సినీ ప్రేమపక్షులు..

ఇటీవలే భారత క్రికెట్‍ జట్టు కెప్టెన్‍ విరాట్‍కోహ్లీ, బాలీవుడ్‍ స్టార్‍ హీరోయిన్‍ అనుష్కశర్మ ఒక్కటయ్యారు. ఇప్పుడు మరో జంటపై అందరి దృష్టి పడింది. తెలుగు వారికి సుపరిచితుడైన కమల్‍హాసన్‍ కుమార్తె శ్రుతిహాసన్‍.. మైఖేల్‍ల ప్రేమ కథ పెళ్లి వరకు వచ్చినట్టేనని అనుకుంటున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన నటుడు అధవ్‍ పెళ్లిలో మైఖేల్‍, శ్రుతి సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్‍ యువకుడు మైఖేల్‍.. తమిళ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఆయన వేషాన్ని చూసిన వారంతా తప్పకుండా శ్రుతితో ఏడడుగులు వేస్తాడని అనుకుంటున్నారు. మైఖేల్‍ ఎవరు? అతనితో తనకు గల రిలేషన్‍ ఏమిటి? అనేవి పూర్తిగా తన వ్యక్తిగతమని, వాటి గురించి ఎవరూ డిస్కషన్‍ చేయనవసరం లేదని, వాటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా తనకు లేదని శ్రుతి ఖరాకండీగా చెబుతోంది. అలాగే, ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా లేదని, ప్రస్తుతానికి తన దృష్టి అంతా సినిమాలపైనే అంటూ వివరణ ఇచ్చింది.

Review సినీ ప్రేమపక్షులు...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top