ప్రళయ కాలం

అది వైకుంఠం. శ్రీమన్నారాయణుడు, శ్రీలక్ష్మీదేవి ఏవో ముచ్చట్లలో మునిగిపోయి ఉన్నారు. అంతలో విష్ణువు, ‘లక్ష్మీ! మా బావ శివుడిని, నా చెల్లి పార్వతిని పలకరించి చాలా రోజులైంది. అంతేకాదు, ఒక ముఖ్య విషయం వారితో చర్చించాలని అనుకుంటున్నాను. గరుత్మంతుడు ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రశ్నించాడు. ‘నాథా! గరుత్మంతుడు అనంతనాగునితో ముచ్చట్లాడుతున్నాడు. ఇప్పుడే పిలుస్తానుండండి’ అని బదులిచ్చింది లక్ష్మి. ‘సమయం మీరిపోతోంది. గరుత్మంతుడిని తొందరగా రమ్మను’ అన్నాడు విష్ణువు. స్మరణ మాత్రం చేతనే గరుత్మంతుడు తన దేవర చెంత

నేనే శివుడు.. శివుడే నేను!

భగవంతుడిని, భక్తుడిని అనుసంధానించేది ‘మంత్రం’. మంత్రంలో భగవంతుడి సర్వశక్తులు నిబిడీకృతమై ఉంటాయి. మంత్రంలో ‘మన’ అంటే మనసు. త్ర అంటే బట్వాడా చేయడం. అంటే శక్తిని ప్రసరింప చేయడం. ఒక మంత్రాన్ని సరిగా నేర్చుకుని, అర్థం చేసుకుని, శ్రద్ధగా జపిస్తే అది అనవసర కోరికల వల్ల కలిగే అలజడి, అశాంతి నుంచి మనిషిని విముక్తం చేస్తుంది. సర్వ మంత్రాలలోనూ శివ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. వాటిని చదివి అర్థం చేసుకుని జపించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. ఓం

దీపారాధన..అంతరార్థం

హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యమైనా దీపారాధనతోనే ఆరంభం అవుతుంది. అలాగే పూజా కార్యక్రమం కూడా ముందుగా దీపారాధనతోనే ప్రారంభమవుతుంది. దీపారాధన అంటే ప్రమిదలో నూనె, వత్తి వేసి వెలిగించేదని అర్థం. దీపం వెలిగించాలంటే అగ్ని కావాలి. అగ్ని ఘర్షణ ద్వారానే పుడుతుంది. పూర్వకాలంలో యాగాది క్రతువులలో హోమాగ్నిని జ్వలింప చేయడానికి ‘ఆరణి’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించే వారు. ఈ ఆరణిలో రెండు చెక్క గిన్నెలాంటివి పొడవాటి కొయ్యకు అనుసంధానించి ఉంటాయి. మధ్య

ఔరౌర.. ఇగురావ కూర!

క్రీడాభిరామం.. ఈ గ్రంథం నాటి జనుల ఆచార వ్యవహారాలు, ఆహార నియమాల గురించి ఎన్నో వివరాలు అందిస్తోంది. వినుకొండ వల్లభరాయుడు ఈ గ్రంథకర్త. ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ప్రజల ఆచార వ్యవహారాలు ఇందులో ఉంటాయి. చలికాలంలో ప్రజలు ఇగురావకూరతో, కొత్తబియ్యం అన్నం, మీగడ పెరుగుతో, నేతితో తినేవారని ఈ క్రింది పద్యం చెబుతోంది. శీతకాలంబు కడి మాడ సేయ గుడుచు భాగ్యవంతుడు ఱేపాడి పల్లెపట్ల గ్రొత్త యోరెంబు నిగురావకూరతోడ బిఛ్చిలంబైన నేతితో బెరుగుతోడ ఈ పుస్తకంలోనే ‘కొర్రయో

శివకేశవ మాసం

ఆంగ్లమానం ప్రకారం పదకొండవ మాసం నవంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ - కార్తీక మాసాల కలయిక. ఆశ్వయుజ మాసంలోని కొన్ని రోజులు, కార్తీక మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. నవంబరు 1, ఆశ్వయుజ బహుళ చతుర్థి నుంచి నవంబరు 13 ఆశ్వయుజ బహుళ అమావాస్య వరకు ఆశ్వయుజ మాస తిథులు, ఆపై నవంబరు 14 కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి నవంబరు 30

Top