సమ్‍థింగ్‍ స్పెషల్‍ శ్రేయ

తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసన తళుక్కుమన్న శ్రియ కెరీర్‍ డిఫరెంట్‍ వేలో సాగుతోంది. ఒక సమ యంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‍, బాలకృష్ణ, పవన్‍కల్యాణ్‍ వంటి హీరోలందరితో జతకట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. మధ్యలో జూనియర్‍ ఎన్టీఆర్‍, మహేశ్‍బాబు, రామ్‍చరణ్‍, ప్రభాస్‍ వంటి యువ హీరోలతో ఆడిపాడి సందడి చేసింది. ఇలా రెండుపక్కలా రెండు తరాల నటులతో నటిస్తూనే ఇంకోపక్క తరుణ్‍, సిద్ధార్థ, నరేష్‍, శర్వానంద్‍ వంటి కుర్రహీరోలతోనూ చెట్టాపట్టాలు కట్టింది. ఒక సమయంలో తెరమరుగైపోయినట్టు కనిపించిన శ్రియ ‘గోపాల గోపాల’, ‘దృశ్యం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో అటు నటిగా ఇటు మంచి ఫర్‍పార్మెన్స్తో అదరగొట్టింది. ప్రస్తుతం తమిళంలో ‘నరగసూరన్‍’, తెలుగులో ‘వీరభోగవసంతరాయలు’ సినిమాలతో బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ కెరీర్‍ను మహా భేషుగ్గా నడిపించుకుంటోంది.

Review సమ్‍థింగ్‍ స్పెషల్‍ శ్రేయ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top