వన్స్‌మోర్‌…

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు, ఎవరికి అదృష్టం తలుపు తడుతుందో, అవకాశాలు ఎలా వెతుక్కుంటూ వస్తాయో ఎవరికీ తెలియదు. ఒకపక్క యాభై ఏళ్లు దాటిన హీరోలు వరుసపెట్టి చేస్తున్న సినిమాలు.. ప్రస్తుతం హీరోయిన్ల రేస్‌లో వెనుకబడిపోయిన కొందరు సీనియర్‌ కథానాయికలకు అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. పెద్ద హీరోల పక్కన వారికి తగిన పాతల్ల్రో కనిపించడానికి పాత, సీనియర్‌ హీరోయిన్లకు అవకాశాలు లభిస్తున్నాయి. అలాఅని సీనియర్‌ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను వచ్చినట్టు ఒప్పేసుకోవడం లేదు. ఆచితూచి ఆయా చిత్రాల్లోని పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. మరి మన హీరోయిన్ల కాల్‌షీట్ల సంగతేంటో చూద్దామా..
‘నిశ్శబ్దం’ తరువాత అనుష్క సైలెంట్‌ అయిపోయింది. అయితే, ఆమె కోసం తెలుగులో కథలు, పాత్రలు సిద్ధమవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కోసం యూవీ క్రియేషన్స్‌ ఓ కథను రెడీ చేసింది.

‘జాను’ తరువాత సమంత తెలుగులో మరో చిత్రమేదీ చేయలేదు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా, ప్రస్తుతానికి మరే చిత్రానికీ ఆమె కమిట్‌ కాలేదు.

‘క్రాక్‌’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాలతో మెరిసిన శ్రుతిహాసన్‌ ప్రస్తుతం ‘కేజీఎఫ్‌2’ కోసం యశ్‌తో జోడీ కడుతోంది. పరుగులు పెడుతూ హడావుడిగా సినిమాలు చేసే ఉద్దేశం తనకు లేదంటోన్న ఈ భామ వరుసగా పెద్ద ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటోంది.

గతంలో కొత్త తరం హీరోయిన్లు తెరకు పరిచయమైతే చాన్నాళ్లు వారి హవానే కొనసాగేది. పాత తరం హీరోయిన్లు దాదాపు కనుమరుగైపోయే వారు. కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. నాలుగు పదుల వయసులోనూ విభిన్న పాత్రలు సీనియర్లను వెతుక్కుంటూ వస్తున్నాయి. వారి కోసమే ఆయా కథలు సిద్ధమవుతున్నాయి. సమంత, కాజల్‌, శ్రియ, ప్రియమణి.. వీళ్లంతా పెళ్లి తరువాత కూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. బలమైన కథలు, మంచి పాత్రలపై దృష్టి పెడుతూ వెండితెరపై తళుక్కున మెరుస్తున్నారు.
తెరపై కనిపించడానికి వచ్చిన సినిమాలన్నీ చేసెయ్యడం కాకుండా.. నచ్చిన కథ దొరికే వరకు సీనియర్‌ హీరోయిన్లు నిరీక్షిస్తున్నారు. అందుకు తగినట్టే వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ‘ఆచార్య’లో కాజల్‌ ఇలాగే తళుక్కుమంటోంది.
శ్రియ.. ఓ సంగీత ప్రధాన చిత్రంలో ప్రధాన పాత్ర దక్కించుకుంది. ఆమెకు శాస్త్రీయ నృత్యంలో అభినివేశం ఉంది. ఆ అభిరుచికి తగిన పాత్రే ఇప్పుడు లభించడంతో జోష్‌ మీదుంది.
రష్మిక, పూజాహెగ్డే, నిధి అగర్వాల్‌ వంటి నవతరం తారలతో సమానంగా కాజల్‌, అనుష్క. సమంత, శ్రుతిహాసన్‌ వంటి వారు సమానంగా అవకాశాలను దక్కించుకోగలుగుతున్నారు.

తమన్నా.. వెండితెరపై ఏళ్లుగా తన ముద్ర వేస్తూనే ఉంది. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ఈమె.. అతిథి పాత్రల్లోనూ, ఐటెం సాంగ్‌ల్లోనూ మెరవడానికి వెనుకాడటం లేదు. ఆ మధ్య వచ్చిన సినిమాల్లో ఈమె కనిపించని చిత్రాలు దాదాపు లేవంటే అతిశయోక్తి కాదు.

Review వన్స్‌మోర్‌….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top