ఆలయ శిఖరం

దైవ కార్యాలకు పునాదులు ఎలా పడతాయో, అసలు దైవికమైన ఆలోచనలు ఎలా కలుగుతాయో ఎవరూ చెప్పలేరు. అది ఆ భగవంతునికే ఎరుక. దేవుడే తన కార్యాలను కొందరు భక్తులను సాధనగా చేసుకుని వాటిని నిర్వర్తింప చేసుకుంటాడు. అటువంటిదే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అట్లాంటాలో గల హిందూ టెంపుల్‍ నేపథ్యం. ‘హిందూ టెంపుల్‍ ఆఫ్‍ అట్లాంటా’గా విశ్వ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ ఎలా జరిగింది? ఆ దైవిక

వినాయక పాఠం

వినాయకుడిని- సుముఖుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, లంబోదరుడు, వికటహాసుడు, వక్రతుండుడు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ అంగాల పేర్లు. ఒక్కోటి ఒక్కో సుగుణానికి ప్రతీక. ఆ సుగుణాలన్నీ కలవాడే సమర్థ నాయకుడు మన హైందవ ధర్మంలోని దేవతలది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఆయా దైవాంశాల్లోని ప్రత్యేకతలను అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదగటమే మనిషి విద్యుక్త ధర్మం. దేవుడిని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే సాధనగా ఉప యోగించుకున్నంత కాలం మనిషిలో ఆధ్యాత్మిక వికాసం కలగదు.

అమ్మ బాషాకు వందనం

అ- అమ్మ, ఆ- ఆవు అని చదవడమే చిన్నతనమని భావించే రోజులొచ్చేశాయి. ‘మాతృభాష సరిగ్గా నేర్వని వారికి ఇతర భాషలు లొంగవు’ అని జార్జి బెర్నార్డ్ షా చద్దన్నంలాంటి మాట చెప్పాడు. కానీ, మన తరమంతా పరభాషా ఫాస్ట్ఫుడ్‍కు అలవాటు పడిపోతోంది. తెలుగు మాట్లాడటమే నామోషీ.. ఆంగ్లం ఫస్ట్ లాంగ్వేజ్‍ అని చెప్పుకోవడానికి గర్వకారణం.. అనే భావన పెరిగి పెద్దదవుతోంది. ‘అమ్మ భాష మకరందం’ అంటారే కానీ, జుర్రుకునే

గురువే దైవమైనది

గురువు అంటే ఎవరు? గురువు అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలు సహజంగా తలెత్తేవే. నిజానికి భారతదేశమే ఒక జగద్గురువు. అపారమైన గురు పరంపరకు నిలయమైన ఈ పుణ్యగడ్డ ప్రపంచానికే గురువు వంటిది. ఇక్కడ పుట్టిన వేదం కూడా జగద్గురువే. ఇక్కడే ఆవిర్భవించిన యోగా నేడు అంతర్జాతీయ గురువు కూడా!. ఇక గురువు అంటే ఎవరనే విషయానికి వద్దాం. అసలు మనం పలికే మంత్రాలు, మాటలు పుట్టినవే గురువు ముఖతా. మంత్రాలకు

పల్లె ఖ్యాతి…. సంక్రాంతి

సంక్రాంతి తెలుగు వారి పెద్ద పండుగ. పంటల పండుగ. తెలుగు పల్లెలన్నీ కళకళలాడే పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ ఇది. ఈ పండుగకు చాలా రోజుల ముందు నుంచే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజల మనసులు తాము పుట్టి పెరిగిన పల్లె లకు చేరుకుంటాయి. అమ్మతోటి అనుబంధాన్ని, చిన్నప్పటి ఆట పాటలను, బాల్యస్నేహాలను, చిలిపి పనులను, బడిలో చదువుకున్న పాఠాలను అందరూ గుర్తు చేసుకునే సమయ మిది.

Top