ఈ భక్తులు రాముడు వదిలిన బాణాలు

అయోధ్య వివాదానికి సంబంధించి ఎందరో అవిశ్రాంతంగా అహోరాత్రులు తమ తమ ప్రయత్నాలు చేశారు. కొందరు న్యాయ పోరాటం.. కొందరు ఉద్యమ బాట.. మరికొందరు యాత్ర.. ఇలా తోచిన రూపాల్లో ఉద్యమాన్ని బలంగా హిందువు ల్లోకి తీసుకెళ్లారు. రాముడు సంధించి వదిలిన బాణాల్లా పని చేసిన పరమ వినయ విధేయ రామ భక్తుల పరిచయం.. మూల విరాట్టు నాయర్‍.. రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివా దానికి సంబంధించి మూల విరాట్టు వంటి వ్యక్తి

ఇతిహాస నగరి..అయోధ్య పురి

అదిగదిగో.. నా రాముడు పుట్టిన నేల.. అదే రామ్‍ ఛబూత్రా.. బుల్లి రాముడు అక్కడే ‘రామ్‍లల్లా విరాజ్‍మాన్‍’గా వెలుగొందాడు. అదిగో సీతమ్మ తన కుటుంబం కోసం వంటలు చేసిన ‘రసోయీ’.. రాములోరి కుటుంబం తమ ఇంటి అవసరాల కోసం వినియోగించిన ‘సీతా కూప్‍’ అదే.. రాముడు సీతతో కలిసి జీవనం సాగించిన.. రాముడు ధర్మబద్ధంగా ఏలిన నేల అది. అదే రామజన్మభూమి. శతాబ్దాలుగా నలుగుతూ.. దశాబ్దాలుగా వివాదాలకు కారణమవుతూ.. తను

‘మన’ భావనను పెంచే వన భోజనం

మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ఇది అత్యంత శక్తివంతం మరియు మహిమాన్వితమైనది. స్నానం, అభిషేకం, అర్చన, ప్రదక్షిణ, దీపారాధన, అన్నసంతర్పణ.. ఇవీ ఈ మాస విశిష్టతలు. ఇవన్నీ పాపనివ•త్తికి మార్గాలు. శత•వులను జయించి, విజయలక్ష్మిని వరించటానికి చక్కటి సాధనం శుభప్రదమైన కార్తీక మాసమని అమరవాణి సందేశంలో వివరించారు. ‘అభిషేక ప్రియశ్శివః’ అనే రుషి వాక్యాన్ని అనుసరించి సూర్యకిరణం సోకే సమయానికి శివునికి అభిషేకం చేయాలి. మారేడు దళాలు శివుడు ఇష్టపడే పత్రాలు.

ఒక్కో పాత్ర.. ఒక్కో విచిత్ర కథ

మహా భారతంలో అష్టాదశ (18) పర్వాలు ఉన్నాయి. వాటిలో నాలుగవది విరాట పర్వం. ఇది అత్యంత హాస్యరసంగా ఉంటూనే అనంతమైన ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించే పర్వం. అందుకే తిక్కన విరాట పర్వం గురించి రాస్తూ.. ‘ఇది హ•దయానికి ఆహ్లాదం కలిగించేది’గా పేర్కొ న్నాడు. ఈ పర్వం ఒక అంతర్నాటకం వంటిది. ఈ నాటకంలోని పాత్రలు, పాత్రధారులు మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతారు. ఈ పర్వంలో పాండవులు మారు రూపాలతో

యింతి చెలువపు రాశి..

।।ప।। ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ।।చ।। కలికి బొమ విండ్లు గల కాంతకును ధను రాశి మెలయు మీనాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి చెలగు హరిమధ్యకును సింహరాశి ।।చ।। చిన్న మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె పాయపు సతికి కన్నె రాశి వన్నెమైపైడి తులదూగువినతకు తులరాశి తి న్నని వాడి గోళ్ల సతికి వృశ్చికరాశి ।।చ।। ఆముకొని మొరపుల మెరయు నతివకు వృషభరాశి జామిలి గుట్టుమాటల సతికి కర్కాటక

Top