సై.. సై ..సైరా

దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‍తో, మెగాస్టార్‍ చిరంజీవి హీరోగా భారీ నిర్మాణ విలువలతో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సైరా’. నరసింహారెడ్డి అనేది ఉప శీర్షిక. స్వాతంత్య్రోద్యమం ప్రారంభం కావడానికి ముందే రాయలసీమలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారని అంటారు. ఆయన పోరాట జీవితాన్నే మెగాస్టార్‍ చిరంజీవి హీరోగా ‘సైరా’ పేరుతో దర్శకుడు సురేందర్‍రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు రామ్‍చరణ్‍ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా మేకింగ్‍ వీడియో.. ఈ సినిమా ఎంత భారీగా రూపుదిద్దుకుందో చెప్పకనే చెప్పింది.
ఇక కథ విషయానికి వస్తే.. ఆంగ్లేయులు భారత్‍లో తమ ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాలకు ‘పాలెగాళ్ల’ను పెట్టుకునే వారు. అలాంటి ఓ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అయితే ఆ తరువాత తనలాంటి మరికొందరిని కూడగట్టి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలనేదే ఈ చిత్రకథ. ఈ చిత్రంలో అనుష్క ఝూన్సీరాణిగా కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి పాత్రను ఆయన చిన్న సోదరుడు, జనసేన అధినేత పవన్‍కల్యాన్‍ తన వాయిస్‍ ఓవర్‍ ద్వారా పరిచయం చేస్తారు. ఆయన వాయిస్‍ ఓవర్‍తోనే ఈ చిత్రకథ ప్రారంభమవుతుంది. చిరంజీవి గురువు ‘గోసాయి వెంకన్న’ పాత్రలో బాలీవుడ్‍ సూపర్‍స్టార్‍ అమితాబ్‍ బచ్చన్‍ నటించారు. రాజ నర్తకి పాత్రలో తమన్నా, నరసింహారెడ్డి (చిరంజీవి) భార్య సిద్ధమ్మగా నయనతార, నరసింహారెడ్డికి మద్దతుగా తమిళనాడు నుంచి వచ్చే దళ నాయకుడిగా విజయ్‍ సేతుపతి కనిపిస్తారు. ఇంకా ‘ఆవుకు రాజు’గా ‘కిచ్చ’ సుదీప్‍ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు అన్ని భాషలకు చెందిన సూపర్‍ స్టార్స్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీలో ఈ సినిమాను ‘ఏఏ ఆర్టస్’ పతాకంపై బాలీవుడ్‍ నటుడు ఫర్హాన్‍ అక్తర్‍ తదితరులు రిలీజ్‍ చేస్తున్నారు. నరసింహారెడ్డి ‘సై’ అంటూ ఆంగ్లేయులతో తలపడిన యుద్ధ సన్నివేశాలకు హాలీవుడ్‍ ప్రముఖులు పని చేశారు. ముఖ్యంగా గెరిల్లా యుద్ధ పద్ధతిని ఈ చిత్రంలో అత్యద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు. యాక్షన్‍ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ సినిమాలో 150కి పైగా వివిధ రకాల కత్తులను తయారు చేయించారు. చిరంజీవి రెండు కత్తులను ఇందులో వాడారని, ఒక కత్తిని ప్రత్యేకంగా రాజస్థాన్‍ నుంచి తెప్పించారని అంటున్నారు. ఇక్కడ డిజైన్‍ చేసి రాజస్థాన్‍లో తయారు చేయించిన కత్తి ఇది. ‘సైరా’లో రెండు భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయని టాక్‍. వీటిలో ఒకటి జార్జియాలో, మరొకటి హైదరాబాద్‍లోని కోకాపేట్‍ సెట్‍లో చిత్రీకరించారు. సినిమా మొత్తానికి ఇవే మేజర్‍ వార్‍ సీన్స్ అని అంటున్నారు. ఇవే ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తాయని చిత్ర యూనిట్‍ చెబుతోంది. అండర్‍ వాటర్‍ ఎపిసోడ్‍ ఒకటి ఉంటుందని, అది ఈ సినిమాకే హైలైట్‍గా నిలుస్తుందని అంటున్నారు. దీనిని ముంబైలో వారం పాటు షూట్‍ చేశారు. ఇది చారిత్రాత్మక చిత్రం కావడంతో ఆనాటి వాతావరణం సృష్టించడానికి చిత్ర బృందం చాలా వెచ్చించింది. అందుకోసం ప్రత్యేక సెట్స్ వేసింది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఏడుకు పైగా సెట్స్ వేసి సినిమాను తెరకెక్కించారు. ఆర్ట్ డైరెక్టర్‍ రాజీవన్‍ ఈ అద్భుతమైన సెట్లను తయారు చేశారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి 50కి పైగా క్యాస్ట్యూమ్స్లో కనిపిస్తారని అంటున్నారు. వీటిని ఆయన కుమార్తె కొణిదెల సుష్మిత డిజైన్‍ చేశారు. తమన్నా కోసం 25 కాస్ట్యూమ్స్ తయారు చేయించారు. నయనతారకు 20 డ్రెస్‍ చేంజ్‍లు ఉంటాయని సమాచారం. వచ్చే అక్టోబరులో ‘సైరా’ సినిమా విడుదల కానుంది.

Review సై.. సై ..సైరా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top