రెడీ.. కెమెరా.. యాక్షన్..

దా దాపు మూడు సంవత్సరాల
పాటు ‘బాహుబలి’కే అంకితమైపోయిన ప్రభాస్‍…. తదుపరి చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ‘సాహో’ పేరుతో సుజిత్‍ దర్శకత్వంలో ప్రభాస్‍ సినిమా చేస్తున్నాడు. బాహుబలి 2 విడుదల రోజే యూట్యూబ్‍లో విడుదలైన ‘సాహో’ టీజర్‍ సంచలనం సృష్టించింది. ఇందులో రక్తం తుడుచుకుంటూ…. స్టైల్‍గా కూర్చుంటూ ప్రభాస్‍ చెప్పిన ‘ఇట్స్ షో టైమ్‍’ డైలాగ్‍ అభిమానులను విపరీతంగా ఆకట్టేసుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్ల బడ్జెట్‍తో రూపొందనుండటం మరో విశేషం. శంకర్‍ – ఎహసన్‍-లాయ్‍ త్రయం ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తోంది.

Review రెడీ.. కెమెరా.. యాక్షన్...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top