పరాశర మహర్షి

పరాశరుడు వశిష్టుడికి మనవడు. శక్తి మహర్షికి కొడుకు. వ్యాస మహర్షికి తండ్రి. కాబట్టి ఈయన ఎంత గొప్ప మహర్షో అర్థమై ఉంటుంది. కల్మాషపాదుడనే రాజు వేటాడి వస్తూ దారిలో కనిపించిన శక్తి మహర్షిని పక్కకు తప్పుకో అన్నాడు. మహర్షి ఎదురు వస్తే నమస్కరించాలి కానీ, అలా అనకూడదు కదా! మహర్షి అదే విషయాన్ని రాజుకు చెప్పాడు. దాంతో రాజు మహర్షిని కర్రతో కొట్టాడు. దీంతో రాజుని రాక్షసుడిగా మారిపోతావని శపించాడు శక్తి

కచుడి విద్యాదీక్ష

ఈ కథ మహాభారతంలోని ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో ఇతర వ్యవహారాల మీదకు మనసు పోనివ్వకుండా చదివితే మంచి ఫలితాలు సాధించగలమని ఈ కథ ద్వారా మహాభారతం చేస్తోన్న హితబోధ ఇది. ఇక, కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం నాటి మాట! కశ్యపుడు అనే ముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు. ఈ అన్నదమ్ములు (రాక్షసులు, దేవతలు) నిరంతరం

పసివాడి ప్రజ్ఞ

మహా భారతంలోని అరణ్యపర్వంలోనిది ఈ కథ. విదేహ రాజ్యాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు. ఎంతటి మహా విద్వాంసుడైనా వందితో వాదించి గెలవలేకపోతున్నారు. అందరినీ తన పాండిత్యంతో ఓడిస్తున్న వంది ఒకనాడు, ‘నాతో వాదించి ఓడిన వారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను’ అని మిక్కిలి అహంకారంతో ప్రకటించాడు. అలా ఎందరినో తన విద్వత్తుతో వివిధ అంశాలలో ఓడించి, వారిని నదిలోకి తోయించి గర్వంతో మిడిసి పడేవాడు. ఆ రోజులలో ఉద్ధాలకుడి

సుందోపసుందులు

ఇద్దరు తమలో తాము పోట్లాడుకుని ఇద్దరూ నాశనం కావడాన్ని ‘సుందోప సుందుల న్యాయం’ అంటారు. ఈనాటికీ మారుమూల పల్లెలలోనే కాక, మహా నగరాలలో కూడా భారతదేశ సంస్కారం కలిగిన వారు ఈ సామెతను వాడుతుంటారు. ఎవరైనా ఇద్దరు వివేకం మరిచి పోట్లాడుకుంటుంటే, వారిని సుందోపసుందుల్లా కొట్టుకుంటున్నారని అనడం కద్దు. ఈ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు చెప్పింది. ఒకనాడు నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. తన వద్దకు అతిథులుగా వచ్చిన వారి నుంచి

ఇచ్ఛాపథ్యం.. నిశిక్రందం

ఆయుర్వేద గ్రంథాలలో వైద్యం, రోగం, చికిత్స, రోగ లక్షణాలకు సంబంధించి అనేక పారిభాషిక పదాలు ఉన్నాయి. ఆయా పదాలకు అర్థాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. వేలి మీద ఏదైనా ఉబ్బెత్తు వాపు కనిపిస్తే కణుపు వచ్చింది అంటాం. కానీ ఆయుర్వేద పరిభాషలో దీన్ని ‘అంగుళిపర్వ’ అంటారు. ఒళ్లంతా ఒకటే ‘నొప్పులు’ అంటాం. ఆయుర్వేదంలో దీన్ని ‘అంగమర్దం’గా చెప్పారు. శరీరం స్పర్శ జ్ఞానం కోల్పేతే దాన్ని ఆయుర్వేదం ‘అంగసుప్తి’ అని పేర్కొంది. ఇంకా

Top