూమి లేదా భవనం అమ్మకాల వల్ల లాభం వస్తుంది. రాజకీయ కార్యకలాపాల్లో ప్రగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకార లోపం వల్ల నిరాశగా ఉంటుంది. సంతానానికి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. దానివల్ల కుటుంబంలో ఆందోళన పెరుగుతుంది.
ధార్మిక విషయాలు: సంవత్సరం మొదట్లో ధార్మిక కార్యక్రమాలలో పాల్గొని చక్కని సేవా తత్పరత కనబరుస్తారు. అందరి మెప్పు పొందుతారు. రోజువారీ వ్యవహారాలలో చిన్నచిన్న ఇబ్బందులు, చికాకులు ఎదురవటం వల్ల దైవానుగ్రహం కోసం ప్రయత్నాలు చేస్తారు.
పరిహారాలు: నిత్యం కాలభైరవాష్టకమ్‍, హనుమాన్‍ చాలీసా పారాయణం, శివాలయ దర్శనం చేయాలి. దుర్గా సప్తశ్లోకం, మంగళ, శని వారముల యందు పారాయణ చేయుట మంచిది. శనివారం నాడు సుందర కాండ పారాయణం శుభాన్ని కలుగజేస్తుంది.

కుంభ రాశి

చాంద్ర గోచారము: ధనిష్ఠ 3,4పా, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3పాదాలు
నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సీ, సు, సే, సో, దా
ఆదా: 8, వ్యయం 14, రాజ: 7, అవ: 5
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు భాగ్యమందు, ఆపైన 29-3-2019 వరకు దశమంలో, ఆ తరువాత సంవత్సరమంతా లాభంలో
శని: శని సంవత్సరమంతా ఏకాదశంలో
రాహు కేతువులు: 7-3-2019 వరకు 6-12 రాశులలో, ఆపై 5-11 రాశులలో
వేధ గోచారం: సంవత్సరమంతా గురుడు పాపి. 5-6-2018 నుండి 27-11-2018 వరకు శని పాపి. రాహు, కేతువులు 7-3-2019 వరకు పాపులు.
మంచికాలం:
గురువు: 11-10-2018 వరకు గురువు నవ మంలో ఉండటం వల్ల ఆస్థిలో పెరుగుదల, స్వగృహ ప్రాప్తి, ధనలాభం, ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకోవటం. విందు, వినోదాలు, సుఖ-సంతోషాలు లభిస్తాయి.
శని: సంవత్సరమంతా లాభంలో ఉండటం వల్ల సంతానం అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పనులలో విజయం సాధిస్తారు. మంచి ఆరోగ్యం, అవసరానికి డబ్బు, సుఖ సంతోషాలు ఉంటాయి. అదృష్టం కలిసి వస్తుంది.
రాహువు: 7-3-2019 వరకు షష్ఠ రాహువు వల్ల శత్రువులపై విజయం భూలాభం, చక్కని ధైర్యంతో వ్యవహారం.
ప్రతికూలం:
గురువు: 12-10-2018 నుంచి దశమంలో గురువు వుండటం చేత పనులలో ఆలస్యం. ఆర్థిక సమస్యలు, వృథా ప్రయాణాలు ఉంటాయి.
కేతువు: 7-3-2019 వరకు వ్యయంలో కేతువు ఉండటం చేత పనులలో ఆటంకాలు, విదేశీ ప్రయాణాలుంటాయి. కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
నక్షత్ర రీత్యా:
ధనిష్ఠ: శని, కేతువులు సంవత్సరమంతా శుభులు. గురువు పాపి. రాహువు 7-3-2019 నుంచి శుభుడు.
శతభిషం: శతభిషం 18-6-2018 నుండి 1-8-2018 వరకు గురుడు శుభుడు. శని, కేతువులు సంవత్సరమంతా శుభులు. రాహువు 26-4-2018 నుంచి 3-1-2019 వరకు, తిరిగి 7-3-2019 నుంచి పాపి.
పూర్వాభాద్ర: శని శుభుడు. గురువు పాపి, రాహువు 3-1-2019 నుంచి పాపి. 30-8-2018 నుండి కేతువు పాపి.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఈ సంవత్సరం ఆరోగ్యస్థితి అనుకూలంగానే ఉంటుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా, ఆ ఇబ్బందులు ఈ సంవత్సరం అదుపులో ఉంటాయి. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఎదురు కావు. మొదటి ఆరు మాసాలకు చివరి ఆరు మాసాలకు మధ్య ఆరోగ్యంలో కొంత మార్పు కనిపిస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అరుగుదల సమస్యలు కొంత ఇబ్బంది పెట్టొచ్చు జాగ్రత్త.
ఆదాయం – ధనం: ఆర్థిక స్థితి బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది. పాత పెట్టుబడులపై లాభాలు పొందుతారు. భవిష్యత్తుకోసం కొత్త పెట్టుబడులు పెడతారు. ద్వితీయార్ధంలో వ్యాపారస్థులకు మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన ఒక ముఖ్య వ్యక్తిని కలుస్తారు. కానీ, సంవత్సరం మధ్యలో ఆలోచించి ముందడుగు వేయటం మంచిది.
వృత్తి – ఉద్యోగాలు: వృత్తి, ఉద్యోగాలలో ఉన్నతి కనిపిస్తుంది. కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. మొదటి ఆరు నెలల కంటే చివర్లో ఎక్కువ లాభాలు వస్తాయి. అధికారుల విశ్వాసం చూరగొంటారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు వస్తాయి. తాత్కాలిక ఉద్యోగులు స్థిరమవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్థులకు కూడా ప్రస్తుత ఉద్యోగం బాగుండటమే కాక, వేరే సంస్థల నుంచి కూడా ఆహ్వానం అందుతుంది. సెప్టెంబరు నెలలో, ఉద్యో గంలో, స్థలంలో మార్పు కనిపిస్తోంది.
వ్యాపారస్థులకు అనుకూలమైన కాలం. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి ఈ సమయం అన్ని విధాల కలసి వస్తుంది.
విద్యార్థులు-పరీక్షలు: అన్ని రకాలుగా ఈ సంవత్సరం బావుంటుంది. గురువుల, సహ విద్యార్థుల సహాయం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు కూడా మనస్సు పెట్టి చదువుతారు. ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అందుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ప్రయాణాలు-యాత్రలు: మార్చి 2018లో ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఏప్రిల్‍లో కుటుంబ సభ్యలతో కలిసి యాత్రా స్థలాలను దర్శించేందుకు ప్రణాళికలు వేస్తారు. ఈ సమయంలో చేసే ప్రయాణాల వల్ల సుఖ సంతోషాలు, లాభం వరిస్తాయి. సంవత్సరం మధ్యలో వేసే ప్రణాళికలు ఆగిపోయే అవకాశా లున్నాయి. సరైన ప్రణాళికతో సాగితే యాత్రలన్నీ మంచి సంతోషాన్నిస్తాయి.
కుటుంబం-సమాజం: సంవత్సరం ఆరంభంలో వివాహ సూచనలున్నాయి. కుటుంబంలోని సభ్యుల మధ్య అనురాగం వృద్ధి పొందుతుంది. అక్టోబరు నుండి డిసెంబరు మధ్య కాలంలో కుటుంబంలోని కొత్త సభ్యుల ఆగమనం కనిపిస్తోంది. తోటి వారంటే మీకున్న ప్రేమవల్ల వారి ఉన్నతి కోసం వారి మనస్సులో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతారు.
ధార్మిక విషయాలు: మనస్సు ధార్మిక కార్యక్రమాల వైపు మొగ్గుచూపుతుంది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మికతను ఆసరా చేసుకుంటారు. గురువు అక్టోబరులో రాశి మారిన తరువాత కుటుంబం అంతా కలిసి హోమాలు, జపాలు లాంటి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు.
పరిహారాలు: సూర్యోదయ కాలంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయ పారాయణం, అర్థనారీశ్వర స్తోత్రం పారాయణ, సుబ్రహ్మణ్యారాధన వల్ల మేలు జరుగుతుంది.

మీన రాశి

చాంద్ర గోచారము: పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర 4పాదాలు, రేవతి 4 పాదాలు
నామ నక్షత్రములు: దీ, దూ, ఞ, ఝ, ధా, దే, దో, చా, చి
ఆదా: 5, వ్యయం: 5, రాజ: 3, అవ: 1
గోచర గ్రహస్థితి:
గురువు: 11-10-2018 వరకు అష్టమం, నాటి నుంచి 29-3-2019 వరకు నవమంలో ఆ తర్వాత దశమంలో సంచారం.
శని: సంవత్సరమంతా దశమంలో రాజ్యమందు శని
రాహు కేతువులు: సంవత్సరం మొదటి నుండి 7-3-2019 వరకు 5-11 రాశులలో సంచారం ఆ తరువాత 4-10 రాశులలో సంచారం.
వేధ గోచారం: శని సంవత్సరమంతా పాపి. కేతువు సంవత్సరమంతా శుభుడు. గురువు 29-3-19 నుంచి శుభుడు. 26-4-2018 నుంచి 3-1-2019 వరకు రాహువు పాపి.
మంచికాలం:
గురువు: 12-10-2018 నవమంలో ఉన్న గురువు వల్ల, స్వగృహ ప్రాప్తి, ఆదాయంలో వృద్ధి. సంపద పెరగటం, ధార్మిక విషయాలలో ఆసక్తి. సమాజంలో గౌరవం, విందు వినోదాలు, విహార యాత్రలు, సుఖ సంతోషాలు.
కేతువు: 7-3-2019 వరకు లాభంలో
ఉండటం వల్ల భోజన సౌఖ్యం ఉంటుంది. పశు సంపద పెరుగుతుంది. వస్తు ప్రాప్తి, నూతన వస్త్ర లాభాలు, విజయాలు.
ప్రతికూలం:
గురువు: 11-10-2018 వరకు అష్టమంలో గురువు వుండటం వల్ల మాట కఠినంగా ఉంటుంది. మనుషులు కోపంగా ఉంటారు. పనులు వాయిదా వేసుకోవాలి. సాహసం పనికిరాదు. అలసట ఎక్కువ.
శని: దశమంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యో గాలలో మనస్సు పెట్టి పని చేయాలి. నిర్లక్ష్యం తగదు.
రాహువు: 7-3-2019 వరకు పంచమంలో ఉండటం వల్ల అకాల భోజనం, గౌరవలోపం. 18-8-2017 నుంచి చతుర్ధంలో ఉన్న రాహువు వల్ల మనస్సు నిలకడ ఉండదు.
నక్షత్ర రీత్యా: పూర్వాభాద్ర: సంవత్సరమంతా గురుడు పాపి. శని శుభుడు. 3-1-2019 నుంచి రాహువు పాపి. 30-8-2018 నుంచి కేతువు పాపి.
ఉత్తరాభాద్ర: సంవత్సరమంతా గురుడు పాపి. రాహు, కేతువులు శుభులు. 6-6-2018 నుండి 26-11-2018 వరకు శని శుభుడు.
రేవతి: 29-3-2019 నుంచి గురుడు శుభుడు. జూన్‍ 6 నుండి నవంబరు 26 2018 వరకు శని పాపి. రాహువు సంవత్సరమంతా శుభుడు. కేతువు 7-3-2019 నుంచి శుభుడు.
గోచార ఫలితాలు:
ఆరోగ్యం: ఆరోగ్యస్థితి మధ్యమంగా ఉంటుంది. అక్టోబరు వరకు ఉదర సంబంధిత రోగాలు బాధపెడతాయి. పంచమ రాహువు వల్ల ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు పుట్టుకు వస్తాయి. ఆహార నియమాలపై సరైన దృష్టి పెట్టాలి. జూలై ఆగస్టులలో పాత రోగాలు ఇబ్బంది పెడతాయి. శ్రమాధిక్యం చేత శరీరం మనస్సు బలహీన పడతాయి. ఆగస్టు నెలలో ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఎక్కువ ఉంటాయి. మసాలాలు ఎక్కువ లేని సాత్విక ఆహారం తినాలి. శరీరంలో నీరు తగ్గటం, లేదా కలుషిత నీరు తాగటం వల్ల అనారోగ్యం బాధిస్తుంది. అక్టోబరు చివరి నుండి ఆరోగ్యం మెరుగుపడటం మొదలవుతుంది.
ఆదాయం – ధనం: ఆదాయ పరంగా ఈ సంవత్సరం శుభా శుభ మిశ్రమంగా ఉంటుంది. పాత సంవత్సరం కంటే బావున్నప్పటికీ రావాల్సినంత అభివృద్ధి రాకపోవటం వల్ల అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. పాత పెట్టుబడులపై లాభాలు బావుంటాయి. మే, జూన్‍లలో నిర్లక్ష ్యం వల్ల సమయం, ధనం వృధా అయ్యే అవకాశముంది జాగ్రత్త. షేర్‍ మార్కెట్‍లలో లాభాలు వస్తాయి. కానీ, అక్టోబరు 11 వరకు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదు. నోటి మాటపై అదుపు ఉంచుకోవాలి.
వృత్తి – ఉద్యోగాలు: జూన్‍, జులైల వరకు అంత రాణింపు కనబడదు. ఆ తర్వాత నుంచి పరిస్థితులలో మార్పులు వస్తాయి. ఫలితాలు రావటం మొదలవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. దానికి తోడు అధిక శ్రమ కూడా తప్పదు. సంవత్సరం రెండో భాగంలో ఆదాయంలో పరిస్థితులలో మంచి మార్పులు సంభవించి అభివృద్ధి వైపు సాగుతారు.
ఉద్యోగస్థులకు ఆకస్మికంగా పదోన్నతి లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రైవేటు రంగంలో పని చేసే వారికి ఉద్యోగంలో మార్పులు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల సహాయం అంతగా లభించదు. సహోద్యోగుల సహకారం కష్టపడి సాధించుకోవాలి. ఆలస్యం కాకుండా పనులు పూర్తి చేసుకోవాలి. వ్యాపారస్థులకు ఇంతకు ముందు కంటే వ్యాపారంలో కొంత వేగం కనిపిస్తుంది. రక రకాల విషయాలనుంచి ఆదాయం లభిస్తుంది. కానీ, ఆదాయ వ్యయాలలో బాగా హెచ్చు తగ్గులుంటాయి. అక్టోబరు తర్వాత మరింత మంచి సమయం.
విద్యార్థులు-పరీక్షలు: ఈ సంవత్సరం విద్యార్థులకు మధ్యమంగా ఉంటుంది. సంవత్సరం మొదట్లో కంటే చివర్లో కలసి వస్తుంది. ముందు నెలలో ఇతర విషయాల మీద ఆసక్తి వల్ల చదువుపై ఏకాగ్రత నిలవదు. సంవత్సరం చివర్లో పోటీ పరీక్షలలో మంచి ఫలితాల కోసం విపరీతంగా చదవ వలసి వస్తుంది.
ప్రయాణాలు-యాత్రలు: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్థులు, ఇతర ప్రదేశాలకు వెళ్లి అధికంగా కష్టపడి పనిచేయవలసి వస్తుంది. అకస్మాత్తుగా ప్రయాణాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. అక్టోబరు నుంచి చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
కుటుంబం-సమాజం: కుటుంబ జీవనంలో ఈ సంవత్సరం కొన్ని ఇబ్బలుంటాయి. సంవత్సరమంతా కుటుంబ బాధ్యతల కోసం పని చేయవలసి వస్తుంది. సంతానంతో విభేదాలు తలెత్తవచ్చు. మిత్రులు, సోదరుల వల్ల పొరపాటున నష్ట పడవలసి వస్తుంది. అక్టోబరు మధ్య నుండి కుటుంబంలోని ఇబ్బందులు తొలిగి సుఖ శాంతులు నెలకొంటాయి.
ధార్మిక విషయాలు: సెప్టెంబరు వరకు ఎక్కువ తీర్ధయాత్రలు చేయటం వైపు మనస్సు పోతుంది. ధర్మ కార్యల కోసం ధనం ఖర్చు చేస్తారు. అక్టోబరు నుంచి గురుడు శుభ దృష్టి వల్ల పూజలు, వ్రతాలు, హోమాలుపై మనస్సు నిలిపి వాటిలో పాలు పంచుకుంటారు. కుటుంబ సభ్యలందరూ కలసి పూజలు చేయటం మంచిది.
పరిహారాలు: నవగ్రహ ఆరాధన, నిత్యము శివపూజ, దుర్గా సప్త శ్లోకం పారాయణ నెలకొక సారైనా రుద్రాభిషేకం, హనుమాన్‍ పూజ చేసుకోవాలి.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top