‘అనంత’శ్రేయస్సు మీ సొంతం

మన సంస్క•తీ సంప్రదాయాలలో వ్రత కథలకు పెద్దపీట వేశారు. ఇవి నిష్టగా ఆచరించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు.. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే పక్రియలు. వీటిని ఆచరించడానికి అనువైన విధంగా ఆయా తిథులను నిర్దేశించారు. ఆ సమయంలో ఉండే వాతావరణానికి తగినట్టు ఆహార నియమాలను పాటిస్తూ, ఈ వ్రతాలను ఆచరించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతాయి. సెప్టెంబరు

చిన్ముధ్రరూపంలో.. చిదాత్మగా…

దక్షిణామూర్తి ఈశ్వరాలయాల్లో దక్షిణ దిక్కున విలసిల్లే దైవం. ఆయన గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానంద మూర్తినే స్మరించుకుంటూ చేసి ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి - స్థితి - లయాలకు కారణభూతుడైన పరమ గురువును తన కవితాధారతో స్తుతించడానికే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు కనిపిస్తుంది. రాహుగ్రస్త దివాకరేందుసదృశో మాయా

కోటలో శివుడు భక్త సులభుడు

భక్త సులభుడూ, భోళా శంకరుడూ అయిన పరమశివుడు ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్నాడు. వాటిలో ప్రముఖమైనదీ, అతి ప్రాచీనమైనదీ శిలా వరంగల్‍లోని కోటలో వెలసిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి క్షేత్రం. కాకతీయుల ఆరాధ్య దైవంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామి దర్శనం సర్వ శుభప్రదం. చెంబెడు నీళ్లు అభిషేకిస్తే చాలు మహధానంద పడిపోయే ఆ జంగమయ్య ఆర్తితో తలచినంతనే నేనున్నానంటూ అభయం ఇస్తాడు. ఆ దేవదేవుడి నిలయంగా పురాతన క్షేత్రాల్లో

Top